మూలం: మౌమితా ఆలం
థ్యాంక్ గాడ్
వాళ్లు నిన్ను ఫ్యాంటీలో చూసేశారు
ఇక నిన్నూ, నీ అక్కాచెల్లెళ్ళనూ
బంధం విముక్తం చేయడానికి
ఆఫ్ఘనిస్తాన్ వలెనే
ఇరాన్ మీద బాంబులు వేస్తారేమో
తెల్ల అమెరికన్లకు
స్త్రీ విముక్తి అంటే
వల్లమాలిన ప్రేమ
హిజాబ్ లో
మీ బాధను చూసితట్టుకోలేరు
ఆగండి
మీ ఇండ్ల మీద బాంబులేసి
మిమ్ముల విముక్తం చేయడానికి
రక్షకులు వొచ్చేస్తున్నారు
పాలస్తీనాలో
ముక్కలుగా తెగిపడ్డ
తల్లీ పిల్లల శరీరాల జూసి
ఆనందించగలరేమో గానీ
మీ బాధల్ని చూసి మాత్రం
అస్సలు తట్టుకోలేరు
వాళ్ళు జగద్రక్షకులు
పరమ పావనులు
పాల స్తీనాలో
రోజుల తరబడి
తిండి దొరకక
బక్క చిక్కిన పిల్లల ముఖాలు
చూడగలరేమోగాని
మీ బాధల్ని చూసి మాత్రం
అస్సలు తట్టుకోలేరు
సున్నిత హృదయులు వాళ్ళు
విశాల దృక్పథం వాళ్ళది
ఆగండా గండి
మీకో జత ఫ్యాంటీలను ఇవ్వడానికి
కుళ్ళిన మీ అక్కాచెళ్ళెల్ల శవాలపై
కఫన్ కప్పడానికి
మిమ్ముల బంధ విముక్తం చేయడానికి
అమెరికా వాళ్లు, వాళ్ళ సహచరులు
వొచ్చేస్తున్నారు ..వొచ్చేస్తున్నారు.