ధ్యానంగా…

ఆ ఆదివారం ఓ విచిత్రం జరిగింది
బాసింపట్టు వేసుకుని ధ్యానం చేస్తున్నా…
ధ్యానంలో పేజీలు తిప్పానో
పేజీ తిప్పటమే ధ్యానంగా చేశానో…

జామీల్యా, దనియార్
దుమికి వచ్చారు
వస్తూనే సైప్ మైదానం వైపు
పరుగులు తీశారు
ప్రేమే మోహనరాగం అందుకుంటుందా??
మోహమే ప్రేమై కలవరిస్తుందా??

గుర్రపు డెక్కల చప్పుళ్ళు
సారీ-కీహార్ మైదానంలో
మార్మోగుతున్నాయి
ఓ చేత్తో పట్టాకత్తి, ఎగురుతున్న వృక కేతనం
తెల్లటి గుర్రంపై టెముజీన్
పేజీ నిండా గోబీ ఎడారి ధూళి

చచ్చిన కమత గాళ్ళ చిట్టా నుంచి
రూబుళ్ళ వర్షం
లెక్కలు వేసి రెక్కలాడిస్తూ
నింగికి ఎగిరాడు చిచీకవ్
గదంతా రాబందుల రెక్కల చప్పుళ్ళు

ధ్యానంలో పేజీలు తిప్పానో…
పేజీలు తిప్పటమే ధ్యానంగా చేశానో…

రచయిత్రి, జర్నలిస్ట్.

Leave a Reply