ఉన్నయల్లా పాములే

అహ్హహ్హహ్హ
ఇక్కడ భూముల్లేవు
సాముల్లేరు
మన ఏలిన వారినోట
ఎంత తియ్యని మాట.

అది విన్న భూముల్లేనోళ్ళ
చెవుల్ల సీసంబోసినట్లయే
కల్గినోళ్ళ నోట్లే చక్కెరబోసినట్లాయే.

భూముల్లేకుండా
సాముల్లేకుండా
ఉన్నయన్ని యాడబాయెనే!

రియల్టర్ల చేతులచిక్కి
ఎక్కెక్కి ఏడ్చెనా?
ఫాంహౌజుల పాలయ్యి
పాముల్లెక్క పడకలేసెనా?

ఉన్నదున్నట్లు చెప్పుండ్లి బాంచెన్
నీ మూడెకురాలెమొద్దు
నువ్విత్తన్న డబ్బల బెడ్రూంలేమొద్దు గనీ

గుంటెడు జాగుంటే గుడిచేసుకుంట.

పుట్టింది ములుగు జిల్లా అబ్బాపూర్. కవి, రచయిత, సామాజిక కార్యకర్త. అధ్యాపకుడు.  ప్రస్తుతం హన్మకొండ లో నివాసం ఉంటున్నారు. కవిత్వం, పాటలు, కథలు రాస్తారు. యువకవులు, రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో 2007లో వరంగల్ రచయితల సంఘం స్థాపించారు. వివిధ సామాజిక అంశాలపై ప్రచురించిన పదిహేడు పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నారు. "ఆశయాల పందిరి" (కవిత్వం), "చావైనా రేవైనా"(వీధి నాటిక) స్వీయ సృజన రచనలు ముద్రించారు.

Leave a Reply