7. వర్గసమాజంలో యజమానులు చెప్పినట్లు కార్మికులు గుడ్డిగా పనిచేస్తారు.తాజ్ మహల్ నిర్మాణానికి అందరూ తలా ఒకరాయి ఎత్తినవాళ్ళే. రాయిమోయడమే వాళ్ళకుతెలుసు. తాజ్…
Author: కేతవరపు రామకోటిశాస్త్రి
కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 1931 డిసెంబర్ 26 న అప్పటి గుంటూరు జిల్లా రంగశాయపుర అగ్రహారంలో పుట్టారు. కన్నతల్లి తెలికేపల్లి వెంకమ్మ ,దత్తు తీసుకొని విద్యాబుద్ధులు చెప్పించిన తల్లి కేతవరపు సావిత్రమ్మ. హైస్కూల్ చదువు వినుకొండలో ఇంటర్మీడియేట్ గుంటూరు లో హిందూ కాలేజీలో చదివి కొంతకాలం సత్తెనపల్లిలో టీచర్ గా పనిచేసి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ ఆనర్స్ పూర్తి చేసి 1954 లో గుడివాడ ANR కాలేజీలో లెక్చరర్ గా చేరారు . 1957 లో ఉద్యోగం మానేసి ఉస్మానియావిశ్వవిద్యాలయం లో బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పంపై డాక్టరేట్ పట్టా పొందారు. 1960 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు. 1968 లో వరంగల్లు పిజి సెంటర్ కు బదిలీ అయివచ్చి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగువిభాగం అభివృద్ధికి నిలబడ్డారు. ఉద్యోగజీవితం మరో అయిదారు నెలల లో ముగుస్తుందనగా రోడ్డు ప్రమాదంలో 1991 అక్టోబర్ 28 న ఆయన జీవితమే ముగిసింది.
ఇంటర్మీడియట్ చదువ్వుతున్న కాలంలోనే ఆయనలో సాహిత్య సృజనవిమర్శన శక్తుల వికాసం మొదలైంది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రభావంతో పద్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. విశ్వనాథ సాహిత్య అభిమాని అయినారు. మహాభారతం వంటి సంప్రదాయ సాహిత్యాన్ని ఎంత గాఢంగా అధ్యయనం చేశారో విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఎంత పారాయణ చేశారో ఆధునిక సాహిత్యాన్ని కూడా అంతశ్రద్ధగా చదివారు. 1968 లో వరంగల్లుకు తిరిగిరావటం ఆయన జీవితంలో పెద్ద మలుపు. అక్కడనుండి మార్క్సిస్టు తత్వశాస్త్ర అధ్యయనం , అవగాహన ఆయన సాహిత్య కృషిని విప్లవాత్మకంగా మార్చాయి. సమాజ సాహిత్య సంబంధాలగురించి రాజకీయార్థిక దృక్పథంతో చేస్తున్న చింతనను సంభాషణగా మార్చటానికి 1986-87 విద్యాసంవత్సరం లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి జాతీయఉపన్యాస కార్యక్రమం ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ విశ్వవిద్యా లయాలలో ప్రసంగించటానికి ఎంపిక అయిన సందర్భాన్నిచక్కగా ఉపయోగించుకున్నారు. అధ్యయనం, బోధన, విమర్శన, రచన ఆయన ఆచరణ. పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస ఆయనది. వందకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. మెదడులో సుళ్ళు తిరిగే ఆలోచనలను కాగితం మీద పెట్టి చూసుకొనటం సమానభావాలు, స్పందనా లక్షణం ఉన్న సాహిత్య జిజ్ఞాసువులైన స్నేహితులతో సంభాషణలో నిగ్గు తేల్చుకొనటం ఆయన ప్రవృత్తి.
ఆనందచేతన(1958), అంగహేల, శత్రుంజయము (1963) గీతాంజలి అనువాదం(1962) శాస్త్రి గారు బ్రతికిన కాలపు కవిత్వ రచనలు. ఆయన జీవితకాలంలో వచ్చిన విమర్శ గ్రంధాలు నైమిశము(1961), సమీక్షణ (1963) తిక్కన కావ్య శిల్పం ( 1973),భారతము- తత్వ దర్శనము (1976) తిక్కన హరిహరనాథ తత్వము (1976) పోతన్నగారి వైచిత్రి (1987).
మరణానంతర ప్రచురణలు- ఒకే ఇద్దరం (1996) చిచ్చేతన (2006) శ్రీకృష్ణ దూత్యము మరికొన్ని ముక్తకాలు- ఖండికలు( 2009) కవిత్వం. మళ్ళీ కన్యాశుల్కం గురించి (1992), నాటక విశ్లేషణ (1993), విశ్వనాథ వైఖరి( 1994),మహిళా సమాజవాడ సాహిత్యం (1995) అభ్యుదయవాద సాహిత్య విమర్శనా దృక్పథం (1996)కవిత్వం- సమాజం క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ (1998) భారతీయ సాహిత్య శాస్త్రం - భిన్న దృక్పథాలు (1999)నాచన సోముడు (2000) తెలుగు కవిత ఉద్యమాలు (2001) భాషా సాహిత్యాలు - సామాజిక భావనలు (2002) పురాణేతిహాసాలు - విశేష విశ్లేషణలు (2003) సంఘర్షణ - సంవాదం (2004) దృష్టి - దృశ్యం (2005) కావ్య జిజ్ఞాస (2007)సాహిత్య సామాజికతా వాదం - కొన్ని ప్రతిపాదనలు (2008) ఒక రత్నము - ఒక మంత్రము , శృంగార నైషధ కావ్య జిజ్ఞాస( 2010) సాహిత్య సంభావన( 2011)శాస్త్రీయ సమీక్షలు - ముందుమాటలు( 2013) కవిత్వం : అనుభవం - అవగాహన( 2014) నవలాలోకనం (2015) విమర్శ గ్రంధాలు.
కవిత్వం- సమాజం (క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ) : 1
( కాడ్వెల్ కవితతత్త్వం అనే శీర్షికతో ఇది వరంగల్ నుండి వచ్చే జనధర్మ ద్వైమాసిక పత్రికలో 1969 మార్చ్ నుండి 1969…