బాలసూర్యులు

పిల్లలంటే
పాలస్తీనా పిల్లలే
పిల్లలంటాను
వేగుచుక్కలంటాను

గురువులంటే
పాలస్తీనా పిల్లలే
నాగురువులంటాను.

చదవమంటే
బాంబుల విస్ఫోటనాల కోర్చి
శిథిలాల మధ్య
జెండాలు పాతే
పిల్లలు కళ్ళలో
ఆత్మవిశ్వాసాల చదవమంటాను.

రాయమంటే
యుద్దసైనికుల కెదురునిల్చే
మిలటరీ కోర్టులకు
చెమటలు పట్టి ంచే
బాలయోధుడి
మరణధిక్కారాన్ని రాయమంటాను.

బాల్యానికి,ధైర్యానికి
సరికొత్త నిర్వచనం వాల్లు.
రేపటి భరోసాలువాల్లు

సంకెళ్ళకు చేతులిచ్చి
జైళ్ళను ఇండ్లుగ స్వీకరించి
మాతృభూమికోసం
పుస్తకాలనిడిచి
జెండాలు పట్టారు వాల్లు..

వాడు నడిస్తే
వేల యోధులు
మార్చ్ చేసినట్టుంది
వాడు నవ్వితే
వేల సూర్యులు
ప్రకాశించినట్టుంటది

” వ్యక్తికి బహువచనం శక్తి
శక్తికి బహు వచనం వాడు”

అమ్మలారా..అక్కలారా..
మీ పిల్లలు పిరికి పడ్డప్పుడు
దేవుళ్ళ కథలుచెప్పకండి
పాలస్తీనా పిల్లల
వీరగాధలు వినిపించండి..

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

One thought on “బాలసూర్యులు

  1. ఆద్యంతం ధైర్యాన్ని నూరిపోస్తూ

Leave a Reply