సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నవంబర్ 22 2025 (శనివారం) నాడు Words Against Walls పేరుతో Youth Literature Festival 2025 (ఒకరోజు యువజన సాహిత్యోత్సవం) నిర్వహించ తలపెట్టిన విషయం మీతో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము.
యువతలో విద్యార్థుల్లో రాజ్యాంగం ప్రాథమికంగా నిర్దేశించిన లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో సమూహ ఈ కార్యక్రమం చేస్తున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా ప్రముఖ సమకాలీన కవులు రచయితలు మరీ ముఖ్యంగా దాదాపు 60 మంది యువరచయితలు విద్యార్థులు పాల్గొనే ఈ ఉత్సవాన్ని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. వివిధ వేదికలపై జరిగే ఈ కార్యక్రమంలో 12 సమాంతర సెషన్లలో మూడుతరాల గొంతుకలు తమ రచనానుభవాలు వినిపిస్తాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తమిళ రచయిత్రి సుకీర్త రాణి, ఆత్మీయ అతిథిగా మహిళా విశ్వవిద్యాలయం విసి ప్రొ. సూర్యా ధనంజయ్ పాల్గొంటున్నారు. డార్జిలింగ్ కి చెందిన నేపాలీ ధిక్కార కవి మనోజ్ బోగటి తో ప్రత్యేక సెషన్ ఉంటుంది. కవిత్వంతో సంభాషణలో ముప్పై మంది యువ కవులు సీనియర్ కవులతో, కథతో ప్రయాణంలో మరో ముప్పై మంది యువ కథకులు సీనియర్ కథా రచయితలతో సంభాషిస్తారు.
భిన్న అస్తిత్వాలకు చెందిన మేధావులు విద్వేష కాలంలో రచయితల కర్తవ్యాలను సమీక్షిస్తారు. ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా కవులు రచయితలూ ప్రతిఘటన స్వరాలు వినిపిస్తారు. కొత్త పాత రతరాలకు చెందిన ప్రచురణ కర్తలు ఆ రంగంలో ఎదురయ్యే సవాళ్ళను చర్చిస్తారు. రెండు వేదికలపై యువ రచయితల కొత్త పుస్తకాల పరిచయ సభలు జరుగుతాయి. కొత్త తరంలో పఠనాసక్తిని సామాజిక చింతనను పెంపొందించేందుకు డజనుకు పైగా పబ్లికేషన్ సంస్థలతో బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసున్నాము. నిశ్శబ్దపు గోడల్ని ఛేదించేది యువశక్తే. ఆ శక్తిని ప్రజ్వలింపజేసేది సాహిత్యమే. వివిధ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల్లో మరుగున పడి ఉన్న యువతకు ఒక గొంతుకను, ఒక వేదికను ఇవ్వాలన్నదే ఈ సమూహ యువ సాహిత్య ఉత్సవం ప్రథమ ఆకాంక్ష.
సలహా మండలి సభ్యులు
కె. శివారెడ్డి
ఖాదర్ మొహియుద్దీన్
నందిని సిధారెడ్డి
నారాయణ స్వామి వెంకటయోగి
జూపాక సుభద్ర
కన్వీనర్లు :
యాకూబ్
పసునూరి రవీందర్
ఎ.కె.ప్రభాకర్
మెట్టు రవీందర్
భూపతి వెంకటేశ్వర్లు
కాత్యాయనీ విద్మహే
నరేశ్ కుమార్ సూఫీ
కార్యవర్గ సభ్యులు :
జిలుకర శ్రీనివాస్
సుంకిరెడ్డి నారాయణరెడ్డి
దాసోజు లలిత
కటుకోజ్వల ఆనందాచారి
మెర్సీ మార్గరెట్
నాళేశ్వరం శంకరం
స్కైబాబా
యస్. మల్లారెడ్డి
రూపారుక్మిణి
ఎస్. జగన్రెడ్డి
దెంచనాల జ్వలిత
అమృత్రాజు
గుడిపల్లి నిరంజన్
మన్నె ఏలియా
మువ్వా శ్రీనివాసరావు
వి.శంకర్
రాపోలు సుదర్శన్
సిద్ధెంకి యాదగిరి
ఉదయమిత్ర
పరిశీలకులు :
చల్లపల్లి స్వరూపరాణి
బండి నారాయణస్వామి
వి. ప్రతిమ
ఎ. కృష్ణారావు
మల్లిపురం జగదీశ్
సంప్రదించడానికి : మెర్సీ మార్గరెట్
9052809952 సెక్రెటరీ, సమూహ యూత్ లిటరేచర్ ఆర్గనైజింగ్ కమిటీ.