అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ధోరణులను ఖండిస్తున్నాం

ఇటీవలి కాలంలో పెరుగుతున్న మత పరమైన అసహన సంస్కృతికి అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించబడిన కొన్ని మతోన్మాద శక్తులు సోషల్ మీడియానీ, ఇతర సాధనాలనూ దుర్వినియోగం చేస్తూ, స్త్రీల పట్ల అశ్లీలమైన, అసభ్యకరమైన భాషను వాడుతూ ప్రగతిశీల మహిళా మేధావులు, రచయిత్రులు, జర్నలిస్టులు , యాక్టివిస్టులు, కళాకారులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా లో నీచమైన దాడులుచేస్తున్నాయి. ఫోన్‌ లలో కూడా బెదిరి స్తున్నాయి. వీరు వినియోగించే పద్ధతులు, వాడే భాష వీరి నేపథ్యాన్నీ, మేధాస్థాయినీ, నేర ప్రవృత్తినీ వెల్లడిస్తున్నాయి. తమ ఆలోచనల తో ఏకీభవించకుండా, భిన్నమైన ఆలోచనలు కలిగినవారి నోళ్లు మూయించే అనాగరిక, అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. సహజంగానే ఈ రకమైన దాడి ప్రధానంగా స్త్రీల మీదనే ఎక్కువగా జరుగుతున్నది. వీరి దృష్టిలో స్త్రీలు వంటింటి కుందేళ్లుగానే జీవించాలి.స్త్రీలు దేశంలో ఏర్పడుతున్న మత, రాజకీయ పరిణామాల గురించి ఆలోచించడం, తమ భావాలను వ్యక్తపరచడం ఈ అప్రజాస్వామిక, సంప్రదాయ వాద సమర్ధక ముఠాలకు నచ్చదు. స్త్రీలు తమ ఇష్టాలకు అనుగుణంగా కట్టు, బొట్టు, వేష, భాష ధారణలు చేసినప్పుడల్లా ఈ అరాచకులు రంగంలోకి దిగి, వ్యక్తిగతంగా కాల్ చేసి, తలుచుకుంటే వారి ఇళ్లపై దాడులు చేయగలమని, ప్రాణ హాని తలపెట్టగలమని బెదిరింపులకు పూనుకుంటున్నారు.

చర్చకు, భిన్నాభిప్రాయాలకూ తావులేకుండా చేసి, తమ విషపూరిత ద్వేషభావాలను విస్తృతంగా ప్రచారం చెయ్యడమే వీరి ఆశయం.

ఈ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ధోరణులను మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ఈ దేశ పౌరులందరికీ వాక్స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఫలాన విధంగా అభిప్రాయాలు వ్యక్తపరచకూడదని, ఫలానా విధంగానే బతకాలని శాశించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ప్రాధమిక హక్కుని ప్రభుత్వం తో బాటు ఎవరూ హరించడానికి వీలులేదు.

ఈ విధంగా బెదిరింపులకు, దాడులకు పాల్పడే శక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అట్టి శక్తుల దూకుడుని కట్టడి చేయాల్సిందిగా ప్రభుత్వ వర్గాలను, పోలీసు వ్యవస్థను కోరుతున్నాం.

ప్రజాస్వామిక సంస్థలు , వేదికలు :
ప్రొ.జి.లక్ష్మణ్( పౌరహక్కుల సంఘం, తెలంగాణ) , ఎస్.జీవన్ కుమార్ ( మానవ హక్కుల వేదిక, తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాలు) , అరసవిల్లి కృష్ణ , రివేరా ( విప్లవ రచయితలసంఘం) , శ్రీదేవి (చైతన్య మహిళా సంఘం) విజయ భండారు (హైదరాబాద్ విమెన్ రైటర్స్ ఫోరమ్), పసునూరి రవీందర్ , కన్వీనర్ ( సముహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్), కె. శ్రీనివాసాచారి ( హైదరాబాద్ హ్యుమనిస్ట్ మీట్) రేణుకా అయోల , తూముచర్ల రాజారాం ( సంతకం సాహిత్యవేదిక) , ఐకా బాలాజీ( మ౦చి సినిమా గ్రూపు) , బి. గిరిజ ( Voice for gender Justice) కొండవీటి సత్యవతి (భూమిక) , అమరేంద్ర దాసరి (సాహితీవేదిక డిల్లీ) , డా. బైరి నరేష్ , జాతీయ అధ్యక్షుడు (మూఢనమ్మకాల నిర్మూలన సంఘం), మహిళా మరియు ట్రాన్స్ జండర్ సంస్థల ఐఖ్య కార్యాచరణ వేదిక, ఖలీదా పర్వీన్, ఉష ( సన్నిహిత) , వి.సంధ్య (POW), సజయ, సుమిత్ర (అంకురం), వంగపల్లి పద్మ (వాయిస్ ఆఫ్ ద పీపుల్), కన్నెగంటి రవి( రైతు స్వరాజ్యవేదిక), గీతాంజలి(వెన్నెల సాహిత్య సామాజిక అధ్యయన వేదిక).

కవులు, రచయితలు, కార్యకర్తలు , విలేకరులు, న్యాయ వాద నిపుణులు :
అఫ్సర్, నారాయణ స్వామి , డా. సి. మృణాళిని, గోగు శ్యామల , విమల, ప్రసాదముర్తి , అరణ్య కృష్ణ , వెంకటకృష్ణ , దొంత౦ చరణ్, నరేష్ సూఫీ ,అరుణాంక్ లత, ఓల్గా , అక్కినేని కుటుంబరావు , పి .సత్యవతి , కొండేపూడి నిర్మల, ప్రతిమ, ఉదయమిత్ర , ఎ.కె ప్రభాకర్ , నల్లూరి రుక్మిణి , తేళ్ళ అరుణ , అపర్ణ తోట, శివ లక్ష్మి , లక్ష్మీ సుహాసిని , కత్తి పద్మ, సీతా కంభం పాటి , శా౦తి ప్రబోధ, అమరవాది నీరజ, గుత్తా జ్యోత్స్న, చల్లా సరోజినీ దేవి, బెల్లపు అనురాధ, చలం జీ.ఎస్, దుర్గా డి౦గరి, ఘ౦టసాల నిర్మల , పైడిమర్రి గిరిజ, జయలక్ష్మి, సమ్మెట ఉమాదేవి , మ౦జుల, రోహిణి వంజారి , రాజ్యలక్ష్మి, శ్రీదేవి, నాంపల్లి సుజాత, మెర్సీ మార్గరెట్ , కాత్యాయిని కె, సంధ్య కె, వివి జ్యోతి, గోపరాజు సుధ, రూపారుక్మిణి, సురేఖ, శీలా సుభద్రా దేవి, శిలాలోలిత , ఆశాలత, అంబిక, రత్నా సుమతి, రుక్మిణీ రావు, మీరా సంఘమిత్ర, రచన, వైజయంతి, ఇందిర, జహాఆరా, కల్పనా కన్నాబిరన్, హేమలలిత,సావిత్రి కోల ,కన్నెగంటి అనసూయ కృష్ణకుమారి , ఝాన్సీ ,అనసూయ, సుజాత,సరోజినీదేవి ,శాంతిశ్రీ బెనర్జీ , రోహిణి ,డా. కె.బి సంధ్యా విప్లవ్, వాసరచెట్ల జయంతి, జ్వలిత , డా.నళిని, అరుణ , డి. భారతి , కె. ప్రవీణ్, వైష్ణవిశ్రీ, సుభాషిణి తోట, సి.హెచ్ ఉషారాణి, శోభాభట్, రోజారాణి దాసరి తదితరులు…

Leave a Reply