కవిత్వం నన్ను మనిషిని చేస్తుంది

భారతీయాంగ్ల రచయితల్లో బహుళ రంగాల్లో ప్రతిభాపాటవాలని ప్రదర్శించే వారిలో ఎక్కువగా కవయిత్రులని మనం చూస్తున్నాం. ఇది మనం గమనించని విషయం కూడా. ఈ రోజు మనందరం “అబ్బే టైం లేదండి..ఏమీ చెయ్యలేకపోతున్నామంటే నమ్మండి.అసలు రోజు ఎలా గడుస్తుందో మాకే తెలీట్లేదండి” అనే వాళ్ళే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఇలా ఇంతలా ఎలా ఓ వ్యక్తి ఇన్ని రంగాల్లో ఎలా రాణించగలుగుతున్నారో నాకూ ఆశ్చర్యమే.

ఒక గృహిణిగా, అధ్యాపకురాలిగా, కవయిత్రిగా, నాట్యకారిణిగా రాణించటం అన్నది నిజంగా గొప్ప విషయాల్లో ఒకటి. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి కూడా అటువంటి మహామనిషి.

నేటి మన కవయిత్రి శ్రీమతి సీనా శ్రీవల్సన్. కేరళకు చెందిన ఈమె ద్విభాషా కవయిత్రి. ఆంగ్లం మరియు మళయాళంలో కవిత్వాన్ని రంగరించి రంగులద్ది మరీ మనపైకి విసురుతారు సీనా.మోహినీ అట్టంలో దిట్ట సీనా.

ఈమె మోహినీ అట్టంలో నాట్యం చేస్తుంటె రెండు కళ్ళూ చాలవంటే మీరు నమ్మరేమొ. ఈమె మోహినీ అవతారానికి మనం సమ్మోహనం అవ్వాల్సిందే. తప్పదు.ఇలా బహుముఖీన ప్రజ్ఞావతి సీనా.ఈమె గురించి ఈమె మాటల్లోనే విందాం. దేశ విదేశ కవిసమ్మేళనాల్లో పాల్గొని తమగళాన్ని వినిపించారు సీనా. అలాగే ప్రపంచంలోని అన్ని పత్రికల్లోనూ శ్రీమతి సీనా కవితలని ప్రచురించటం జరిగింది. దాదాపు 40 దేశాలనుంచి సేకరించిన కవితలతో సంకలనానికి సంపాదకత్వం వహించారు సీనా శ్రీవల్సన్.

ఈమె కవితలని చదువుతూ ఈమె నాట్యం వీక్షించటం మాటలకందని అనుభూతి.

సీనా మళయాళి కవిత్వ సంకలనానికి గానూ “పూంతనం యువసాహిత్య పురస్కారం” అందుకున్నారు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. వీరందుకున్న పురస్కారాల గురించి మనం మరోసారి మాట్లాడుకోవాల్సిందే.

సీనాతో నెరపిన ముచ్చట్లలో కొంతభాగం ఇక్కడ…మీకోసం!

1. కవిత్వం మీకేమిటి?

నా వరకూ కవిత్వం ఓ ప్రతిక్రియ. ఓ ఔషధం.అస్థిరచిత్తం నుంచి బయటపడాలనుకున్నప్పుడల్లా నాకు కవిత్వమే ఓ విరామం. నన్ను కవిత్వం బతికిస్తుంది. కవిత్వం నన్ను మనిషిని చేస్తుంది. నా మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడేసి నన్ను నేను తెల్సుకునేలా చేసేదే  కవిత్వం.అది మళయాళీ ఐనా ఆంగ్లమైనా  నావరకూ కవిత్వం ఓ పరమాయుధం.

 2.కవిత్వ పఠనానికి, రచనా వ్యాసంగానికి తేడా?

ఎన్ని పుస్తకాలేసామా, ఎన్ని కవిత్వ సంకలనాలేసామా అన్నది  ప్రధానం కాదన్నది నా అభిప్రాయం. కవితలో ప్రాణం ఉండాలి. కవిత ఆకట్టుకోగలగాలి. అంతే. అది ఒక్క వాక్యమైనా చాలు.

నేను ఎన్ని కవితలు రాసానో నాకే గుర్తులేదు. అవి గుర్తుపెట్టుకోనుకూడా. కానీ నా కవిత్వంతో నా మోహినీ అట్టం నాట్యం నాతో కూడా ఉంటాది. అవి రెండు నా రెండుకళ్ళు. నా మళయాళీ కవిత్వం మరియి ఆంగ్ల కవిత్వమూ నా కిష్టమే. కవిత్వం నన్ను ఎప్పటికప్పుడు మార్చేస్తూంటాది.

3. పబ్లిషింగ్ రంగంపై మీ అభిప్రాయం మరియు అనుభవం?

చాలా మంది తమ రచనలని ప్రచురించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా వంతు సహాయం చేస్తున్నాను. వారి రచనలని ప్రింట్ చేసే విధంగా నా వంతు కృషి చేస్తున్నాను.

ఇక సీనా కవితలని చదువుదామ? ఇలా? ఇక్కడ!

1.Hide and Seek

Its a game,

We play hide and seek.

The crouching paws of

Invisible enemies

Search you and me.

Unprecedented waves of chaos

Unroll your canvas

The day and night

Like an unfinished painting

Blurred ….

Unknown colours,

Unfamiliar brush strokes.

We are captives

Desperately seeking

Warmth of life.

2. Of Earth

Gentle, Wild, Deep

Inclining to which word

Should I draw you?

Fingers ask in a confusing tone.

The wind softly pats petals

And calls out.

Something incorporeal

Falls on my ear.

Silence stretches out its roots

Sending messages to the water ways.

The earth sings

The earth dances

The earth kisses

Wings are torn in the fingerprints

 Wild flies lose their way

Fed up with the dry rivers.

Finally  we see an inanimate caged

Inside the womb.

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply