ప్రతిఘటన

”అయ్యా ఇదేం న్యాయం?”

”ఏం? ఏమైంది భారతీయ మహిళా మణీయోఁ’!”

”మేమేం పాపం, నేరం చేసినమంటని మామీద మీ పోలీసుల దౌర్జన్యం ! ఆమాత్యా”

”ఏంది బేటీ ! దేన్నీ గురించీ మాట్లాడ్తూండవ్! అసల్ నీవ్ కౌన్ హో ?

                                                        కిస్కీబేటీ కహాఁసే ఒచ్చీనవ్!’

“మేము ఆమాత్యా…! మేం మల్లయోధులం. కుస్తీ యోధులమ్. యే సోబ్

దునియా మే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని మహిళా పౌరులం. ఆకాశంలో సగం ఐన వాళ్ళం హుజూర్!”

“ఓహ్… తుమ్ రెజ్లర్స్! ఏందీ ఎట్లనో ఉన్నదీ మీ భాషా, మీరు మా భరతీయ మహిళలేనా అస్ సల్!”

“అదేం మీకూ మా భారతీయ పౌరసత్వం మీదనే అనుమానం ఒచ్చిందీ మాననీయా!? మొన్న మొన్ననే గదా మేం పతకాలు తెస్తే, భారత దేశం గర్వించదగిన మహిళలం అన్నరు!”

“గవి అన్నీ పాత టుక్ డే టుక్ డే గ్యాంగ్ బాతేం. ప్రజాస్వామ్యం, ఆకాశంలో సగం అనేదీ యూరప్ దేశాల నించీ ఒచ్చిందీ యాద్ రఖో! అస్సల్ మీరు ఘర్ మే ఉండాలె. ఇంట్లా మొగుడూ, అత్తా మామలు, పిల్లలనూ ఫక్త్ భారతీయ పౌరులుగా తీర్చి పెంచే పనిలో, అతిథుల సేవలో ఉండవలసిన వాళ్ళూ గద! మీరూ బైటకూ ఒచ్చీ, రెజ్లింగూ, బాక్సింగూ ఔర్ కహీఁ కుఛ్ ఆటలల్లా ఆడుతూ మీ శరీరాలూ, కండలూ సూపుడేందీ? అట్లా చేస్తే ఏ మరద్ అద్మీ కైనా మనసూ పడుతదీ గద!”

 “పీ ఎమ్ సాబ్ నే కద అమాత్యా జీ, బేటీ పడావో బేటీ బచావో అన్నది!”

“హాఁ అన్నడూ నిజమే. సదువుకో మన్నడూ, మాంఛిగ బతుకుండీ అన్నడూ. లేకిన్ యే సంస్కృతి క్యాహై!? దేఖియే లడ్కీయోం. గాంధీజీ క్యా కహా, బురా నా సునో, బురా నా దేఖో, బురా నా కహో బోల్ కే కహానా!

ఇస్ లియే, ఇట్వంటీ చెడ్డా చెడ్డా ఉల్టా సీదా మాటలూ హమ్ నహీ సున్ నా చాహ్ తే. వేంఠనే మీరూ ఇక్కడినుంచీ వెళ్ళిపోండీ!”

“ఇక్కడినుంచీ అంటే… ఏ ఎక్కణ్ణించీ, వెళ్ళీ పోండీ అంటే… ఎక్కడికీ… ఈ”

 “జ్యాదా బగ్వాజ్ కర్ నా నయ్! ఏయ్ సెక్యూరిటీ యే లడ్కీయోం కూ ఫౌరన్ ఖీంఛ్ కే బాహర్ డక్ లాదో!”

“ఠీక్ హై సర్! హమ్ చల్తే. ౙరా మీరూ కూడా యాదీకుంచుకోండీ! బురా నహీ సున్ నా, ఔర్ నా దేఖ్ నా. పదండీ అక్కలూ, చెల్లెళ్ళూ ‘ ఒక సీనియర్ క్రీడా కారిణి మార్గ నిర్దేశనంలో వచ్చిన మహిళలు సెక్యూరిటీ ఆయుధాలు లాక్కొని, వాటిని ముక్కలుగా విరగ్గొట్టి ముక్కలను అక్కడే విసిరేసి సెక్యూరిటీని చితక బాది, “హమ్ జైల్ భరేంగే” అని నినదిస్తూ నిదానంగా, హుందాగా, నింపాదిగా, ఏకంగా జైలు దారే పట్టిండ్రు.

Leave a Reply