వసంతమేఘ గర్జన

మూలం: హోసే మరియా సిజాన్

అణిచివేత దాడులతో ఎగిసిన వేడి
ఆకాశాన దట్టమైన నల్లమబ్బులై పేరుకున్నాయి
వచ్చే కొత్త రుతువులో కురిసే వర్షానికి
ఉరుములు, మెరుపులు సూచికలు
పర్వత శిఖరాల మీదుగా సాగే మేఘాల పరుగు
ఉధృతమైన వానగాలి నదీ ప్రవాహపు ఆశరేపింది
విశాల మైదానం మీద కురిసే వర్షానికి
అది మరింత ఆప్త సందేశాన్ని అందిస్తోంది
వృక్షాలు ఆనందంగా ఆకాశంలోకి చేతుల్ని సాచాయి
వచ్చే వర్షానికి ఆహ్వానపు నాట్యమాడుతున్నాయి
వృక్షాల ఆనందగానాలు నవ్వుల హరివిల్లులతో
పొదలు పొరకలు గొంతుకలిపి నిలిచాయి
గాలి రాలిన ఆకులను దూరంగా ఊడ్చేసింది
వరి పొలాల మెరుపులు రెక్కలు సాచాయ్
మంటలు నాల్కలు సాచి దాహార్తిని రెచ్చగొట్టాయ్
భూమి ఉత్సాహంగా వరదల ఒరవడికి ఎదురుచూస్తోంది…

(హోసే మరియా సిజాన్: కవి, తత్వశాస్త్ర అధ్యాపకుడు, సిద్ధాంతకర్త. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ, న్యూ పీపుల్స్ ఆర్మీ ల నిర్మాత. నెదర్లాండ్స్ లో ప్రవాసం ఉన్న హోసే తన ఎనభై మూడవ యేట డిసంబర్ 16, 2022 న అనారోగ్యంతో మరణించారు.)

పుట్టింది బొమ్మాయిపల్లి, నల్లగొండ జిల్లా(పూర్వపు). రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు, రైతు. వివిధ పత్రికల్లో ఫ్రెంచ్ అనువాదాలు ప్రచురితమయ్యాయి.   ప్రస్తుతం  కృతి వ్యవసాయం చేస్తున్నారు.

Leave a Reply