రాజీలేని రణభూమి…

ఏడున్నర దశాబ్దాల
వొడవని దుఃఖ్ఖాల
ఎవరికీ పట్టని
ఈ ఎదఘోష ఎవరిదీ…

కౌటిల్య సాంగత్య
విద్రోహ సామ్రాజ్య
వధ్యశిలకు వేలాడె
ఈ శవ మెవరిదీ…

విశ్వాస హననాల
విధ్వంస శకలాల
అట్టడుగు పొరలల్ల
ఉఛ్వాస నిశ్వాసలెవరివీ..

తనువెల్ల గాయాల
నెత్తుటీ ముద్దాయె
చావు డోలలు దప్ప
పుటుకలెరుగని దిబ్బెవరు…

కార్చిచ్చు లెన్నున్నా
కనుమూయ నంటున్న
క్షతగాత్ర స్వరమైన కసి
వొదలనంటున్న దెవరూ…

ఇరవయ్యొకటో శతాబ్దపు
నయవంచనల గుండెల్లో
దిగబడ్డ పిడిబాకు సవ్వళ్ల
రాజీలేని రణభూమిది కశ్మీర్

***

[రాజీలేని రణభూమికి ఈద్ ముబారక్ ]

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

One thought on “రాజీలేని రణభూమి…

  1. పుటుక లెరుగని దిబ్బెవరు
    బావుంది

Leave a Reply