రెండు భాషా ప్రపంచాల మధ్య

మూలం : మౌమిత ఆలం
స్వేచ్ఛానువాదం : ఉదయమిత్ర

మిత్రమా… రకీఫ్
ఎట్టకేలకు జవాబు దొరికింది
ఇక మనం కలిసి ఉండలేం…

నువ్వేమో బతుకులో చావును వెతుక్కునే వాడిని…
నేనేమో చావులోను బతుకుని వెతుక్కునే దాన్ని…

మనిద్దరం
భిన్న భాషా ప్రాంతాల్లో బతికేస్తున్నం

నాకు
A అంటే ఆపిల్ (కాశ్మీరీ)
B ఆంటే బ్యాంక్ బ్యాలన్స్
C ఆంటే క్యాష్ లేక కార్
నేనొక కొత్త కారు కొన్నట్టు నీకు చెప్పనేలేదు
ఎన్ని సౌందర్య సాధనాలు వాడినా
నన్ను వృద్ధాప్యం చుట్టేయక తప్పదు.
నేనొక సాధారణ ప్రపంచంలో
సాధారణ చావునే కోరుకుoటా

మిత్రమా… మరి నీ సంగతో…
నీకు
A ఆంటే అండా సెల్
B ఆంటే బెయిల్
C ఆంటే కాట్రిడ్జ్ (తూటా)
D ఆంటే డెత్
యవ్వన దశలో
నిశ్చల నిశబ్ద నిశీధి మృత్యువు

నీకు నాకు మధ్యన
అంతులేని అగాధం

మిగుల్చుకోవడానికి
జ్ఞాపకం అంటూ ఒకటి ఉండాలి కదా

నా పిలుపెన్నడూ నిన్ను చేరదు.
ఎవర్ని ఎందుకు చంపుతున్నారో
తెలియని యుద్ధంలో
నేను నిన్ను పోగొట్టుకున్నాను

స్నేహితుడా… సెలవింక..

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply