డైనోసార్ తో రతిలో పాల్గొన్నట్టు భయంకరమైన పీడకల కన్నాను


అవునూ నాకిది చెప్పు
“డైనోసార్ అసలెలా అంతరించిపోయిందంటావు?” అని అతన్ని అడిగాను.
అతనికేమీ తెలీదు పాపం
కానీ అతను నన్ను తన మ్యూజియంకి తీసుకువెళ్ళాడు
**
అక్కడి కళా ఖండాలు దాదాపుగా అందరికీ తెలిసినవే
కానీ, సందర్శకులకు దానిలోకి అనుమతి లేదు
**
అక్కడ త్రిశూలం లోతుగా గుచ్చబడి నిలువునా ఛీరిపోయిన బిల్కిస్ బానో పొట్ట ఉంది
ఇంకా అక్కడ మూతబడ్డ గదుల తాళం చెవులు చాలా ఉన్నాయి
ఒక పరిశోధక పళ్ళెంలో కప్పలు నిశ్చలంగా పడి ఉన్నాయి.
బహుశా ఎప్పటినుంచో అవి అలా అక్కడ చేరుతూ ఉండి ఉండ వచ్చును
**
అక్కడే  కత్తెర్లతో, బంకతో సరిహద్దురేఖ ఒకటి తన పెద్ద నోరు బార్లా తెరుచుకుని ఉంది
అవును మరి
“లావైన సరిహద్దు రేఖ” అన్నదే అతని పేరు
అతను అక్కడ ఏ విభజన రేఖలూ గీయటం లేదులే ఖంగారు పడకండి
కానీ, ఏం చేస్తున్నాడనుకున్నారు?
ఊహించండి చూద్దాం?
అతను సుంతీ అయ్యిందో లేదో అని పురుషాంగాలను పరీక్షిస్తున్నాడు
నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం నిజం

**
ఆ మ్యూజియంలో ఒక మంచం పక్కనే ఉన్న చెక్క బల్లమీద  బంగారు అక్షరాలతో రాసిన మనుస్మృతి ఉంది!
అప్పుడు నోరెండిపోయి తాగడానికి కొన్ని నీళ్లు అడిగానతన్ని.
**
వీర్ సావర్కర్ నా వెనక  నిలబడి నన్నే తీక్షణంగా చూస్తున్నాడు.
వెంటనే అక్కడి మంచం మీద డైనోసార్ ఒకటి భీకరంగా ఊళపెట్టటం విన్నాను
**
ఒక్క కుదుపుతో నిద్ర లేచానా?
మంచం మీద తడిసి ముద్దైపోయి ఉన్నాను.
కుడి వైపు తిరిగి చూద్దును కదా,

ఓహ్… నా పక్కనే డైనోసార్ చచ్చి పడి ఉంది.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

Leave a Reply