నిరంతర పోరాట స్ఫూర్తి మేడే

ఇవాళ మనం 133వ మేడేను కార్మిక వర్గ దీక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్రలో మే ఒకటికి ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నది. సహజమైన జీవించే మానవ హక్కు సాధన కోసం లక్షలాది మంది శ్రమజీవుల రక్తతర్పణం, వేలాది మంది క్షతగాత్రుల, వందల మంది బలిదానాల పునాదిగా ఆ ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే కార్మికవర్గ హక్కుల పోరాట దీక్షాదినం మేడే, కష్టజీవుల బతుకుదెరువు ఉద్యమాల దిక్సూచి మే డే. శ్రామికవర్గ ఈతిబాధలపై తెగించి పోరాడే ప్రేరకం మేడే. కార్మికవర్గ విముక్తికి అవసరమైన సైద్ధాంతిక ఎజెండాను ఒడిసిప‌ట్టి ఇచ్చింది మేడే. కార్మికవర్గం తన హక్కుల కోసమే కాదు, అస్తిత్వాన్ని నిర్దేశించుకోవడం కోసం జరిపిన దీర్ఘకాల పోరాటాల ఫలితమే మేడే. ఆ క్రమంలో నిర్వహించిన త్యాగపూరిత ఉద్యమాలు, పోరాటాల నుండి ఆవిర్భవించిందే ఎర్రజెండా. మేడే దీక్షా దినం కూడా. మేం మనుషులమే, మా శ్రమ శక్తియే సంపదకు మూలం అంటూ కార్మికవర్గం ఎలుగెత్తి చాటిన రోజు మేడే. కార్మికవర్గం తన హక్కుల హననం, అణచివేత, దుర్భర జీవన పరిస్థితులపై నిర్దిష్ట ఉద్యమ కార్యాచరణను నిర్దేశించి, పోరాటానికి ప్రేరేపించిన దినమే మేడే. వేతన బానిసత్వం రద్దు, సమాన పనికి సమాన వేతనం, తదితర డిమాండ్లు పురుడు పోసుకున్న దినం మేడే. 8 గంటల పనిదినం డిమాండు సాకారమైన రోజు మేడే.

మేడే ఏదో ఒక రోజున యాధృచ్చికంగా ఏర్పడింది కాదు. ఒక చారిత్రక పరిణామ క్రమంలో కార్మికవర్గం దోపిడీ, పీడన, అణచివేతల పై జరిపిన దీర్ఘకాల పోరాటాల నుండి ఆవిర్భవించింది. 1806లో ఫిలడెల్ఫియా (అమెరికా)లో చెప్పులు కుట్టే కార్మికులు ‘మెకానిక్స్ యూనియన్’ పేరుతో మొదటగా సమ్మె చేశారు. ఇంగ్లాండ్లో 1818లో స్టాల్ పోర్టు పట్టణంలో బట్టల ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు సమ్మె చేశారు. ఫ్రాన్స్ లోని ‘లయన్స్’ పట్టణంలో 1831లో సిల్క్ పరిశ్రమ కార్మికులు సమ్మె చేశారు. నైరీషియా (జర్మనీ)లోని నేత పని కార్మికులు 1849లో తిరుగుబాటు చేశారు. ఆనాటి కార్మికుల బాధలు వర్ణనాతీతం. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు గొడ్డు చాకిరీ చేయాల్సి ఉండేది. ఎంత చాకిరి చేసినా సగటున రోజుకు వచ్చే డాలరున్నర ఆస్తుబిస్తు ఆదాయంతో కడుపు నిండడమే కనాకష్టంగా ఉండేది. ఉత్పత్తి లేకుండా సామాజిక జీవనయానం లేదు. సమాజ పురోగమనం అంతకన్నా లేదు. మా శ్రమ నుండి పెట్టుబడి పుట్టింది. పెట్టుబడి అస్తిత్వం, మనుగడ శ్రమశక్తిలో వున్నది. శ్రమశక్తిని దోచుకున్న పెట్టుబడి శ్రమజీవులను వేతన బానిసలుగా మార్చింది. దుర్భర పరిస్థితులకు లోను చేసింది. అసమానతలు సృష్టించింది. దోపిడీ, పీడన వంటి వాటికి మూలాధారమైంది. ఉత్పత్తి శక్తుల (కార్మికుల) ఉనికి ప్రశ్నార్థకంగా మారి, మనుగడ కష్టసాధ్యమైనప్పుడు జీవనాధారం కోసం కార్మికవర్గం పోరుబాటన సమరశీలతను ప్రదర్శిస్తుంది. కార్మిక ప్రతిఘటనోద్యమంలో రక్తతర్పణలు, బలిదానాలు అనివార్యమన్న నిజాన్ని ఆవిష్కరిస్తుంది.

చికాగో కార్మికుల వీరోచిత పోరాటం:
రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం ఆ దేశంలో కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. 1882-86 మధ్యకాలంలో అప్పటి షికాగోలో కార్మికులు చేసే సమ్మెలను యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా అణచివేసేవి. తరచు లాకౌట్లు ప్రకటిస్తూ శ్రామికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం, కార్మిక హక్కుల రక్షణ కోసం ఏర్పడిన సంఘాల సభ్యులను ఏదో ఒక సాకు చూపి పనిలో నుంచి తొలగించడం, వారి స్థానంలో తాము చెప్పినట్టు వినే తమ కిరాయి తొత్తుల (బ్లాక్ లెగ్స్)ని నియమించుకోవడం పరిశ్రమాధిపతులకు మామూలే. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్ లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒకరోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.

దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన మెక్ కార్మిక్ హార్వెస్టింగ్ యంత్ర పరిశ్రమలోని కార్మికులు ‘8 గంటల పనిదినం’ కోసం సమ్మె జరిపి, శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారు. ఆ ప్రదర్శనపై పోలీసులు దాడిచేసి, కొందరు కార్మికనేతలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ప్రతిఘటించిన కార్మికులపై పోలీసులు అమానుషంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించడం, గాయపడడం జరిగింది. దీనితో రెచ్చిపోయిన కార్మికులు షికాగోతో సహా అమెరికాలోని పలు నగరాలలో మే నాల్గవ తేదీన సాధారణ సమ్మెకు పిలుపునిచ్చారు. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడు పై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది.

కార్మికులు పై కోర్టులో అప్పీలు చేయగా శిక్షలను ఖరారు చేసింది. 1887 నవంబర్ పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని ఉరితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్ గవర్నర్ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు. 1889 జూలైలో పారిస్లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు (రెండవ ఇంటర్నేషనల్) షికాగో మహానగరంలో హే మార్కెట్ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని తీర్మానించింది. మరుసటి ఏడాది (1890) సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

షికాగో మృతవీరుల స్మారక చిహ్నం:
హే మార్కెట్ అల్లర్లలో బాంబు పేలుడుకు కారకులనే ఆరోపణపై ఉరితీయబడిన మృత‌వీరులు ఆగస్ట్ స్పైస్, ఆల్బర్ట్ పార్సన్స్, అడాల్ఫ్ ఫిషర్, జార్జ్ ఎంగెల్ల ఉరిశిక్ష అమలుకు ముందురోజు చెరసాలలో ఆత్మహత్య చేసుకున్న లూయీ లింగ్లు ఐదుగురి మృతదేహాలు షికాగో నగరంలోని డెస్ ఫ్లెయిన్స్ ఎవెన్యూలో గల వాల్దీమ్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. దీనిని ప్రస్తుతం పక్కనే ఉన్న మరొక శ్మశాన వాటికతో కలిపి ఫారెస్ట్ పార్క్ శ్మ‌శాన‌ వాటిక అంటున్నారు. మృతవీరులకు స్మారకంగా ఇక్కడ నిర్మించిన ఒక అద్భుత స్థూపం 1893 జూన్ 25వ తేదీన జాతికి అంకితం చేయబడ్డది. దీనిని ‘హే మార్కెట్ మృతవీరుల స్మారకం’ అని వ్యవహరిస్తున్నారు. ఈ స్మారకంలో పదహారు అడుగుల ఎత్తైన ఒక స్తూపానికి ముందు నేలకొరిగిన ఒక అమర శ్రామికుని వద్ద ఒక స్త్రీ ఆగ్రహంతో నిలబడి ఉన్నట్టున్న ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.



జర్మనీలో పుట్టిన ప్రఖ్యాత అమెరికన్ శిల్పి ఆల్బర్ట్ వై నర్ట్ స్మారక స్థూపాన్ని అత్యంత నైపుణ్యంతో నిర్మించారు. స్థూపం వెనుక భాగంలో మృత వీరుల పేర్లు చెక్కబడ్డాయి. ముందు పక్క విగ్రహం కింద మెట్టు మీద నాటి ఉద్యమ నేత ఆగస్ట్ స్పైస్ తనను ఉరితీయబోయే ముందు అక్కడి అధికారులతో చెప్పినట్టు భావిస్తున్న ఈ కింది వాక్యం చెక్కబడింది. ఆ వ్యాఖ్యానం “మా నిరసనలు ధ్వనించకుండా మీరు మా గొంతులు నులిమేస్తున్నారు. కానీ మా శ్రామిక వర్గం మౌనమే అంతకు మించిన శక్తిగా మారి పరిణమించి మిమ్మల్ని ఎదిరించే రోజు తప్పక వస్తుంది” ఈ వ్యాఖ్యను నేటి కార్మిక వర్గం పెట్టుబడిదారీ వర్గాన్ని కూల్చే తమ చారిత్రక బాధ్యతను స్వీకరించవలసి ఉంది.

సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ-కార్మికుల హక్కులకు తూట్లు:
ఇవాళ ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని సర్వవ్యాపిత సంక్షోభవు ఊబిలో కూరుకుపోయి, ప్రపంచీకరణ విధానాలను అనివార్యంగా చేపట్టవలసి వచ్చింది. అయినా సంక్షోభం నుండి ఉపశమనం లభించకపోగా సంక్షోభాన్ని ఇది మరింత తీవ్రం చేసింది. రెండవ ప్రపంచ యుద్ద ముగింపు తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థపై నెలకొన్న అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం నేడు బలహీన పడింది. దీనితో అమెరికా సామ్రాజ్యవాదం మరింత ప్రమాదకరంగా తయారై దురాక్రమణ (ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, పాలస్తీనా, వెనిజులా) యుద్దాలకు దిగుతోంది. శ్రామికప్రజల మూపులపై సంక్షోభ భారాన్ని మోపేందుకు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని దేశాలలో కార్మికులకు వేతనాలను దిగజారుస్తూ, పని పరిస్థితులలో అభద్రతను పెంచుతూ, కార్మికులకున్న సంక్షేమ చర్యలన్నింటినీ రద్దుచేస్తూ సామ్రాజ్యవాద దేశాలు కార్మికుల స్థితిగతులను దిగజారుస్తున్నాయి. అత్యున్నత సాంకేతికతతో సబ్సిడీల ద్వారా సామ్రాజ్యవాద దేశాలలో తయారు చేసిన ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం, భూస్వాధీనం వంటి వాని ద్వారా ఈ దేశాలలో రైతాంగ జీవనాధారాలన్నీ పెనుప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో, సామ్రాజ్యవాద దేశాలలో కార్మికవర్గం తమ హక్కులపై జరుగుతున్న దాడులతో-సాపేక్షంగా తక్కువ వేతనాలు, ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవలు), పనిగంటల పెంపు వంటి చర్యలతో ఒక అనిశ్చిత స్థితికి నెట్టబడటం పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

సామ్రాజ్యవాద నిర్మిత సంస్థలైన ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల ఆదేశానుసారం మనదేశంలో పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్థిక సంస్కరణలు, వ్యవస్థల సర్దుబాటు చర్యలు రైతాంగ ఆర్ధిక వ్యవస్థను ధ్వంసం చేసి, పెద్ద సంఖ్యలో వారిని బలవన్మరణాల వైపు నెడుతోన్నాయి. మరోవైపు పొట్టచేత పట్టుకొని, పల్లెలను వదలి పనుల కోసం పట్టణాలకు నెట్టబడుతున్న వారంతా, పట్టణాలలో ఉపాధి లభించక, దుర్భర జీవన పరిస్థితులలో మురికివాడలలో మగ్గుతున్నారు. కార్మికులు వరుసదాడులకు గురవుతున్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల హక్కుల పరిరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ‘నిర్దిష్ట కాలపరిమితి ఉద్యోగ ఒప్పందం’ (ఎఫ్టిసి) వీటిలో తాజా అయింది. దీనితో కార్మికులు గుత్త పెట్టుబడి యొక్క నికృష్ట దోపిడికి గురై, తమకున్న కనీసపాటి హక్కులన్నీ కోల్పోవలసి వస్తోంది. మత, కుల, ప్రాంతీయ అంతరాలను ఉపయోగించడం ద్వారా ప్రజలను చీల్చి శ్రామిక ప్రజల సంఘటిత శక్తిని బలహీనపరిచేందుకు భారత పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. యూరప్, అమెరికా, జపాన్లలో అర్ధఫాసిస్టు ధోరణుల పెరుగుదల ప్రభావం భారతదేశం పై వుంది. ప్రజలను అణచివేయటానికి ఫాసిస్టు తరహా పద్దతులను ప్రయోగించటం పెరిగింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం పరిస్థితులకు జారుకుంటూండటంతో పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము బకాయి పడ్తున్నారు. భారత జాతీయ బ్యాంకుల బకాయిలు 10 లక్షల కోట్లకు పెరిగింది. వాటిల్లో 88.4 శాతం 12 పెద్ద కార్పొరేట్లవే. మోడీ అండ్ కం పెనీతో వారికున్న ఆశ్రిత సంబంధం లోకానికెరుకే కదా! దీనికితోడు నీరప్ మోడీ, మెహుల్ చౌక్సీ, విజయ్ మాల్యా వంటి వారు చేస్తున్న మోసాలు. ఈ సాకుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ డిమాండు ముందుకొస్తున్నది. ఒకవైపు భారత వాణిజ్య పారిశ్రామిక సంస్థ (అసోచామ్) ప్రభుత్వ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణను డిమాండ్ చేయడంతోపాటు, మరోవైపు ప్రధాని ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యం కూడా ఇదే పల్లవి లంకించుకున్నారు. వెరసి, మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురౌతున్నదని గ్రహించాలి.

కార్పొరేట్ల అనుకూలంగా కార్మిక చట్టాల మార్పు :
ఇవాల్టి కార్మికుల దుస్థితిని, పాలకుల నియంతృత్వ పోకడలను గమనిస్తే మళ్లీ మేడే ఆవిర్భావం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం పూర్వపక్షం చేయబడుతున్నది. పనిభారం, పనిగంటల పెరుగుదల, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేటు ఆర్థిక శక్తుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాల సవరణ దీనినే సూచిస్తున్నది. యూనియన్ ను పెట్టుకునే హక్కును నిరాకరించటం, కనీస వేతనాలను అమలు చేయకపోవడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చట్టబద్ద ఆదేశాలు, న్యాయస్థానాల నిర్దేశిత తీర్పులను బుట్టదాఖలు చేయడం కనీస వేతనం అమలు చేయకపోవడం పాలకుల స్వభావంగా మారింది. సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ లేకుండా పోతున్నది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థలను ప్రోత్సహించటం వంటి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి.

కార్మికవర్గం పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులపై పాలకవర్గం దాడిని వేగవంతం చేసింది. కార్మిక హక్కుల హసనానికి సిద్ధమయ్యింది. బహుళజాతి సంస్థలకు కార్మికుల శ్రమ శక్తిని మరింత కారుచౌకగా, లాభాలను సమకూర్చి పెట్టడానికి విధివిధానాలు రూపొందుతున్నాయి. మెరుగైన పని పరిస్థితుల గురించి హక్కుల పరిరక్షణకు, సాధనకు సంఘం (యూనియన్లు) పెట్టుకోవడమే నేరమవుతుంది. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయమనడమే చట్టవిరుద్ధమవుతుంది. అనేక పోరాటాలు, బలిదానాల ఫలితంగా సాధించుకున్న హక్కులను ఒకొక్కొటిగా రద్దు పరచడాన్ని ప్రశ్నించడం, ప్రతిఘటించడాన్ని పారిశ్రామిక అభివృద్ధి నిరోధకులు”గా పాలకవర్గం ముద్రవేస్తున్నది.

కార్మికుల పోరాటాలపై నిర్బంధం :
ఈ క్రమానుగతమే యానాంలోని సిరామిక్ ఇండస్ట్రీలో కార్మికులు యూనియన్ పెట్టుకున్నందుకే యాజమాన్యం కార్మిక వర్గాన్ని రక్తపుటేరుల్లో ముంచి కార్మిక నేతను హతమార్చింది. గుర్గావ్ లోని మారుతి సుజికి కంపెనీలో కార్మికులు యూనియన్ ను పెట్టుకోవడమే నేరంగా భావించి వారిపై ప్రైవేటు గూండాల చేత భౌతిక దాడులు చేయించింది. తప్పుడు కేసులు బనాయించింది 13 మందికి జీవిత ఖైదు, మరో నలుగురికి 5 ఏళ్ళ పాటు శిక్షను ఖరారు చేయించింది యాజమాన్యం. నిర్దోషులుగా ప్రకటించబడిన 117 మంది కార్మికులు కనీసం బెయిల్ కూడా లేకుండా రెండున్నర ఏళ్ళ నుండి నాలుగున్నర ఏళ్ళ జైలు జీవితం గడిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన మానవ హక్కుల ఉల్లంఘన చర్య. హక్కుల ఉద్యమంలోనూ, కార్మిక, న్యాయ విభాగాలలో పని చేసే మేధావులను చత్తీస్ఘడ్ లోని సుక్మా జైలులో నిర్బంధించిన తీరును అలాగే భీం-కోరేగావ్ కేసులో రచయితలను, హక్కుల నాయకులను అక్రమంగా నిర్బదించడం చూస్తున్నాము.

దళిత, ఆదివాసీ శ్రామిక వర్గ గొంతుక ప్రొ|| జి. ఎన్.సాయిబాబాతో సహా మరో నలుగురిపై గడ్చిరోలి కోర్టు ఇదే తరహాలో అక్రమ కేసులో జీవిత ఖైదుని విధించింది. ప్రికోల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల విషయంలోనూ కోయంబత్తురులో ఇదే విధంగా శిక్షలు విధించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ కేసులో 8 మందికి “డబుల్ లైఫ్” శిక్ష విధించింది. రాజస్థాన్ లోని తపుకారా హీరో హోండా ప్లాంటులో పనిచేసే కార్మికులపై తప్పుడు అభియోగాలను మోపి, 3 వేల మంది కార్మికులను అక్రమంగా, చట్టవిరుద్దంగా తొలగించింది. అక్కడ కార్మికవర్గం జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తున్నారు. పిఎఫ్ కోసం బెంగుళూరు గార్మెంట్ కార్మిక వర్గం చేసిన వీరోచిత పోరాటం మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ, దేశ వ్యాప్తంగా స్కీం వర్కర్లు కనీస వేతనం, ఇఎస్ఐ, పిఎఫ్ వంటి కనీస సౌకర్యాల కోసం ఉద్యమ ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు.

పబ్లిక్ రంగాన్ని అన్ని విధాల నిర్వీర్యం చేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసి, ఆ ప్రక్రియను కొనసాగిస్తుంది. రెండు దశాబ్దాలుగా సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు కావడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఊసే లేదు. వారి పర్మినెంట్ సంగతి చెప్పనక్కర్లేదు. 1981 నుండి కొనసాగుతూ వచ్చిన వారసత్వ ఉద్యోగాలను 1998లో తొత్తు సంఘాల సహకారంతో యాజమాన్యం రద్దు చేసింది. డిపెండెంట్ ఉద్యోగాల కోసం 18 ఏళ్ళుగా పోరాటం సాగుతూనే ఉంది. ఉపరితల గనులు (ఓసిలను) రద్దు చేయాలని భూగర్భ గనులకు అవకాశం కల్పించాలన్నది కార్మికుల చిరకాల డిమాండ్ గా కొనసాగుతుంది. ఆటో అండ్ మోటార్ తదితర రవాణా రంగంపై, మోటార్ కార్మికులపై రకరకాల పన్నులు, లైసెన్సుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడికి పూనుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు రవాణా బంద్ ను కూడా పాటించారు.

తెలంగాణలోని పెంకు ఫ్యాక్టరీల యజమానులు ఇటీవల 31 రోజులు ఫ్యాక్టరీలు బంద్ పెట్టి కార్మికులను లొంగదీసుకునే చర్యలకు పాల్పడ్డారు. హమాలలీ, ముఠా, జట్టు కార్మికులకు ఎలాంటి కార్మిక చట్టాలు నేటికీ రూపొందించబడలేదు. దోపిడీ, కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైన పాలకవర్గం కార్మికుల్లో సమరశీలతను, యూనియన్ చైతన్యాన్ని, పోరాట సామర్ధ్యాన్ని దెబ్బతీయడానికి కార్మిక నేతలను లక్ష్యం చేస్తున్నది. వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. వారిపై తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లో నిర్భంధిస్తున్నారు. జీవిత ఖైదు విధిస్తున్నారు. ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ఇక వలస కార్మికుల వెతలను పట్టించుకున్న నాథుడే లేడు. భద్రత లేని బతుకు వలస కార్మికులది. పొట్టకూటి కోసం ఉపాధి వెతుకులాటలో భాగంగా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి, ఆయా రాష్ట్రాల్లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. కనీస వేతనాలు, చట్టాలు, పని గంటలు వర్తింపుకు నోచుకునే స్థితి వారిని వెంటాడుతుంది.

దేశంలో కుల, మత, జాతిదురహంకార ధోరణులు పెరుగుతున్నాయి. ఇవి కార్మికవర్గ ఐక్యతకు విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. బీజేపీ తన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాల కోసం కార్మిక వర్గంలో కుల, మత, విద్వేషాలను, జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. చీలికలు సృష్టిస్తుంది. కార్మికులు తమ సమస్యలకు మూలాలను వర్గ దోపిడీలో ఉందని గుర్తించకుండా వారిలో పోరాట చైతన్యాన్ని, ప్రతిఘటనా స్వభావం పెరగకుండా నియంత్రిస్తుంది. ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన సంఘాలలో కార్మిక వర్గం సంఘటితం కావడం హిందూత్వ శక్తులకు గిట్టడం లేదు. కార్మికులు, శ్రామిక ప్రజలు మెరుగైన జీవన పరిస్థితుల కోసం, హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలన్న విషయాన్ని అంగీకరించదు. కార్మిక వర్గంలో ఉన్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ భావాలను తొలగించి, హిందూత్వ జాతీయవాదాన్ని నింపుతుంది. గోవు మాంసం తిన్నారన్న సాకుతో దాడులకు తెగబడుతుంది. హిందూత్వ శక్తుల దండు ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన అభ్యుదయ, ప్రగతిశీల శక్తులపై, మైనారిటీ, దళిత, సామాజిక వర్గాల పైన జాతిదురహంకారంతో హిందూత్వ శక్తులు దాడులు చేసి అనేక మందిని హతమారుస్తున్నాయి. కుల, మతోన్మాద చర్యలకు అడ్డు అదుపు లేకుండా సాగిస్తుంది.

ప్రజల మధ్య చీలికలకు పాలకుల కుయుక్తులు:
దేశంలో కుల, మత, జాతిదురహంకార ధోరణులు పెరుగుతున్నాయి. ఇవి కార్మికవర్గ ఐక్యతకు విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. బీజేపీ తన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాల కోసం కార్మిక వర్గంలో కుల, మత, విద్వేషాలను, జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. చీలికలు సృష్టిస్తుంది. కార్మికులు తమ సమస్యలకు మూలాలను వర్గ దోపిడీలో ఉందని గుర్తించకుండా వారిలో పోరాట చైతన్యాన్ని, ప్రతిఘటనా స్వభావం పెరగకుండా నియంత్రిస్తుంది. ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన సంఘాలలో కార్మిక వర్గం సంఘటితం కావడం హిందూత్వ శక్తులకు గిట్టడం లేదు. కార్మికులు, శ్రామిక ప్రజలు మెరుగైన జీవన పరిస్థితుల కోసం, హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలన్న విషయాన్ని అంగీకరించదు. కార్మిక వర్గంలో ఉన్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ భావాలను తొలగించి, హిందూత్వ జాతీయవాదాన్ని నింపుతుంది. గోవు మాంసం తిన్నారన్న సాకుతో దాడులకు తెగబడుతుంది. హిందూత్వ శక్తుల దండు ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన అభ్యుదయ, ప్రగతిశీల శక్తులపై, మైనారిటీ, దళిత, సామాజిక వర్గాల పైన జాతిదురహంకారంతో హిందూత్వ శక్తులు దాడులు చేసి అనేక మందిని హతమారుస్తున్నాయి. కుల, మతోన్మాద చర్యలకు అడ్డు అదుపు లేకుండా సాగిస్తుంది.

దేశంలో కుల, మత, జాతిదురహంకార ధోరణులు పెరుగుతున్నాయి. ఇవి కార్మికవర్గ ఐక్యతకు విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. బీజేపీ తన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాల కోసం కార్మిక వర్గంలో కుల, మత, విద్వేషాలను, జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. చీలికలు సృష్టిస్తుంది. కార్మికులు తమ సమస్యలకు మూలాలను వర్గ దోపిడీలో ఉందని గుర్తించకుండా వారిలో పోరాట చైతన్యాన్ని, ప్రతిఘటనా స్వభావం పెరగకుండా నియంత్రిస్తుంది. ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన సంఘాలలో కార్మిక వర్గం సంఘటితం కావడం హిందూత్వ శక్తులకు గిట్టడం లేదు. కార్మికులు, శ్రామిక ప్రజలు మెరుగైన జీవన పరిస్థితుల కోసం, హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలన్న విషయాన్ని అంగీకరించదు. కార్మిక వర్గంలో ఉన్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ భావాలను తొలగించి, హిందూత్వ జాతీయవాదాన్ని నింపుతుంది. గోవు మాంసం తిన్నారన్న సాకుతో దాడులకు తెగబడుతుంది. హిందూత్వ శక్తుల దండు ప్రత్యామ్నాయ భావజాలం కలిగిన అభ్యుదయ, ప్రగతిశీల శక్తులపై, మైనారిటీ, దళిత, సామాజిక వర్గాల పైన జాతిదురహంకారంతో హిందూత్వ శక్తులు దాడులు చేసి అనేక మందిని హతమారుస్తున్నాయి. కుల, మతోన్మాద చర్యలకు అడ్డు అదుపు లేకుండా సాగిస్తుంది.

ఒకవైపున హిందూత్వ శక్తులు జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపున సామ్రాజ్యవాద పెట్టుబడి ముందు సాగిల పడుతున్నాయి. కార్మిక సంఘాలను అన్ని విధాలుగా బలహీనపరిచే తాత్విక సైద్ధాంతిక ఎజెండాతో కేంద్రంలోని అధికార హిందూత్వ శక్తులు కృషి చేస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం, జాతిదురహంకారంతో పెట్రేగిపోతుంది. ముస్లింలు, వలస వచ్చిన ప్రజలపై బాహాటంగానే జాతి వివక్షను ప్రదర్శిస్తుంది. ట్రంపు సైనిక దుశ్చర్యలకు, జాతి వివక్షలకు మూలం తనను గెలిపించిన ఆయుధ వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలే. రెండున్నర దశాబ్దాల నాడు ప్రపంచ కార్మికవర్గ శ్రమశక్తిని దోచుకోవడానికి “ప్రపంచీకరణ’ విధానాలను ఎజెండా మీదికి తెచ్చిన అమెరికా సామ్రాజ్యవాదం నేడు అదే వలస వచ్చిన కార్మికుల పైన, ఇతర శ్రామిక ప్రజలపైన జాత్యహంకారం పేరుతో రెచ్చగొడుతున్నది. కరుడు గట్టిన జాతీయవాది డోనాల్డ్ ట్రంప్ జాతి ఉన్మాదంతో తీసుకుంటున్న చర్యలు అందుకు అద్దం పడుతున్నాయి.

“మెరుగైన అమెరికా నిర్మాణం” పేరిట ట్రంప్ అనుసరిస్తున్న విధానాలునూ, అత్యంత జాతీయోన్మాదంతో దురహంకారంతోనూ కూడి ఉన్నాయి. వాటి పర్యవసానమే జాత్యాహంకారంతో ఒక తెలుగువాడిని విద్వేషపూరితంగా హతమార్చిన తీరు కాన్సస్ ఘటన తేటతెల్లం చేస్తుంది. ప్రధానంగా ముస్లింలు, ఇతర మైనారిటీలే లక్ష్యంగా సాగుతున్న జాతి విద్వేషపూరిత దాడుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రజాస్వామ్యం, మానవహక్కుల వంటి విశ్వజనీన విలువలను తుంగలో తొక్కుతూ ముస్లింలు, వలసవాసులు, శరణార్థుల పట్ల విద్వేషపూరితంగా అమెరికా సామ్రాజ్యవాదం వ్యవహరిస్తుంది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనీస యుద్ధనీతిని కూడా తుంగలో తొక్కి నిస్సిగ్గుగా అమెరికా సామ్రాజ్యవాదం సిరియా, ఉత్తర కొరియాలపై సైనిక దాడులకు పాల్పడుతుంది. వెనిజులా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఉరుముతుంది. కనుక ఈ చర్యల పట్ల కార్మికవర్గం అప్రమత్తంగా ఉండాలి.

ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు పెద్ద పీట వేసే వ్యూహాత్మక పారిశ్రామిక విధానాలతో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. యూనియన్ పెట్టుకునే హక్కు కనీస వేతనం పొందే హక్కు సమ్మె చేసే హక్కులను నిరాకరించడం దీనిలో భాగమే. న్యాయస్థానాల తీర్పులు ఇందుకు మినహాయింపు కాదు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ గా ఇక వుండబోదని కెసిఆర్ హుకుం జారీ చేయడం మనం చూశాం. కెసిఆర్ ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతును నిరాకరించడమే కాదు, నిరసన ప్రకటించే అస్తిత్వ స్థానాన్ని సైతం రద్దు పరిచే ప్రక్రియకు పూనుకోవడం ఫాసిస్టు పాలనకు అద్దం పడుతుంది. కావున కార్మిక వర్గ హక్కుల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా 133వ మేడే సందర్భంగా హక్కుల సాధన కొరకు దీక్ష పూనుదాం.

కార్మికుల చట్టాల రద్దు :
1978లో జనతా ప్రభుత్వం, 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, 2002లో వాజ్ పాయ్ ప్రభుత్వం చేయలేకపోయిన కార్మిక చట్టాల రద్దును మోడీ సర్కార్ దుందుడుకుగా అమలు చేస్తున్నది. రెండవ జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సులను 2002లో రానున్న ఎన్నికలకు భయపడి వాజ్ పాయ్ సర్కార్ వెనక్కి తగ్గినా నేడు మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 44 కార్మిక చట్టాలను నాలుగు రోడ్లుగా మారుస్తున్న విషయం మనకు తెల్సిందే. వేతనాల చెల్లింపు, కనీస వేతనాలు, బోనస్, సమాన వేతన చట్టాలను కలిపేసి ‘వేతనాల కోడ్’ తయారైంది. ట్రేడ్ యూనియన్, పారిశ్రామిక వివాదాలు, స్టాండింగ్ ఆర్డర్స్ చట్టాలతో పాటు కాంట్రాక్టు లేబర్ చట్టాన్ని కూడా కలుపుతున్నారు. ఈ రెండు కోడ్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందాయి. సాంఘిక సంక్షేమ కోడ్లో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ సాంఘిక సంక్షేమ చట్టాలను విలీనం చేసి తయారు చేస్తున్నారు. దీనిలో ఒక విషయం స్పష్టమౌతున్నదేమంటే భవిష్యత్లో ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రస్తుతమున్న స్థితిలో మాత్రం ఉండవు. ప్రస్తుతం రెండు తీవ్ర అంశాలు కార్మికుల ముందుకొచ్చాయి. ఒకటి, కాంట్రాక్టు కార్మిక చట్ట సవరణ. రెండు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్. “శాశ్వత, నిరంతరాయ పనులు’ (పర్మినెంట్ & పేరేనియల్ జాబ్స్)లలో ఇంతవరకు కాంట్రాక్టు కార్మికుల్ని పని చేయించకూడదన్న దాన్ని కోర్ పనులు, పెరిఫెరల్ (పరిధి ఆవలుండే) పనులుగా సవరిస్తున్నారు. పరిధి ఆవలుండే పనులకు అర్థమేంటి? ఎవరు నిర్వచిస్తారు? అయితే 2003లోనే చంద్రబాబు ప్రభుత్వం మన ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని సవరించేసింది.

ముగింపు:
ప్రపంచంలో అసమానతలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రపంచంలో సంపద ఒక వైపున గుట్టలు పడుతుంటే, పేదరికం మరొకవైపున పేరుకుపోతున్నది. తాజాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచ ఎనిమిది మంది కుబేరుల వద్ద ప్రపంచ సంపదలో సగం వారి వద్దనే ఉంది. భారత్ లో ఒక శాతం కుటుంబాల వద్ద 74 శాతం సంపద ఉంది. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడం, దేశ, విదేశ కార్పొరేట్లకు, దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించడం, కార్మికులు కుక్కిన పేలల్లే పడుండేలా చేయడం మోడీ పాలనలో మనం చూస్తున్నాం. దేశ ఆర్థిక సార్వభౌమత్వ పరిరక్షణలో కీలక పాత్ర వహించే ప్రభుత్వ రంగం అంతకంతకు ధ్వంసం చేయబడుతున్నది. విచక్షణా రహితంగా దేశ, విదేశీ ప్రైవేటు సంస్థలు అనుమతించబడుతున్నాయి. మరో వైపున ట్రేడ్ యూనియన్ హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతున్నది. మొత్తం లేబర్ చట్టాలను మార్చే కుట్ర జరుగుతున్నది. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారింది అన్న పేరుతో కార్మికుల సెలవు రోజులకు మంగళం పాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పని భారం విపరీతంగా పెరుగుతున్నది. పని గంటలనూ పెంచడానికి పూనుకుంటున్నారు. మరోవైపున మతోన్మాద శక్తులు విజృంభించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి. మౌలికమైన లౌకిక, ప్రజాతంత్ర విలువలనే మట్టు పెట్ట చూస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన మతోన్మాద శక్తులను ప్రతిఘటించి, ఓడించాల్సిన బాధ్యత కూడా కార్మికవర్గం, ఇతర శ్రామికుల మీద ఉంది. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడే మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడానికి కార్మికులొక్కరే కాకుండా రైతాంగం, వ్యవసాయ కార్మికుల్ని, ఉపాధ్యాయ, ఉద్యోగుల్ని కూడా ఉద్యమాలకు కదిలించాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply