జోహార్… స్టాన్ స్వామి

నిరుద్యోగంలో
కూరుకుపోతున్న
కెరీరిజంలో
కొట్టుకుపోతున్న
పాలక ప్రలోభాల్లో
మునిగిపోతున్న
చూడ్డానికే తప్ప
చేతగాని శరీరాలతో
మురిసిపోతున్న
మా తరానికి…

ఏదో ఒక రోజు
మాట ముచ్చటలోనో
పరీక్షా పత్రంలోనో
ఎక్కడో ఓ చోట
స్టాన్ స్వామి ఎవరని
ప్రశ్న వస్తుంది….

సమాధానం వెతుకుతాం
ఎనభై నాలుగేండ్ల చరిత్రున్న
హక్కుల కార్యకర్తను
తరాలుగా
ప్రకృతి సంపద కాపాడే
ఆదివాసీల హక్కులకై
మీరు చేసిన పోరును
అధ్యయనం చేస్తాం

చేయని నేరానికి
ఎందరినో బంధించి
క్రూరంగా హింసించి
హింసించి చంపిన
ఫాసిస్ట్ పాలక వర్గం
మిమ్మల్ని చంపిందని
సమాధానం చెప్పమని
దోపిడీ సర్కార్ని ప్రశ్నిస్తాం

మీ స్పూర్తితో
మా వెన్నెముకను నిలబెట్టుకుంటాం
చివరగా మాకు రెండే ఆప్షన్స్
బంధీగా చావడం
నిజం కోసం బ్రతకడం
రెండూ పోరాడ్డమే
తప్పదు… మా వంతే ఇక

వరంగల్ జిల్లా. కవి, రచయిత.

Leave a Reply