కేరళలో పుట్టిపెరిగినా కర్ణాటకలో స్థిరపడిన రాజీవ్ మూథేదాథ్ వృత్తిరీత్యా ఓ కార్పోరేట్ ఉద్యోగి. హ్యూండాయ్ మోటార్స్ లో హెచ్చార్ గా పనిచేసి పదవీవిరణమానంతరం పూర్తిస్థాయిలో రచనా వ్యాసంగానికీ, కార్పొరేట్ శిక్షణకూ పరిమితమైన వ్యక్తి శ్రీరాజీవ్. ఆంగ్లంలో కథలూ కవితలూ వీరి ప్రవృత్తి.
2015 లో వీరి మొదటి పుస్తకం “straight from the heart –Thoughts and experiences of an HR professional” ప్రచురితం. ఓ నాలుగేళ్ళ తర్వాత 2019 లో రెండో సంకలనం “ Corporate Poems- Straight & Simple” వెలువరించారు. ఈ ఎడాది “Random Thoughts on Random words” వెలుగు చూసింది. ఈ మూడు పుస్తకాల శీర్షికలు చూస్తే ఏ పాఠకుడికైనా వీరు సాహిత్యం పట్ల చూపే అభిమానం, ఆత్మీయత అర్థమవుతాయి. సాహిత్యేతర నేపథ్యం నుంచి వచ్చినా పుస్తకం శీర్షికనుంచే పాఠకుణ్ణి ఆకట్టుకోవాలనే ఆలోచనే గొప్పది. ఏషియన్ లిటరరీ సొసైటీ నుంచి ప్రత్యేకపురస్కారం, విశ్వవ్యాప్త సాహితీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వీరి సాహితీ సేవకు గానూ గుజరాత్ సాహిత్య ఎకాడెమీ వారి పురస్కారం మున్నగునవి వీరి సాధించినవాటిల్లో కొన్ని మాత్రమే.
“21st century critical thought – A dialogue with post-modern voices” Volume 3 లో వీరితో జరిపిన ఇంటర్వ్యూ ప్రచురితం కావటం వీరి సాహితీ ప్రస్థానంలో ఓ కలికితురాయి.
ఇక వీరితో కొలిమి జరిపిన ముఖాముఖినుంచి కొంతభాగం మీ కోసం:
జీవితంలో మిమ్మల్ని కవిత్వంవైపు ప్రేరేపించిన సంఘటన కానీ అంశం కానీ ప్రధానంగా ఏది?
అది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఐదోక్లాసులో ఉండగా నేను నా మొదటి కవిత రాశాను. మా టీచర్ దాన్ని చూసి తనతో కూడా తీసుకెళ్ళి పూర్తిగా చదివి తనకు తోచిన మార్పులు చేర్పులతో మర్నాడు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ దానిని చూసాక ఇక నాది కాదనిపించింది. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను. ఐతే ఎవ్వరూ మార్పులు చేర్పులు చెయ్యనివిధంగా కవిత్వం రాయాలి లేదంటే పూర్తిగా రాయటం మానేయటం అని. అప్పట్నుంచి మా సిలబస్‌లో ఉన్న కవితలన్నీ ఆసక్తిగా చదవటం మొదలుపెట్టాను. అప్పుడు చదివిన మిల్టన్, కీట్స్, షెల్లీ మొదలగు కవుల కవితలని చదివి ఆకళింపు చేసుకుని ఒక్క కవితలో కనీసం ఒక్క వాక్యమైనా కవితాత్మకం చెయ్యాలని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎంతవరకూ నేను కృతకృత్యుణయ్యానో తెలియదు. ఇంకా నేర్చుకునే ప్రయత్నం లోనే ఉన్నా.
తరువాతికాలంలో అవగతమైన నిజం– కవిత్వ ప్రేరణకి జీవితాన్ని మించిన మూలం మరొకటిలేదని. ఐతే జీవితంలోని కవితాంశాన్ని కవిత్వీకరించటం తెలుసుకోవటమే కవికి అతిపెద్ద సవాలు.
సాహిత్య ప్రక్రియల్లో మీకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చినది?
మీ ప్రశ్న నాకిలా అర్థమయింది. ఒక పాఠకుడిగానా, ఒక కవిగా/రచయితగానా అన్నది. పాఠకుడిగా చాలా పుస్తకాలు రచయితలు కవులు ఇష్టం. ఎనిడ్బ్లైటన్ నుంచి అగాథాక్రిస్టీ, పీజీ ఉడ్‌హౌస్, ఆర్కెనారాయణ్ వరకు ఇలా చాలా మంది రచయితలు ఇష్టం. వీళ్ళందరి ప్రభావం నాపై ఉంది. ఇక రచయితగా కవిత్వం నా ఫెవరేట్ జాన్రా. ముఖ్యంగా ప్రకృతి, మానవ సంబంధాలు లాంటి విషయాలను స్పృశించేది ఏదైనా నాకిష్టమే.
కవిత్వం మానవాళికి ఏవిధంగా ఉపుయోగపడుతుందని మీరనుకుంటున్నారు?
ఈ ప్రశ్నకి జవాబు ఏ ఇద్దరిదీ ఒకేలా ఉండదు. నిజానికి సాహిత్యానికి ఓ ప్రయోజనాత్మకత ఉంటుందని నేననుకోను- ఏ రాజకీయ కవిత్వంలోనో తప్ప. కవి తనకిష్టమై రాసుకుంటాడు. పాఠకుడు తనకిష్టమై చదువుకుంటాడు. దానివల్ల వెంటనే ఏదో గొప్ప ప్రయోజనం ఒనగూరుతుందని నేననుకోవట్లేదు. అది వస్తుగతమైంది. వ్యక్తిగతమైనది కూడ.
ప్రయోజనాన్ని ఆశించి ఎవరైనా ఏదైనా రాస్తారేమోకానీ అలాంటిది ఆశించి ఒక పాఠకుడు చదువుతాడని నేననుకోను.
A Dreamer for Life
We are all dreamers as children
Innocent, natural, spontaneous
Till the ‘knowledgeable’ adults interfere
Tell us what we can dream about, how much
And also advise to dream ‘realistically’
So many are the rules, regulations
Of life and living itself
Why put them, rules even on dreaming?
Dreaming can take one to great heights
Unimaginable, to a mediocre mind
Dream, dream, dream
Exhorted our people’s president, Kalam
Passionate dreams do not happen when asleep
They just don’t let you sleep said the noble soul
If dreams were discouraged
Many wouldn’t have reached where they did
Unleash your potential, be a dreamer
And remember to not only dream
But be the one who just
Doesn’t stop dreaming…
When you look at it…
When you look at it…
It is so easy to misunderstand
Relationships built painstakingly
Over the years
Can break on a single instance
Friends can turn in to foes
Close relatives enemies
Understanding turn into misunderstanding
In seconds… so fragile
Are our relationships
Yet eons ago prince Lakshman
On Bharat, approaching the forest
Accompanied by the army
Accused him of treachery-
One not satisfied with the banishment
Wanted to kill & snuff out
Any claimant, once for all
But Ram chided him
For harbouring such thoughts
Of a noble brother
Agitated Lakshman asked Ram
To compare him, Lakshman to Bharat
If I were to ask you, said Ram
To jump in to the fire
“Why Bhaiyya, what wrong did I do” you’d ask
But Bharat would simply
In the very moment
Jump in to the fire!
Yes, today easy has it become
To misunderstand…
Inspired by the legends
We can perhaps, pause a little
And be kinder before
Assigning motives negative
To friends, relatives, loved ones
As more closer the relationship
The harsher are we on them
Yes, when you look at it…