నిశ్శబ్దంతో సంభాషణే నా కవిత్వం : గ్రేస్ నివేదితా సీతారామన్

కవిత్వాన్ని చాలామంది నిర్వచించే ప్రయత్నం చేసారు.చాలా మంది కవిత్వంతో, సాహిత్యంతో మరీ ప్రధానంగా వారి అనుబంధాన్ని వాక్యాల్లో చెప్పే ప్రయత్నం చేసారు. కానీ ఇంత నిర్భీతిగా ఇంత నిక్కచ్చిగా చెప్పే భారతీయాంగ్లకవులు తక్కువే.

ప్రపంచంలోని ఏ ఇద్దరూ ఒక్కలా ఉండనట్టే ఏ ఇద్దరు కవులూ ఒక్కలా రాయరు ఎందుకంటే వారు ఒక్కలా ఆలోచించరు కాబట్టి. అలాగే ఎంత కాదనుకున్నా ఏ కవీ కూడా తను పుట్టిపెరిగిన సంస్కృతి నుంచి దూరంగా పారిపోయి దాన్నుంచి విడివడి దానికి అతీతంగా రాయలేరు. ఈసత్యాన్ని మరోసారి నిజం చేస్తూ ఈ నెల మీకు మరో భారతీయాంగ్ల కవయిత్రిని పరిచయం చేస్తున్నాను. ఈమె–గ్రేస్ నివేదితా సీతారామన్.

ఆమె గురించి ఆమెమాటల్లోనే–
“కవిత్వం నాకు చాలా అప్రయత్నంగా, యాదృచ్చికంగా మరియు ఆకస్మికంగా జరిగినదే. చిన్నప్పట్నుంచీ అల్లరి ఎక్కవే. అదే తరహాలో ఏడో తరగతిలో నేను చేసిన అల్లరికి శిక్షగా నా టీచర్ నన్ను క్లాస్ బయట మోకాళ్ళేయించింది.నా పెంకితనపు బుర్రకు అలాంటి శిక్షలే ఒక వరం అనుకుంటాను. ఆ వర్షాకాలపు మధ్యాహ్నం ఒక దిశా నిర్దేశంలేని పెంకిపిల్ల కవయిత్రిగా అవతారమెత్తింది. అప్రయత్నంగా ఓ కవిత నా మనసులోంచి ఉద్భవించింది. ఇక అప్పట్నుంచీ వెనుతిరిగి చూసిందిలేదు. చిత్రంగా వివిధ కవితా వస్తువులపై మరియు వివిధ ప్రక్రియలలో ఇప్పటికే దాదాపు 3500 వరకూ కవితలున్నా ఇప్పటివరకూ ఒక్క సంపుటినీ ప్రచురించకపోవటం మరో ట్విస్ట్–నా ఈ ప్రయాణంలో”.

గ్రేస్ సీతారామన్ గురించి చెప్పటానికి ఈ వేదిక సరిపోదేమో అని నా దురుద్దేశం. ఎందుకంటే ఆమె లేని సాంస్కృతిక, సామాజిక రంగంలేదు. LGBTQA వర్గంకోసం ఆమె తీవ్రంగా రాస్తుంటారు. చెయ్యాల్సిందంతా చేస్తుంటారు. సమాజంలోని అణగారిన వర్గపు జనకట్టు తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చేట్టుగా తాను చెప్పాల్సిందంతా చెప్తూ తన కవిత్వంలో వారికి ప్రధానపాత్ర కల్పిస్తుంటారు.

ఒక విద్యావేత్తగా, ఒక టోస్ట్‌మాస్టర్‌గా, రేడియో జాకీగా, పల్లె వాయిద్యకారిణిగా, మోటివేషనల్ స్పీకర్ గా, ఆహార పరిశోధకురాలిగా…….ఇలా ఎన్నని చెప్పను ఎంతకని రాయను! అందుకే అన్నాను శ్రీమతి సీతారామన్ గురించి పరిచయం చెయ్యటానికి ఏ ఒక్క వేదికా సరిపడదు అని.

“కలకత్తా నుంచి బెంగ్లూరు చేరుకున్న నాకు నా జీవితంలో ఒడిదుడుకులెన్నో. బహుశా అవన్నీ నాకు రాయటంలో సహాయపడ్డాయేమో. నాకు నా కవిత్వమెంతో నా కుటుంబం కూడా అంతే.చివరిగా ఒక్కమాట– నేను లేకుండా మిత్రులంతా ఆనందంగా ఉంటారేమో కానీ నాతో ఉన్నప్పుడు మాత్రం మీరు మీ కలల్ని చేధించుకుంటూ అవి పుట్టినచోటికే మీ బాణాలు సంధిస్తారు”.

అందుకే ఈ సంచికలో నేను కవయిత్రికి మీకూ మధ్య నేను రాలేదు. అన్నీ ఆమె మాటల్లోనే చెప్పాను.
ఇక ఎప్పటిలా ఆమెనడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన జవాబులిలా–

  1. కవిత్వం మీదృష్టిలో?
    ఒక విరామం. ఒక విడుపు. ఒక పరిశీలన, తత్వగ్రాహ్యం. ఒక నిజం. ఒక నేను. ఒక నువ్వు. ఇదీ కవిత్వం నాకు.
    కవిత్వం నిశ్శబ్దంతో చేసే ఒక సంభాషణ. గందరగోళపు జీవితంలో ఒక ప్రశాంతత.ఒక్కోసారి మండుతున్న ఒక అగ్నిగోళం తనకు తెలీని ఏమాత్రం పరిచయంలేని ఒక సహవాసికోసం చేసే ప్రయాణం. “మన గుండె చప్పుళ్లని తాకిన ప్రతిచేతికి మనమిచ్చే కృతజ్ఞతాభావ ప్రకటనే కవిత్వం.” అంటారు గ్రేస్ సీతారామన్.

కవిత్వం ఒక మార్మిక మేకప్ బాక్స్. జాలువారుతున్న కన్నీళ్ళని మెరిసే వజ్రాలుగా మార్చే అద్భుతపెట్టె.
చివరిగా ఆమె మాటల్లోనే కవిత్వం—
Sincere, Shameless, Sweet!

  1. విజయం అంటే మీరిచ్చే అర్ధం?
    విజయమా? అంటే అది నాకు గాలిలో రాయటం లాంటిది. అంచుల్లేని బావిలో ఈదటం లాంటిది. దానిగురించి నేనెప్పుడూ పెద్దగా ఆశించలేదు లేదు కాబట్టి నాకు దానిపై అవగాహన లేదు. ఇంతకుముందు చెప్పినట్లు ఏడో తరగతిలోనే నామొదటి కవిత రాయటం నా మొదటి విజయం అనుకోవచ్చు.

ఇక రెండోది– నా కవితా వాక్యాలని నా వంటగదిలో గోడకమర్చిన టైల్స్‌పై నా వాళ్ళు రాయించటం. నా విజయం కేవలం నా సాహితీ రంగంలోనే ఆగిపోకుండా వంటగదికి కూడా చేరుకుంది. అక్కడ నేను చేసె ప్రతిప్రయోగం విజయవంతం కావటానికి నేను అక్కడ వాడే ప్రతిదినుసూ మనుషుల మనసుల నుంచి తీసుకున్నదె. నేను చేసే ప్రతీకేక్‌లోను జీవితాన్ని చూసే నా వాళ్ళు అనే మాట ” ‘Life is a cakewalk’!” అని. ఏ చిరునామా లేని నాకవితలు నేనెప్పుడు చూడని ఎరగని పాఠకుల వద్దకు చేరుకుని వాళ్ళు స్పందించినప్పుడు అంతకంటే పెద్ద సాహితీ విజయం ఉంటుందని అనుకోను..కనీసం నావరకూ!

  1. మీ రచనా ప్రక్రియ ఎలా ఉంటుంది?
    నేను వాక్యాలతో ప్రయాణిస్తాను కానీ వాటిలో కొట్టుకుపోను. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నేను కవిత్వాన్ని శ్వాసిస్తాను. నిశ్శబ్దంతో నేను చేసే సంభాషణని అక్షరీకరించే ప్రయత్నమే నేను రాయటం. జీవితపు సువాసనలని నా కలమెప్పుడూ ఆఘ్రాణిస్తూనే ఉంటుంది.మరీ ముఖ్యంగా జీవితంలో అందరూ వదిలేసిన, విసిరేసినవాటిని మరీ ఆఘ్రాణిస్తూ ఉంటుంది.
    కొన్ని అంత:సంఘర్షణల తర్వాత నా నుంచి విడిపోయి వెళ్ళిపోయేదే నా కవిత్వం.

ఆమె రచనల్లోంచి ఏరుకున్న రెండు ఆణిముత్యాలు:
Poem- 1.
Dream Circus
PERFORMANCES IN MY MIND!

The Big Top opens its doors
when slumber deep in my heart’s core,
A pain lingers, a fear bleats, an unquenched thirst,
cannot fall off to sleep.
When all the waves around me calm,
The Dream Circus then in speed run,
their perform antics, trapeze and vaults,
Oh! my throat is parched, I am grappling in the dark.
The beasts in the Circus run over me,
Their tooth and claw, their fiery eyes,
Gobble meeeeee! My feet are tied!
I hang on tenter hooks ,
They Tear out my hair.
Ahhhhhhh! those fathom looks.
The Ring master howls,
The jokers prowllllll
Maaaaaa…. Where are youuu?
I am a wet puppy in the drainn..
The red breast robin I have lost
the refrain..
Fairies have flown away,
their tails left behind..
The Big Top tent is turning bright..
Circus is over.. the music stops,
My walking in reverie now slowly sleep hops!
Some day, some nights the mean mermaid in me awakens,
I lure the wrecked sailors.
into the deep blue seaaaa,
A lady with unrequited love I roam,
Toss the sea and ride the frothy foam.
The Dream I chase is not mine,
When the larger than life chase me,
I am not at all fine.
Some dreams construct, some destroy,
Some sleep to wake up in a different life.
The Circus, the chargrine, the Chase is on..
Sails my dream Circus boat
to a another night ,
to set up the grand Big Top.
The show must go on…
Sleep, slumber, sweet
A nightmare or a dream?
© grace

Poem – 2
GRIT BITTEN!
The Fly Catcher in early Spring,
falls on his knees to bring in the blades of grass.
He surely trusts the tenacity in his wings!
To me he is King Arthur
with his Excalibur,
every time he flies
few odd miles,
to select the perfect
blade of leaf or grass.

Much before that,
i spotted the little creature,
involved in due diligence
of the neighbourhood,
then the tree standing free.
The corridor of our forest home,
has a U shaped flowery balcony,
Some trees are there too,
A woody windy green corridor,
they mean so much in urban spaces.

So cautious in stride yet bold in strut,
the little creature had a defiant body feature.
Very particular it was,
It hopped from tree to tree,
branch to branch,
for a suitable property,
where he could weave a
basket, cone shaped,
mouth open..
The details he knew best.
Facilities he envisioned
that would make the nest,
glow as midnight spark..
a million fireflies,
making love in the dark!

The little hero I watched him work,
Silently, with patience of his own measure,
beyond any compare.
Fresh green blades,
flown in with instinctive care,
Woven with skill and love.

It was not a sight of exhibition to behold.
An artist’s perseverance
in benign,
The bird’s beak binding blades of grass,
into an immaculate
design ,
which is laid out on his
design table,
yet fitting in with precision in between the inverted tupik of the chosen tree.

The show had already begun!
Lovers, suitors, interested ones,
I would see them flying in with super chirp glee.
Pretty vocal, highly opinionated, electric,
The prospective females,
eclectic in taste,
maybe dumb also.
Beauty with no brains,
would zoom in flapping,
enter the nest and fly away..
No clapping!

I’d watch the Maker with renewed zest,
Build up new features and annexe blocks,
Maybe satisfying the loose talks,
the females had strewn around.
I took a sly walk with reverence,
What I saw was beyond my patience.
It had sealed the top with strips of mixed eucalyptus and herbs.
A herby 🌿 basinet with fragrant interiors.

The interior works were in progress.
Now the entrance I located
was on the side wall,
I saw it carry in feathers, thread and colourful strands of wool.
Comfy corners and soft blanket stools.
The wind was cold and blew strong.
I prayed as I felt something might go wrong.

At Midnight oneday
that fatal night,
the battalion had arrived!
Our fears now had taken shape.
We heard the trees tossing,
the ruckus of the monkeys,
in the surrounding forest.
Squeaking, croaking, thumping.
We heard their jump and saw them swing from
branch to branch.
When the bundarlogs arrive,
fears also the honey bees in their hives.
Makes miserable lives,
except for the garlic and chives.
Pungent in taste so monkey’s despise.

It was pretty dark outside,
the nest was not visible
to my sleepy naked eyes.
At sunrise early chilly morning,
I came to the window,
then to the balcony.
The labour of love had bitten the dust!
It was ransacked and torn out,
There was no nest on the tree anymore.
Like broken Easter Eggs in a pretty basket,
ripped apart by unknown miscreants.
So it is not only the women who builds sand castles,
knowing well it may be broken.

It is also the Menfolk who
labour to build,
to make both ends meet,
be it leaves, grass, concrete sand.
There will be hooligan monkeys,
who have no idea absolutely,
what lies between the blades of grass,
the story of the chosen tree.
Trees are free for both birds and monkeys!

© Grace Nivedita Sitharaman

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

3 thoughts on “నిశ్శబ్దంతో సంభాషణే నా కవిత్వం : గ్రేస్ నివేదితా సీతారామన్

  1. I feel the pampering of words by the Master Wordsmith Dr. Vadudev on my penning. Glad to read about myself in a different tongue unknown to me yet I am feeling blessed and is enjoying the free fall and the sky rocketing simultaneously.

Leave a Reply