తమ పుచ్చిన చేతులు జూసి అంతా పుచ్చి పోయిందనుకున్నారు
రెండు వీధి స్తంభాల మధ్య వాళ్ళ గజిబిజి నీడను జూసి జడుసుకున్నారు
మూలకు వ్రేలాడిన గబ్బిలాలకు ప్రపంచం గందరగోళంగా తయారైంది.
కొండలనడుమ వాళ్ళ అరుపుల ప్రతిధ్వని వాళ్ళకే వణుకును పుట్టించింది.
వేళ్ళను నమ్మని వాళ్ళకు చెట్టుపై విశ్వాసముండదు
కాపును కోయ సిద్ధమేగాని నీళ్ళుపోయడానికి భయం
పిరికివాళ్ళు, పలాయన వాదుల జీవితాలు ఇక ఇక్కడ ఒప్పవు
మేడి పండ్లు, పురుగుల కోసం పక్షుల ముక్కులకు బలిగాక తప్పదు
విశ్వాసం, పట్టుదల తరాలను మారిస్తే
త్యాగం అంతరాలను మారుస్తుంది.
(లొంగిపోయినవాళ్లను చూసి)