జీవిత మొగ్గలు

బతుకు ఒక గొప్ప యుద్ధక్షేత్రమైనపుడు
కాలంతో నిత్యం పోరాటం చెయ్యకతప్పదు
జీవితం నిత్యపోరాటాల అనంతసాగరం

బతుకు ఒక కల్లోల కడలిని తలపించినపుడు
కష్టసుఖాల తీరాన్ని నిత్యం ఈదక తప్పదు
జీవితం అలజడుల సాగరసంగమం

బతుకు ఒక పూలతోటలా వికసించినపుడు
ప్రతిక్షణం ఆనందానుభూతిని పొందక తప్పదు
జీవితం పరిమళించే పరిమళాల ఊట

బతుకు ఒక నదిలా ప్రవాహమై సాగినపుడు
నిరంతరం రాళ్ళూరప్పలు తగలక తప్పదు
జీవితం గాయాలను మోసే దుఃఖసముద్రం

బతుకు ఒక సంగీతమై రాగాలను పలికినపుడు
సరిగమల గానామృతాలను ఆనందించక తప్పదు
జీవితం సప్తస్వరాల స్వరరాగ గంగాప్రవాహం

జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. "మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం" అనే అంశంపై పరిశోధన చేశారు. రచనలు: పాలమూరు కవిత, సోది (తెలంగాణ హైకూలు), బతుకమ్మ నానీలు, మొగ్గలు, పసిడి నానీలు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" అనే నూతన కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

3 thoughts on “జీవిత మొగ్గలు

  1. సార్ చాలా బాగుంది..బతుకు చిత్రాన్ని మీ మొగ్గలలో చూపించారు.

Leave a Reply