ప్రపంచంలోని ప్రముఖ స్పెక్యులేటర్లలో ఒకరయిన జార్జి సోరోస్ సట్టావ్యాపారాల పెట్టుబడి (స్పెక్యులేటివ్ కాపిటల్) వల్ల కలిగే దుష్పరిణామా లను గురించి ఓ పుస్తకాన్ని వ్రాశాడు. వెంటనే వామపక్ష మేధావులంతా ఎగబడి “పెట్టుబడి ప్రపంచీకరణ” వల్ల మానవాళికి పెనుప్రమాదం ముంచుకొస్తోందని చెప్పటానికి సోరోస్ ఉటంకించిన సూక్తులను వల్లించటం మొదలుపెట్టారు.
ఈ నేపధ్యంలో సోరోస్‌కు ఉచిత ప్రచారమూ, పారితోషికాల పెంపూ, రాజకీయంగానూ, మేధోపరంగానూ అతని హోదా పెరిగిపోవటమూ, సట్టా పెట్టుబడుల నిర్వహణ ద్వారా అతనికి వచ్చే లాభాలు యధావిధిగా అందుతూనే ఉండటమూ వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రయోజనాలు చేకూరింది సోరోస్‌కు మాత్రమే కాదు-వామపక్ష మేధావులు తమ వాదనల సమర్ధింపుకోసం ఆధారాలుగా స్వీకరిస్తున్న బూర్జువా మేధావులందరికీనూ. వామపక్ష దృక్పథంతో కూడిన పరిశోధన మీదా, జ్ఞానం మీదా విశ్వాసం గానీ, సానుభూతిగానీ లేనట్టుగా ప్రవర్తించటం వామపక్ష మేధావులకు ఇటీవల మామూలైపోయింది. బూర్జువా మర్యాదలకోసం వీళ్ళిలా పాకులాడ్డంవల్ల రాజకీయ-మేధోరంగాలలో ఒక సమాంతర సంస్కృతిని అభివృద్ధి పరుచుకునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
కార్మికుల, గ్రామీణ శ్రామికుల పరిస్థితులకూ ఆ వర్గాలపై నయా – ఉదారవాద పార్టీలకు ఏర్పడిన ఆధిపత్యం వల్ల శ్రామికుల్లో ఏర్పడిన విచ్ఛిన్నత, వేర్పాటువాదం వంటి సమస్యలకూ మధ్యన ఘర్షణ
తీవ్రతరమవుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారింది. ఈ వాతావరణం మూడవ ప్రపంచ దేశాల్లోనూ, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లోనూ కూడా కనబడుతూనే ఉంది.
ఒకవైపున వర్గాలూ, జాతులూ, జెండర్లూ, ప్రాంతాలూ వంటి అస్తిత్వాల మధ్యన అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. మరొక వైపున ధనవంతులకు పన్నుల తగ్గింపూ, రాయితీల పెంపూ వంటి చర్యలకోసం పేదలకు అందాల్సిన సామాజిక సేవలు సన్నగిల్లుతూ ఉన్నాయి. ఈ పరిణామాలపై ప్రతిఘటన కూడా అంతంతమాత్రంగానే కనబడుతుంది. సమ్మెలూ, ఆందోళనలూ జరిగినప్పుడల్లా ఉద్యమకారులపై దాడులు జరుగుతున్నాయి. వ్యవసాయదారుల ఉద్యమాలకు పట్టణ ప్రాంతాల నుంచి తగిన సహకారం దొరకటం లేదు. మేధోవర్గంలోని అత్యధిక సంఖ్యాకులు ప్రజాఉద్యమాలకు దూరమవటమూ ప్రపంచీకరణ అనివార్యతను అంగీకరించటమూ జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తీవ్రమైన అసమానతలతో కూడిన దోపిడీ వ్యవస్థను బలపరిచే ‘బూర్జువా ఆధిపత్యం’ కీలక పాత్రను పోషిస్తూ వుంది. ఈ ఆధిపత్య వ్యవస్థలో ప్రసారసాధనాలూ, ప్రభుత్వ సాంస్కృతిక సంస్థలతోబాటుగా మరెన్నో శక్తులూ భాగంగా ఉన్నాయి. తమ మేధోశక్తులకు బూర్జువా ప్రపంచపు ఆమోదం కావాలని తపించే వామపక్ష మేధావుల ఈ ప్రవర్తన కూడా బూర్జువా ఆధిపత్యాన్ని మరింతగా స్థిరపరుస్తోంది.
ఇటీవలి కాలంలో అనేకమంది వామపక్ష మేధావులు సమకాలీన సామాజిక పరిణామాలను విశ్లేషించేందుకు బూర్జువా సిద్ధాంతవేత్తల, ప్రచారకుల భావాలను అరువు తెచ్చుకుంటున్నారు. ‘ప్రపంచీకరణ’, ‘రాజ్యరహిత పెట్టుబడి’, ‘సమాచార విప్లవం’, ‘వ్యవస్థాగత సర్దుబాటు’, ‘శ్రమ సారళ్యత’ వంటి భావనలన్నీ బూర్జువా భాషాడంబరానికి చెందినవే. ఈ ఆలోచనలన్నీ సామ్రాజ్యవాద వ్యవస్థనూ, నయా – ఉదారవాద సిద్ధాంతాన్నీ బలపరిచేందుకే కదా? ఒక ఆధిపత్య వ్యవస్థ తన పెత్తనానికి సాధికారతను కల్పించటానికి సృష్టించుకున్న భావనలే ఇవన్నీ. ఐనప్పటికీ సమకాలీన
సమాజంలోని అధికార సంబంధాలను నిర్వచించటానికి మరింత క్లుప్తమైన, మెరుగైన మాటలను రూపొందించటానికి కొందరు ప్రజానుకూల వామపక్ష పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉదా:- ప్రపంచీకరణ బదులుగా సామ్రాజ్యవాదం – రాజ్యరహిత కార్పోరేషన్లకు బదులుగా సామ్రాజ్యవాద వ్యవస్థ – సమాచార విప్లవానికి బదులుగా ఆర్థికశక్తుల పురోగమనము శ్రమ సారళ్యతకు బదులు తీవ్రమైన/విస్తృతమైన దోపిడీ-ఆర్థిక సంస్కరణకు బదులుగా ఆర్థిక తిరోగమనమూ వ్యవస్థాగత సర్దుబాటుకు బదులుగా సంపద పునర్కేంద్రీకరణ/సంపద ఆధిపత్యం వంటివి.
ప్రపంచీకరణ సాకుతో కొందరు వామపక్షవాదులు బూర్జువాల వెనుక తోక ఊపుతూ తిరగటమనేది వాళ్ళ లొంగుబాటులో ఒక భాగం. సత్యం, సార్వజనీనతల వంటి విలువల కోసమూ తమ వ్యక్తిగత ప్రతిష్ట, గుర్తింపుల కోసమూ ఈ మేధావులు ఆధిపత్య శక్తులవైపు చూస్తున్నారు. బూర్జువా ప్రతిష్టలూ, గుర్తింపులూ, సంస్థాగత సంబంధాలూ, ఆమోదాల వంటి ప్రయోజనాల కోసం పాకులాడుతూ బూర్జువా విలువలను వాటేసుకుంటున్నారు. ఇలా ఆ విలువలనూ, ఆచరణనూ ఈ వామపక్ష మేధావులు ఇంతగా ఆవాహనచేసుకోవటం ఫలితంగా బూర్జువా ఆధిపత్యం మరింత స్థిరపడి, వామపక్షాల ప్రతిఘటన సన్నగిల్లుతోంది.
ఉన్నతమైన పదవులూ, గుర్తింపూ, బూర్జువా సంస్థల్లో స్థానాలూ వంటి అవకాశాల సంపాదనే ఈ వామపక్ష మేధావుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అందుగ్గానూ ఆధిపత్యశక్తులు ఆడించినట్టల్లా ఆడుతూ దాన్ని తమ మేధోకృషికి దక్కిన గుర్తింపుగా ఈ మేధావులు చెప్పుకుంటున్నారు. వీళ్ళ ప్రవర్తన కారణంగా బూర్జువా సమాజపు నియమాలకు సామాజిక ఆమోదనీయత చేకూరుతుంది.
ఆధిపత్యానికి ఆమోదనీయత :
ఇటీవలి వామపక్షవాదులు చేసే పరిశోధనలకు ఒక ప్రధాన లక్షణం ఉంది. తమకు ఉపయోగపడే ఆధారవనరులు వామపక్ష భావజాలంలో
సమాజంలోని అధికార సంబంధాలను నిర్వచించటానికి మరింత క్లుప్తమైన, మెరుగైన మాటలను రూపొందించటానికి కొందరు ప్రజానుకూల వామపక్ష పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉదా:- ప్రపంచీకరణ బదులుగా సామ్రాజ్యవాదం – రాజ్యరహిత కార్పోరేషన్లకు బదులుగా సామ్రాజ్యవాద వ్యవస్థ – సమాచార విప్లవానికి బదులుగా ఆర్థికశక్తుల పురోగమనము శ్రమ సారళ్యతకు బదులు తీవ్రమైన/విస్తృతమైన దోపిడీ-ఆర్థిక సంస్కరణకు బదులుగా ఆర్థిక తిరోగమనమూ వ్యవస్థాగత సర్దుబాటుకు బదులుగా సంపద పునర్కేంద్రీకరణ/సంపద ఆధిపత్యం వంటివి.
ప్రపంచీకరణ సాకుతో కొందరు వామపక్షవాదులు బూర్జువాల వెనుక తోక ఊపుతూ తిరగటమనేది వాళ్ళ లొంగుబాటులో ఒక భాగం. సత్యం, సార్వజనీనతల వంటి విలువల కోసమూ తమ వ్యక్తిగత ప్రతిష్ట, గుర్తింపుల కోసమూ ఈ మేధావులు ఆధిపత్య శక్తులవైపు చూస్తున్నారు. బూర్జువా ప్రతిష్టలూ, గుర్తింపులూ, సంస్థాగత సంబంధాలూ, ఆమోదాల వంటి ప్రయోజనాల కోసం పాకులాడుతూ బూర్జువా విలువలను వాటేసుకుంటున్నారు. ఇలా ఆ విలువలనూ, ఆచరణనూ ఈ వామపక్ష మేధావులు ఇంతగా ఆవాహనచేసుకోవటం ఫలితంగా బూర్జువా ఆధిపత్యం మరింత స్థిరపడి, వామపక్షాల ప్రతిఘటన సన్నగిల్లుతోంది.
ఉన్నతమైన పదవులూ, గుర్తింపూ, బూర్జువా సంస్థల్లో స్థానాలూ వంటి అవకాశాల సంపాదనే ఈ వామపక్ష మేధావుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అందుగ్గానూ ఆధిపత్యశక్తులు ఆడించినట్టల్లా ఆడుతూ దాన్ని తమ మేధోకృషికి దక్కిన గుర్తింపుగా ఈ మేధావులు చెప్పుకుంటున్నారు. వీళ్ళ ప్రవర్తన కారణంగా బూర్జువా సమాజపు నియమాలకు సామాజిక ఆమోదనీయత చేకూరుతుంది.
ఆధిపత్యానికి ఆమోదనీయత :
ఇటీవలి వామపక్షవాదులు చేసే పరిశోధనలకు ఒక ప్రధాన లక్షణం ఉంది. తమకు ఉపయోగపడే ఆధారవనరులు వామపక్ష భావజాలంలో
ఉన్నప్పటికీ వాటిని వదిలి బూర్జువా భావజాలానికి సంబంధించిన ఆధారాలను వీళ్ళు ఎన్నుకుంటున్నారు. ఈ చర్యలకు సమర్ధనగా వాళ్ళొక మిధ్యావాదాన్ని కూడా తయారుచేసి పెట్టుకుంటారు. సాధారణ ప్రజానీకాన్నీ, మేధోవర్గాలనూ మెప్పించగలిగే లక్షణాలు బూర్జువా వనరుల్లోనే అధికంగా ఉంటాయని వాదిస్తారు. ఈ పద్ధతి ద్వారా బూర్జువా రచయితలను సార్వజనీన సత్యాల ఆవిష్కర్తలుగా ఉన్నత స్థానాల్లో కూర్చోపెట్టే పనిని ఈ వామపక్ష మేధావులు చేసిపెడుతూ ఉంటారు. అంతేగాక ప్రఖ్యాత వామపక్ష పరిశోధకుల కృషిని తమ రచనల్లో ఎక్కడా ప్రస్తావించకుండా ఈ రంగాల్లో వాళ్ళు చేసిందేమీ లేదన్న భావాన్ని కలిగిస్తూ ఉంటారు. తమ బూర్జువా మిత్రులు ఏగ్రంథాలనైతే ‘చదివితీరాల్సిన’విగా పేర్కొంటారో అవే అభిప్రాయాలను తాము కూడా వ్యక్తం చేస్తూ బూర్జువా సమాజంలో గౌరవనీయతనూ, కీర్తినీ సంపాదించుకుంటారు. పెట్టుబడిదారీ విధానానికి అండగా నిలుస్తూ దానిపై పై పై విమర్శలు చేసే కొందరు విమర్శకులను ఈ వామపక్ష మేధావులు విపరీతంగా కీర్తిస్తూ ఉంటారు.
జార్జి సోరోస్ పుస్తకంపై వామపక్ష మేధావుల ప్రతిస్పందనలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఈ పుస్తకం వెలువడకముందే అనేక దేశాలపై జరిగే ఆర్థిక దోపిడీనీ, విధృంసాన్నీ ముందుగానే ఊహించి చెప్పిన దార్శనికుడిగా, సోరోస్‌కు గొప్ప కీర్తి లభించింది. సాంస్కృతిక సంస్థలను కూడగట్టటంలోనూ- స్వేచ్ఛా వాణిజ్య విధానాల రూపకల్పనతో తమ దేశాలను సర్వనాశనం చేసిన మాజీ కమ్యూనిస్టు దేశాల మేధావులను చేరదియ్యటం లోనూ సోరోస్ పోషించిన, పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైనది. ఇదంతా తెలిసి కూడా అతని ఊహాశక్తినీ, వ్యవస్థాగత లోపాలపై అతని విమర్శలనూ ఈ వామపక్ష మేధావులు మాటిమాటికీ ఉటంకిస్తూ ఉంటారు. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవటానికి కారణమైన చర్యల్లో సోరోస్ వహించిన పాత్ర గురించి ఈ మేధావులకు తెలుసు. ఐనప్పటికీ నయా ఉదారవాదంపై విమర్శించే ప్రతిసందర్భంలోనూ సోరోస్ మాటలనే వల్లిస్తూ ఉంటారు.
ప్రపంచ బ్యాంకుతో ఈ వామపక్ష మేధావులకు ఏర్పడిన సంబంధాలనూ – గౌరవనీయత కోసం వాళ్ళ పాకులాటనూ కలిపే చూడాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాల్లోని పేదరికాన్ని గురించిన వివరాలతో ప్రపంచబ్యాంకు ప్రతిఏటా ఒక నివేదికను విడుదల చేస్తుంది. అందులో పేదరికాన్ని నిర్ణయించే ప్రమాణాలు ఏమిటన్న విచక్షణ లేకుండానే ప్రపంచ బ్యాంకు చెప్పే ఈ లెక్కలను ఈ మేధావులు తమ పరిశోధనల్లో చేరుస్తూ వుంటారు. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రోజువారీ సంపాదన ఒక డాలరుకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళంతా దారిద్రరేఖకు ఎగువన ఉన్నవాళ్ళే. ఈ విషయంలో వామపక్ష దృక్పథంతో గనుక పరిశీలన చేసివుంటే ప్రపంచంలోని పేదలసంఖ్య ప్రపంచబ్యాంకు చెప్పిన దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ఈ సంగతి మన వామపక్ష మేధావులకు స్పష్టంగా తెలుసు. ఐనప్పటికీ యధాతథవాదులైన తమ మిత్రుల మెప్పుకోసం ప్రపంచబ్యాంకు గణాంకాలనే స్వీకరిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రపంచబ్యాంకుకు కూడా ఈ మేధావులు విశ్వాసపాత్రులుగా మారుతున్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పే లెక్కలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే, అమెరికా, కెనడాల్లోనూ – ఆగ్నేయాసియాలోనూ పేదలశాతం ఒకేవిధంగా ఉన్నదని వాళ్ళ అంచనా.
ఈ వామపక్ష మేధావులకు అంగీకార యోగ్యమైన మరొక సంస్థ ‘ది ఎకనమిక్ కమీషన్ ఆఫ్ లాటిన్ అమెరికా’ (ECLA). ఉదాహరణకు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా IKIA ఇచ్చే గణాంకాల మీదనే ఈ మేధావులు ఆధారపడుతుంటారు (నిజానికి ECLA రాజకీయ ఎజెండాలో ప్రైవేటీకరణ అనేదొక ముఖ్యమైన అంశం). ఈ సంస్థ నివేదికలను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అందులో ప్రైవేటీకరణ క్రమంలో జరిగే అవినీతిని గురించి ఏమీ ఉండదని అర్ధమవుతుంది. ఈ సంస్థ ప్రైవేటీకరణను కేవలం ఒక ఆర్థికరంగ పరిణామంగా చూపిస్తుందే తప్ప, దానివల్ల జరిగే తక్షణ, దీర్ఘకాలిక దుష్పరిణామాల గురించి ఏమీ చెప్పదు. ఈ వ్యవహారంలో తమకేమీ సంబంధంలేనట్టే ఈ సంస్థ
వ్యవహరిస్తుంది. ప్రైవేటీకరణ ప్రక్రియలో రాజ్యం పారదర్శకంగానే ఉంటున్నదని ECLA వాదిస్తుందే తప్ప, ‘పారదర్శకత’కూ – ప్రైవేటీకరణకూ పొసగదన్న వాస్తవాన్ని అంగీకరించదు. ప్రఖ్యాతి చెందిన వామపక్ష రచయితలూ, పరిశోధకులూ చేసిన సమగ్రమైన, విమర్శనాత్మకమైన విశ్లేషణలు అందుబాటులోనే ఉన్నప్పటికీ ఈ వామపక్ష మేధావులకు ECLA నివేదికలపై ఆసక్తి ఎందుకో?
ప్రముఖులపై ప్రత్యేక శ్రద్ధ :
వామపక్ష మేధావులు గౌరవనీయ స్థానాలపై తమ నిరంతరాన్వేషణలో భాగంగా బూర్జువా సంస్థల గణాంకాలపై ఆధారపడడంతోబాటు బూర్జువా వర్గ ప్రముఖుల పేర్లను నిరంతరం జపిస్తూ ఉంటారు. ప్రజోపయోగమైన ఏ కార్యక్రమాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినా ప్రజలకోసం పోరాడిన కార్యకర్తలుగానీ, రచయితలుగానీ ఈ మేధావులకు గుర్తురావటమే లేదు. ఆ విషయాల్లో కనీస అవగాహన కానీ, ఆచరణకానీ లేని ‘ప్రగతిశీల’ నటుల్నీ, లాయర్లనూ, జడ్జీలనూ, రచయితలనూ కీర్తిస్తూ ఉంటారు.
ఈ పొగడ్తల ద్వారా ప్రసారసాధనాల్లో ప్రాచుర్యాన్ని సంపాదించు కోవచ్చేమో కానీ తాము మాట్లాడుతున్నది ఉత్తి ఊకదంపుడేనన్న సంగతిని ఈ మేధావులు గమనించుకోరు. ఈ రకమైన ఉపన్యాసాలతో నిండిన సభలు కేవలం వినోదకార్యక్రమాల్లా తయారవుతాయే తప్ప ప్రజలను చైతన్యవంతం చేయటానికీ వాళ్ళను పోరాటాల్లోకి నడపటానికీ ఏ మాత్రమూ ఉపయోగపడవు. పైగా వాళ్ళ చైతన్యాన్ని మరింత మొద్దుబార్చుతాయి కూడా. ప్రజలు వాళ్ళ ప్రాణాలనూ, భూమినీ, జీవనోపాధులనూ కాపాడుకునే క్రమంలో అనివార్యంగా జరిగే హింసనూ-సామ్రాజ్యవాద శక్తులు పాల్పడుతున్న హింసనూ ఒకే గాటన కట్టే బూర్జువా ‘ప్రముఖుల’ మాటలు కూడా ఈ వామపక్ష మేధావులకు అద్భుతమైన విశ్లేషణల్లా తోస్తున్నాయి.
“అతను (లేక ఆమె) మన కోవకు చెందిన వ్యక్తి కాదనుకోండి. ఐనా ప్రజలను గురించి ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. వాళ్ళవి బూర్జువా పేపర్లే అయినా అందులో మనకు ఎన్ని సెంటీమీటర్ల చోటు దొరికిందో చూడండి. వాళ్ళ టెలివిజన్ ఛానళ్ళలో మనకు ఎన్ని సెకన్లు కేటాయించారో చూశారా?” అంటూ ఈ వామపక్ష మేధావులు సంజాయిషీలిస్తూ వుంటారు. ప్రజల సమస్యలపై జరిగే ఉద్యమ సభల్లోకి “విశాల ఐక్యసంఘటన” పేరిట బూర్జువా ప్రముఖులను ప్రవేశపెట్టటానికి కూడా వామపక్షవాదులైన ఈ మేధావులు సంశయించరు. ఆ బూర్జువా ఉపన్యాసకులు తమ విమర్శలను కేవలం ప్రభుత్వ విధానాలు కొన్నిటిమీద ఎక్కుపెడుతూ ఒక నిర్ధిష్టమైన వ్యవస్థపై జరగాల్సిన చర్చను దాటవేస్తారు. అంతేకాదు-ఈ వామపక్ష మేధావులచేత ప్రశంసలు పొందిన ఆ బూర్జువా ప్రముఖులు మర్నాటికల్లా తిరోగమన విధానాల అమలులో ముందు నిలబడి ప్రత్యక్షమవుతారు. ఫలితంగా ప్రజలకు వామపక్షవాద రాజకీయాలంటేనే అపనమ్మకమూ, జుగుప్సా కలుగుతాయి.
ప్రతిష్టాత్మకమైన గుర్తింపుల కోసం వెదుకులాట :
తమ బూర్జువా మిత్రుల దృష్టిలో గుర్తింపుకోసం ఈ వామపక్ష మేధావుల్లో పాకులాట పెరిగినకొద్దీ సామాజిక కార్యాచరణతో దూరం పెరుగుతూ వస్తుంది. అంతేగాక సంప్రదాయవాద అధికారులనూ, న్యాయమూర్తులనూ మెప్పించే ప్రయత్నంలో ప్రజారాజకీయాల్లో వున్న తమ పాతమిత్రులతో తెగతెంపులు చేసుకుంటారు. తద్వారా బూర్జువా మర్యాదస్తుల్లో స్థానం పొందేందుకు ప్రయత్నాల్లో పడతారు. బూర్జువా వర్గాలు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డులు దొరికాయంటే ఉన్నత వర్గాల్లోకి ఎగబాకేందుకు ఇక టికెట్ దొరికినట్టే. నోబెల్ బహుమానమో, ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్పో దొరికిందంటే ఇక విజయపధంలోకి అడుగుపెట్టినట్టేనని ఈ మేధావులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. ఆ బూర్జువా సంస్థలు తమ అవార్డులను
ఈ వామపక్ష మేధావులకు అందించటం ద్వారా వీళ్ళను సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలనుంచి పక్కకు లాగవచ్చని గ్రహిస్తాయి. ఈ విషయాన్ని జీన్‌పాల్ సార్త్ అర్థం చేసుకున్నాడు కనుకనే తనకు వచ్చిన నోబెల్ బహుమతిని తిరస్కరించాడు.
ఐతే ఈనాటి ఈ వామపక్షవాద మేధావులు మాత్రం బూర్జువా బిరుదులనూ, బహుమతులనూ స్వీకరించటం ద్వారా వామపక్ష రాజకీయాలకు సమాజంలో గౌరవమూ, గుర్తింపూ లభిస్తాయని వాదిస్తున్నారు. నిజానికి వాస్తవం మరోరకంగా ఉంటుంది. ఈ అవార్డులను అందుకోవటం ద్వారా వాటిని అందించే సంస్థలకూ, కమిటీలకూ విశ్వసనీయతనూ, గుర్తింపునూ చేకూర్చిపెట్టే పనిని ఈ మేధావులు చేసిపెడుతున్నారు. తద్వారా బూర్జువా ఆధిపత్య వ్యవస్థను మరింత సుస్ధిరం చేస్తున్నారు.
వీళ్ళు చేస్తున్న మరొక పని బూర్జువా విద్యాలయాలకు ఎక్కడలేని గౌరవాన్ని ఆపాదించి పెట్టటం. హార్వర్డ్, ఏల్, ప్రిన్సటన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి ల్లాంటి యూనివర్శిటీల్లో చదివామని చెప్పుకోవటం వీళ్ళకొక ఘనకార్యమై పోయింది. నిజానికి ఈ సంస్థలు విద్యార్థులకు బోధిస్తున్నది సామ్రాజ్యవాద, నయా-ఉదారవాద అనుకూల విధానాలను మాత్రమే. ఈ విశ్వవిద్యాలయాలకు ఆపాదించబడుతున్న గౌరవంవల్ల వాటిని కలిగివున్న దేశాల ప్రభుత్వాధిపతులు కూడా గొప్పవాళ్ళుగా చెలామణీ అవుతున్నారు. ఒకప్పుడు ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన మాజీ అధికారులెవరయినా ఈ విద్యాసంస్థల బండారాన్ని విమర్శిస్తూ మాట్లాడితే వాళ్ళవి కాలం చెల్లిన భావాలంటూ కొట్టిపడేసే లక్షణం కూడా ఈ వామపక్ష మేధావుల్లో పెరిగిపోతుంది.
ఈ “మహోన్నత” విశ్వవిద్యాలయాలు తెలివైన పేద విద్యార్థులకు ఉపకారవేతనాలిచ్చి ప్రవేశం కల్పిస్తాయి. ఆ ఔదార్యానికి అసలు కారణం విద్యార్థుల బుర్రల్లో బూర్జువా జ్ఞానాన్ని నింపి వాళ్ళను తమకు బానిసలుగా మార్చాలన్న లక్ష్యమే. ప్రజాదరణ వర్గాల నుంచి ప్రతిభావంతులైన
అభ్యర్థులను తీసుకోవడం ద్వారా బూర్జువా ఆధిపత్యం పునర్నిర్మించ బడుతుందని మార్క్స్ ఏనాడో చెప్పాడు. ఈ విషయాలు తెలిసినప్పటికీ బూర్జువా విద్యాసంస్థల గొప్పతనాన్ని ఈ వామపక్ష మేధావులు ఆమోదిస్తూనే వున్నారు. వీళ్ళు అవార్డులకోసం ఎగబడటం దగ్గరకూడా ఆగటంలేదు. తమ కార్యక్రమాల నిర్వహణను స్పాన్సర్ చెయ్యటానికి బూర్జువా అధికారులూ, సంస్థల కోసం అన్వేషణలో మునిగిపోతున్నారు. ఆ స్పాన్సర్లు ఎంత పేరుపొందిన బూర్జువాలయితే తమ గౌరవం అంతగా ఇనుమడిస్తుందని వీళ్ళ భావన. ఈ ధోరణివల్ల ప్రజానుకూల దృక్పథంతో పని చేసే సంస్థలు నానాటికీ క్షీణించి పోతున్నాయి.
విజయసోపానాల అధిరోహణ :
ఉన్నత స్థానాలకోసం పాకులాడే ఈ వామపక్ష మేధావులలో ప్రధానంగా నాలుగు రకాల వ్యూహాల్ని గుర్తించవచ్చు. మొదటి వ్యూహాన్ని ‘కోల్డ్ స్టోరేజ్’ విధానమని పిలవొచ్చు. వీళ్ళు మొదటి దశలో చాలాకాలంపాటు సాంప్రదాయ చట్రాల పరిమితుల్లో పరిశోధనలు సాగించి ఏదో ఒక ప్రముఖ యూనివర్శిటీలో మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ ఉపన్యాసాలు మొదలు పెడతారు. ఒక వైపున బూర్జువా ప్రపంచంలో సుస్థిరస్థానాన్నీ మరోవైపున తమ వీరాలాపాలతో వామపక్షవాదుల కరతాళ ధ్వనులనూ కూడా పొందుతూ వుంటారు. వీళ్ళను ‘నిరర్థక మేధావు’లని పిలవొచ్చు.
రెండోవ్యూహం ఓ పెద్దయూనివర్శిటీలో ఏదో సంప్రదాయ పరిశోధన చేసి, ఉద్యోగం కూడా సంపాదించేసి ఖాళీసమయాల్లో గంభీరమైన రాజకీయాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుతూ గడపటం. ఇలా వామపక్ష భావజాలాన్ని ఒక ‘వ్యాపకం’గా మలచుకున్న మేధావులు బూర్జువా వర్గాలకు చాలా ఆకర్షణీయంగా కనబడతారు. ఎందుకంటే ఈ రకం మేధావులు శాస్త్రీయమైన అధ్యయనాలకు పూనుకోవటంగానీ, యధాతథవాదులైన
అభ్యర్థులను తీసుకోవడం ద్వారా బూర్జువా ఆధిపత్యం పునర్నిర్మించ బడుతుందని మార్క్స్ ఏనాడో చెప్పాడు. ఈ విషయాలు తెలిసినప్పటికీ బూర్జువా విద్యాసంస్థల గొప్పతనాన్ని ఈ వామపక్ష మేధావులు ఆమోదిస్తూనే వున్నారు. వీళ్ళు అవార్డులకోసం ఎగబడటం దగ్గరకూడా ఆగటంలేదు. తమ కార్యక్రమాల నిర్వహణను స్పాన్సర్ చెయ్యటానికి బూర్జువా అధికారులూ, సంస్థల కోసం అన్వేషణలో మునిగిపోతున్నారు. ఆ స్పాన్సర్లు ఎంత పేరుపొందిన బూర్జువాలయితే తమ గౌరవం అంతగా ఇనుమడిస్తుందని వీళ్ళ భావన. ఈ ధోరణివల్ల ప్రజానుకూల దృక్పథంతో పని చేసే సంస్థలు నానాటికీ క్షీణించి పోతున్నాయి.
విజయసోపానాల అధిరోహణ :
ఉన్నత స్థానాలకోసం పాకులాడే ఈ వామపక్ష మేధావులలో ప్రధానంగా నాలుగు రకాల వ్యూహాల్ని గుర్తించవచ్చు. మొదటి వ్యూహాన్ని ‘కోల్డ్ స్టోరేజ్’ విధానమని పిలవొచ్చు. వీళ్ళు మొదటి దశలో చాలాకాలంపాటు సాంప్రదాయ చట్రాల పరిమితుల్లో పరిశోధనలు సాగించి ఏదో ఒక ప్రముఖ యూనివర్శిటీలో మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ ఉపన్యాసాలు మొదలు పెడతారు. ఒక వైపున బూర్జువా ప్రపంచంలో సుస్థిరస్థానాన్నీ మరోవైపున తమ వీరాలాపాలతో వామపక్షవాదుల కరతాళ ధ్వనులనూ కూడా పొందుతూ వుంటారు. వీళ్ళను ‘నిరర్ధక మేధావులని పిలవొచ్చు.
రెండోవ్యూహం : ఓ పెద్దయూనివర్శిటీలో ఏదో సంప్రదాయ పరిశోధన చేసి, ఉద్యోగం కూడా సంపాదించేసి ఖాళీసమయాల్లో గంభీరమైన రాజకీయాల గురించి పిచ్చాపాటీ మాట్లాడుతూ గడపటం. ఇలా వామపక్ష భావజాలాన్ని ఒక ‘వ్యాపకం’గా మలచుకున్న మేధావులు బూర్జువా వర్గాలకు చాలా ఆకర్షణీయంగా కనబడతారు. ఎందుకంటే ఈ రకం మేధావులు శాస్త్రీయమైన అధ్యయనాలకు పూనుకోవటంగానీ, యధాతథవాదులైన
నిపుణులను ఉత్పత్తిచేసే విద్యావిధానాన్ని ప్రశ్నించటంగానీ ఎన్నడూ చెయ్యరు. ఈ తరహా మేధావులది. ‘కాక్టయిల్ వామపక్షం’గా చెప్పొచ్చు. ఇక మూడో రకం వ్యూహకర్తలు సంప్రదాయబద్ధమైన పాండిత్యంలోనే కొనసాగుతూ ప్రజాఉద్యమాలను ఉద్దేశించి ఉపన్యాసాలు దంచుతుంటారు. నెలలూ, సంవత్సరాలూ వెచ్చించి ఉపన్యాసాలూ, పుస్తకాలు తయారుచేసి పెట్టుకుంటారు. ఉద్యమసభల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా తమ ముక్కిపోయిన సరుకులోంచే మాటల్ని వల్లిస్తారు. గతజీవితంలోని సాహసకృత్యాల గురించిన పురాస్మృతుల్ని నెమరేసుకోవటం వీళ్ళజీవితంలో ఓ ముఖ్యమైన వ్యాపకం.
ఇక చివరగా, నాలుగోరకం వ్యూహాన్ని గురించి చెప్పుకోవాలి. వీళ్ళు పోరాటాలతో, రాజకీయ నిబద్ధతతో ఏ సంబంధమూ లేకుండానే ‘నిర్లిప్తంగా’ పరిశోధనలు చేసుకుంటూ వుంటారు. స్పష్టమైన రాజకీయ దృక్పథమనేది లేకుండానే శ్రామికవర్గ రాజకీయాలపై కుప్పలుతెప్పలుగా రాసిపడేస్తూ వుంటారు. ఈ రచనల్లో యాంత్రికమైన సమాచారం తప్ప మరేమీ దొరకదు. ఈ కోవకు చెందిన వాళ్ళు అమెరికాలో చాలా ఎక్కువగా ఎదురవుతుంటారు. తరచుగా జరిగే సభల్లో, సమావేశాల్లో కూర్చుని ముచ్చటించుకుంటూ వుంటారు. ప్రజాఉద్యమాలకు దూరంగా నిలబడి, వామపక్ష రాజకీయాలపై కబుర్లు చెప్పగల వాళ్ళను ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు వరిస్తూ వుంటాయి. ఈ రకం పండితుల జ్ఞానాన్ని గురించి లోకంలో చాలా భ్రమలు ప్రచారంలో వున్నాయి. మూడో ప్రపంచదేశాల్లోని ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తున్న వామపక్ష మేధావులకు తగినంత గుర్తింపు రాకపోవటానికి కారణం వాళ్ళకు ఈ పండితుల్లాగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల డిగ్రీలు లేకపోవటమే. పేరు పొందిన విద్యాసంస్థల పాఠ్య ప్రణాళికల్లో వామపక్ష సిద్ధాంతాలపై ఎలాంటి వక్రీకరణలు జరుగుతున్నాయో తెలిసి కూడా వాటిలో పదవులు పొందిన పండితులు ఏనాడూ నోరువిప్పరు. అంతేకాక సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనువుగా ఈ యూనివర్శిటీల్లో జరుగుతున్న
పరిశోధనలకు భారీనిధులను అందించే స్పాన్సర్ల గుట్టుమట్లను కూడా ఈ మేధావులు ఎప్పుడూ బయటపెట్టరు. దీనికి ప్రతిఫలంగా అంతర్జాతీయ పత్రికలూ, సమావేశాలూ వీళ్ళకు సముచిత స్థానాలను కల్పిస్తున్నాయి.
సమకాలీన మేధావుల ‘జీవనశైలి’ :
యూరో-అమెరికన్ సామ్రాజ్యవాదశక్తుల సంపదా, అధికారమూ, ఈనాడు విస్తృతరూపం దాల్చాయి. దీంతో సమాజంలోని రాజకీయ వ్యవస్థలో వున్న రకరకాల ‘పోషకుల’ (పేట్రన్స్)కు అవసరమైన సేవలను అందించే మేధావులు నేడు వీరికి కావాలి. ఈ పరిస్థితులు వామపక్ష మేధావులుగా చెలామణీ అవుతున్న కొందరి జీవనశైలిలో నిర్ధిష్టమైన మార్పులను తెచ్చాయి. ఈ మేధావులు ఎప్పుడు ఏ రాజకీయాల్లోకి దూకుతారో ఎవరికీ అంతుపట్టదు. 1995లో ప్రభుత్వోద్యోగుల సమ్మెలను విమర్శించిన ఒక ప్రముఖ ఫ్రెంచి మేధావి 1996లో జపటిస్టాలు నిర్వహించిన అంతర్జాతీయ సభకు హాజరయ్యాడు. ఆ తర్వాత అతడే ఉరుగ్వే అద్యక్షుడిని కలుసుకుని అతడి మితవాద రాజకీయాలను ప్రశంసలతో ముంచెత్తాడు. అంటే అన్నిసందర్భాలకూ, అన్ని రేట్లకూ తగినట్టుగా మేధావులు లభిస్తారన్నమాట. ఎప్పుడు ఎటు నిలబడితే ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయో అంచనా వేసుకుని దానికి తగిన వేషాలను ధరించటం ఈ మేధావుల ప్రత్యేకత. వీళ్ళు మితవాద శిబిరానికి ‘అమ్ముడు’ పోరు గానీ ‘అద్దెకు’ లభిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వామపక్ష శిబిరానికి కూడా వీరు అందుబాటులోకి వస్తుంటారని గమనించాలి.
పోస్ట్-మోడర్నిస్టులమని చెప్పుకునే కొందరు మేధావులు తమకుతాము ఓ ప్రత్యేక ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. అందులో సామాన్యులకు తావులేదు. సమాజంలో ఎన్నిరకాల అస్తిత్వాలున్నాయో, అందులో ఏవేవి చివరిదాకా మిగులుతాయో- లాంటి విషయాలను వీళ్ళు చర్చిస్తూ వుంటారు. వాళ్ళ పదాడంబరం కూడా మామూలు ప్రజలకు మింగుడు పడేదికాదు.
ఇక ‘నయా – ఉదారవాదం’, ‘ప్రపంచీకరణ’ లాంటి సామాజిక – ఆర్ధిక సమస్యలపై చర్చలు చేసే కొందరు మేధావులు ‘దీనికేదయినా ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవాలి’ అని గంభీరంగా మాట్లాడ్డం తప్ప నిజమైన ప్రత్యామ్నాయాలదిశగా సాగుతున్న పోరాటాల ఛాయలక్కూడా వెళ్ళరు. నిజానికి వాళ్ళకు సమస్యను (సామ్రాజ్యవాదం) చూసినా, దాని పరిష్కారాన్ని (సామాజిక పరివర్తన) చూసినా కూడా చెప్పలేనంత భయమే.
తమ నిష్క్రియా పరత్వానికి సాకుల్ని కూడా వీళ్ళు సిద్ధంచేసి పెట్టుకున్నారు. గతంలో జరిగిన ఉద్యమ వైఫల్యాల గురించి నిరంతరం మాట్లాడుతూ, ఆనాటి అపజయాల వల్ల కలిగిన నైరాశ్యంతోనే, ఉన్న వ్యవస్థతో రాజీపడుతున్నామని వీళ్ళు బుకాయిస్తారు. పాశ్చాత్యదేశాల్లోనూ, మూడో ప్రపంచ దేశాల్లోనూ WTOకు వ్యతిరేకంగా జరుగుతున్న నూతన సామాజిక ఉద్యమాలూ, వ్యవసాయరంగ పోరాటాలూ, రవాణా కూలీలు నిర్మిస్తున్న సాహసోపేతమైన ఆందోళనలూ వీళ్ళకు కనబడవు. ఎప్పుడూ గతవైఫల్యాలను తలుచుకుంటూ నిరాశావాదంలో కూరుకుపోతూనే వుంటారు.
ఇంతవరకూ మనం చెప్పుకున్న రకాల మేధావులందరికీ భిన్నంగా ప్రతిష్టాత్మక పదవులమీదా, బహుమానాల మీదా గౌరవంలేని మేధావులు కూడా వున్నారు. వీళ్ళు కోరుకునేస్థానం ప్రజాపోరాటశక్తుల హృదయాల్లో మాత్రమే. దృఢ చిత్తంతోనూ, సృజనాత్మకతతోనూ నిండిన వీళ్ళ మేధో కృషి ప్రజాప్రయోజనాలకూ, ఉద్యమ లక్ష్యాలకూ మద్దతుగా నిలబడుతుంది. వీళ్ళు అన్నిరకాల పరిశోధనలనూ నిశితంగా పరిశీలిస్తూ అందరి వాదనలనూ వాళ్ళకున్న పేరు ప్రతిష్టతా, బిరుదులతో పనిలేకుండా, వాళ్ళు చెప్పే దానిలో ఏదైనా విలువైన అంశం వుందా లేదా అన్నదానిని తెలుసుకుంటూ వాళ్ళను ప్రోత్సహించాలన్న ఆశావాద దృక్పథంతో పనిచేస్తుంటారు. ఇటువంటి నిబద్ధతగల మేధావులు ఉద్యమకార్యకర్తలతో కలిసి పని చెయ్యటానికి సిద్ధంగా వుంటారు. పేరు పొందిన బూర్జువా సంస్థల అవార్డులు ఆ వర్గపు ఆధిపత్యాన్ని మరింత స్థిరపరుస్తాయన్న స్పష్టమైన అవగాహన వీళ్ళకు వుంటుంది. వీళ్ళలోని
మరొక ప్రత్యేకత ఏమిటంటే తాము కలిసి పనిచేస్తున్న వామపక్ష సంస్థల్లో కూడా అంతర్గతంగా బూర్జువా లక్షణాలు కనబడినప్పుడు నిర్మొహమాటంగా విమర్శిస్తారే తప్ప, యాంత్రికమైన విధేయతను ప్రదర్శించరు.
ముగింపు :
బూర్జువా శక్తుల ఆధిపత్యాన్ని గుర్తించి ఎంతో విస్తృతమైన పరిశోధన జరిగింది. కానీ, వామపక్ష శిబిరంలో వుంటూనే బూర్జువా ఆధిపత్య స్వభావంతో ప్రవర్తించే మేధావులను గురించిన అద్యయనం చాలా తక్కువేనని చెప్పాలి. మేధావులనే వాళ్ళు ఒక ప్రత్యేకమైన సమూహం. వీళ్ళ ప్రభావం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నిర్దిష్టమైన చైతన్యాన్ని వీళ్ళు పాదుకొల్పగలుగుతారు. అయితే నేడు పరిస్థితి ఎంతవరకూ వెళ్ళిందంటే బూర్జువాల లక్ష్యాలను వీరు పూర్తిగా జీర్ణించుకున్నారు. తద్వారా బూర్జువా ఆధిపత్య ప్రాబల్యాన్ని విస్తృతంగా వ్యాపింప చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాలతో సహా అనేక ప్రజాఉద్యమాల్లో పనిచేసే ఈ మేధావులు చాలా సందర్భాల్లో వ్యక్తివాద ధోరణులను ప్రదర్శించటం ఒక వాస్తవం. ఈ ధోరణి ఇవాళిక ప్రధాన సమస్యగా తయారయ్యింది. దీని ఫలితంగా ప్రజలకు సామాజిక ఉద్యమాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. మూడో ప్రపంచ దేశాల్లోనూ, సామ్రాజ్యవాద దేశాల్లోనూ కూడా ప్రజాసామాన్యం తీవ్రమైన అసంతృప్తిలో, సంఘర్షణలో జీవిస్తున్నది. ఈ ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఉద్యమాల్లోకి సమీకరించటం తక్షణ కర్తవ్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే బూర్జువా శక్తులతోను – వామపక్ష మేధావులు ద్వంద్వ ప్రవృత్తితోనూ ఏకకాలంలో పోరాడగల విమర్శనాత్మక దృష్టిగల మేధావుల సహకారం, విప్లవ సిద్ధాంతం అత్యవసరం.