చితి

ఈ చితి ఇపుడారిపోవొచ్చు
అదెపుడో రోడ్డునుజేరింది

పచ్చనిపొలాలదాటి
ఇనుప కంచెలదాటి
అనునిత్యం
ఉక్కు డేగ పహరాల దాటి
అది రోడ్డునుజేరింది

భీమ్ ఆర్మీ జూలు దులిపితే
డి.ఎమ్ ఆఫీసు దుమ్ము గొట్టుకుపోతోంది

ఈరోడ్డుకు సలాం

రాయినెత్తిన చేతికి సలాం
కాలుచీలినా
ఆగని నడకకు సలాం
నిప్పులమిసే గొంతుకు సలాం

రండి
ఈ రోడ్డు ను ఆవాహన చేద్దాం

పదపదాన
నరనరాన
స్వర స్వరాన
నదీనదాన
భాస్వరాల మండిద్దాం

తరతరాల
జాతిని ఊపిరాడక జేసిన
అగ్ర కులపెత్తందారీ కుళ్ళు వ్యవస్థను
చితి మంటల్లోకి విసిరేద్దాం.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply