బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది ఐద వది. దివంగత మాల్కం X (Malcolm X) రాజకీయాల స్ఫూర్తితో 1966లో బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపించబడింది. చైనాలో జరిగిన గొప్ప శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవంతో అత్యంత ప్రభావితమైన బ్లాక్ పాంథర్ పార్టీ ఒక నల్లజాతి మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ సంస్థ. కొంతకాలంపాటు వారు అమెరికాలో నల్లజాతీయుల విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. విప్లవ రాజకీయాలను చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించారు. శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ సమాజంలో ఐక్య సంఘటనకు పురికొల్పిన పౌరహక్కుల ఉద్యమానికి ఇది చాలావరకు భిన్నమైనది. మునుపటి వ్యాసంలో మేము బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో అధ్యాయాన్ని విప్లవాత్మకంగా నిర్వహించడం గురించే గాక ఫ్రెడ్ హాంప్టన్ హత్య గురించి వివరించాం. ఈ ఆర్టికల్‌లో బ్లాక్ పాంథర్ పార్టీలో చివరికి పార్టీ చీలికకు దారితీసిన సమస్యలను, వారి మధ్య ఏర్పడిన విభేదాలను విశ్లేషిస్తాం. ఈ సమస్యలలో జాతీయ నాయకత్వం – స్థానిక అధ్యాయాల మధ్య సమాచార లోపాలు, సమన్వయ సమస్యలు, విప్లవాత్మక వ్యూహంపై సైద్ధాంతిక వ్యత్యాసాలను చర్చిస్తాం. ఎఫ్ బి ఐ, అమెరికా ప్రభుత్వ క్రూరమైన అణచివేతలను కూడా వివరిస్తాం.
బ్లాక్ పాంథర్ పార్టీ రోజు రోజూకీ పెరగడం, అభివృద్ధి చెందుతున్న కొద్దీ అది రకరకాల అడ్డంకులను, వివిధ వైరుధ్యాలను ఎదుర్కోవలసివచ్చింది. బే ఏరియాలో ఒక చిన్న విప్లవసంస్థగా ఏర్పడిన నాటినుండి అనేక నగరాలలో డజన్లకొద్దీ శాఖలతో ఒక జాతీయ సంస్థగా పార్టీ రూపాంతరం చెందుతుండడంతో అది అనేక కొత్త ప్రశ్నలను, సవాళ్ళను వరసగా ఎదుర్కొనవలసివచ్చింది. బ్లాక్ పాంథర్ పార్టీ బేలో చిన్నసంస్థగా ఉన్నప్పుడు, సభ్యులందరూ కలిసి పనిచేయడంవల్ల వివిధ సమస్యలను, రాజకీయ విభేదాలను కూడా చాలా సులభంగా పరిష్కరించగలిగింది. ఏది ఏమైనప్పటికీ, దేశవ్యాప్తంగా విప్లవాత్మక సంస్థలను సమన్వయం చేయడంలో, పోలీసులతో, రాజకీయ నాయకులతో, ఎఫ్ బి ఐ తో , ప్రభుత్వ అణచివేతలతో పాటు అనేక కొత్త సవాళ్ళు తలెత్తాయి.
దురదృష్టవశాత్తూ, బ్లాక్ పాంథర్ పార్టీ ఒకవైపునుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. మరొకవైపునుంచి పాంథర్స్ ఒక విప్లవాత్మక సంస్థగా పని చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ప్రాధమికమైన పెద్ద పెద్ద తప్పులను వరసగా చేశారు. హింసాత్మక రాజ్య అణచివేత నేపథ్యంలో చాలా బహిరంగంగా పనిచేయడం, ప్రజల నేపథ్యాలను, వారి వ్యక్తిత్వాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా వారిని పార్టీ సభ్యులుగా అంగీకరించడం, ఎలాంటి సూత్రబద్ధతలేని రాజకీయ సంస్థలతో అవకాశవాద పొత్తులు ఏర్పరచుకోవడం, అప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయడం వంటి విషయాలు ఈ పొరపాట్లలో ఉన్నాయి. ఈ విధమైన పొరపాట్లు చేస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ పనిచేయడం వల్ల సెంట్రల్ కమిటీ సభ్యులకి పాంథర్స్ ను ఒక క్రమంలో వర్గీకరించి దఖలు చేయడానికి వీలు కాలేదు. స్థానిక నాయకుల నుండి వచ్చిన రిపోర్ట్ లకు గానీ, విమర్శలకు గానీ బ్లాక్ పాంథర్ పార్టీ సమర్ధవంతంగా స్పందించలేక పోయింది. ఈ తప్పులు ఇంకా ఇంకా చేస్తూ పోవడంతో, అవి పార్టీ నాయకత్వంలో లోతైన చీలికలకు దారితీశాయి. ప్రత్యేకించి, ఓక్లాండ్లోని హ్యూయ్ పి. న్యూటన్, ఇతర నాయకులకు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలతోనూ, అలాగే అల్జీరియాలో ప్రవాసంలో ఉన్న సమాచార మంత్రి ఎల్డ్రిడ్జ్ క్లీవర్తోనూ విభేదాలు పెరిగాయి. వారి కౌంటర్-ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎఫ్ బి ఐ ఈ చీలికలను విరివిగా ఉపయోగించుకొని పార్టీ నాయకత్వంలో శత్రుత్వాన్ని రెచ్చగొట్టింది, ఇది చివరికి చీలికకు దారితీసింది.
1969 నాటి ఎఫ్ బి ఐ మెమోలో పార్టీ రాసినట్లు కనిపించేలా అక్షరాలను ఎలా ఫోర్జరీ చేయాలో ఏజెంట్లకు సూచించింది. బ్లాక్ పాంథర్ పార్టీలో విభజనను సృష్టించడానికి ఈ మెమోలోని పద్ధతులను ప్రభుత్వవర్గాలు చాలా యుక్తిగా ఉపయోగించుకున్నాయి. సెంట్రల్ కమిటీలో, అలాగే కేంద్ర కమిటీ – స్థానిక నాయకత్వాల మధ్య గణనీయమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, విభజన జరగడం అనివార్యం కాదు. పార్టీ విషయాలను ఓర్పుతో, సంయమనంతో, భిన్నంగా నిర్వహించినట్లయితే, అపోహలను నివారించుకొని ముఖ్యమైన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఈ విధమైన చర్యలకు పూనుకోవడానికి బదులుగా పార్టీ రెండుగా చీలిపోయింది. హ్యూయ్ పి. న్యూటన్, బాబీ సీల్ నాయకత్వం వహించిన వర్గం విప్లవాన్ని విడిచిపెట్టి సంస్కరణవాద ఎన్నికల వ్యూహాన్ని అవలంబించింది, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ నాయకత్వంలో మరొక విభాగం, వదులుగా యాంత్రికంగా నిర్వహించబడుతూ, పట్టణ గెరిల్లా యుద్ధానికి సంబంధించిన సాహసోపేత సంఘటనల వ్యూహాలను పాటించింది. మొదటిది బ్లాక్ పాంథర్ పార్టీ అనే పేరుతోనే తన కార్యకలాపాలను కొనసాగించింది, రెండోది మాత్రం తనని తాను బ్లాక్ లిబరేషన్ ఆర్మీ అని పిల్చుకుంది. దీనికి అదనంగా, అనేక శాఖలు హ్యూయ్ పి. న్యూటన్, ఓక్లాండ్ నాయకత్వాలతో విభేదించాయి, కానీ అవి బ్లాక్ లిబరేషన్ ఆర్మీలో చేరలేదు.
అంతర్గత సమస్యలు – బాహ్య ఒత్తిళ్ళు కలిసి ఒక విడదీయలేని చిక్కుముడిగా సంక్లిష్టమైన కలయికగా ఏర్పడడం వల్ల అది విభజనకు దారితీసింది. న్యూయార్క్ పాంథర్ పార్టీ సభ్యులు 21 మందిని బహిష్కరించాలని హ్యూయ్ పి. న్యూటన్ తీసుకున్న నిర్ణయం ఈ చీలికకు ప్రధానమైన ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఈ శాఖ సభ్యులపై రాష్ట్రం నేరారోపణ చేసి వారిని ఇరికించడానికి ప్రయత్నించడం (ఎఫ్ బి ఐ మోసపూరితంగా రాసిన లేఖల ద్వారా) వల్ల వారు ఆ సమయంలో విచారణలో ఉన్నారు. ఎఫ్ బి ఐ పన్నిన కుటిల యత్నాలలో భాగంగా అతన్ని న్యూయార్క్ పాంథర్స్ హత్య చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు నకిలీ లేఖలను చూసిన తర్వాత హ్యూయ్ పి. న్యూటన్ ఆ విషయాన్ని గుడ్డిగా నమ్మి మనసులో గట్టిగా దృఢ పరుచుకుని వారిని బహిష్కరించాడు. ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ఈ బహిష్కరణకు ప్రతిస్పందించి, జాతీయ టెలివిజన్‌లో హ్యూయ్ పి. న్యూటన్ ని బహిరంగంగా విమర్శించాడు. అతనికి ఎఫ్ బి ఐ పంపిన లేఖలే గాక, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ విమర్శలు హ్యూయ్ పి. న్యూటన్ ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. ఆ విమర్శలలో “పాంథర్ గా పోజులిస్తూ, సెంట్రల్ కమిటీ సభ్యులకు తెలియకుండా వారి వెనక హ్యూయ్ పి. న్యూటన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని, బ్లాక్ పాంథర్ పార్టీకి మచ్చ తెస్తూ, భ్రష్ట పరుస్తున్నాడ” ని ఎల్డ్రిడ్జ్ క్లీవర్ పేర్కొన్నాడు.
అసలే గాఢమైన అపనమ్మకాలు, గందరగోళాలతో సతమతమవుతున్న బ్లాక్ పాంథర్ పార్టీ సభ్యులమీద కౌంటర్-ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లు అమలు పరచడం, ఎఫ్ బి ఐ కుట్రల లేఖలు వారికి మరింత మంటలను ఎగదోశాయి, కానీ ఇవన్నీ పార్టీ సభ్యులమధ్య పూడ్చలేని అంతరాలు, లోతైన సమస్యలు ఉన్నందువల్ల మాత్రమే ప్రత్యర్ధులకు చీలిక తేవడానికి సాధ్యమయ్యాయి. ఉదాహరణకు, హ్యూయ్ పి. న్యూటన్ లేదా ఎల్డ్రిడ్జ్ క్లీవర్ విభజనకి ముందు వారు అందుకున్న లేఖలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి వాటి గురించి చర్చించడం గానీ, ఆ లేఖల రచయితల సాధికారతను నిర్ధారించడం గానీ చేయలేదు. హ్యూ పి. న్యూటన్, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ల వ్యక్తిత్వాలలోని అహంకారాలను పరీక్షించడానికి ఎఫ్ బి ఐ రెచ్చగొట్టే లేఖలు రాసింది. అయితే వారు చదివిన అబద్ధాలను అంగీకరిస్తూ వారిద్దరూ చాలా త్వరగా ప్రతిస్పందించారు. అదేవిధంగా, వారి సెంట్రల్ కమిటీ సభ్యత్వం గురించి, నాయకుల గురించి బహిరంగంగా విమర్శించడంవల్ల ప్రభుత్వ వర్గాలకు తెలిసిపోయి ఆ నాయకుల మీద రాష్ట్ర-ప్రాయోజిత హింస పేరిట అణచివేతకు వారిని సులభంగా లక్ష్యం చేసుకున్నారు. ఇది అపోహాలు, అపనమ్మకాలు, స్థిరచిత్తాలు లేని మనస్తత్వాల వల్ల మాత్రమే సంభవించింది.
ఘోరమైన తప్పులు చీలికకు దారితీయడం వలన చివరికి పాంథర్స్ అతలాకుతలమైపోయి ఓటమి పాలయ్యారు. దురదృష్టవశాత్తూ విభజనలో ఇరుపక్షాలు తీవ్రమైన తప్పులు చేసి, వారి వారి ప్రత్యేకమైన దారుల్లో వెళ్ళిన తర్వాత ఈ సమస్యలను సరిదిద్దుకోలేకపోయారు. దానికి బదులుగా హ్యూయ్ నాయకత్వంలోని పాంథర్లు సంస్కరణవాదంతో ఎన్నికల రాజకీయాలవైపుకి తమ దృష్టి మళ్ళించారు, సెంట్రల్ కమిటీకి మరింత ప్రత్యక్ష నియంత్రణలో ఉంటారనే ఉద్దేశ్యంతో వారికి సంబంధించిన అన్ని శాఖలను ఓక్లాండ్కు తిరిగి పిలిపించారు, బాబీ సీల్‌ను ఓక్లాండ్ మేయర్‌గా ఎన్నుకోవడానికి ప్రచారం చేయాలని నల్లజాతి ప్రజలకు పిలుపిచ్చారు. బ్లాక్ లిబరేషన్ ఆర్మీ సభ్యులలో కొందరిని చంపేశారు, కొందరిని అరెస్టు చేశారు. మరికొందరు ప్రవాసంలోకి వెళ్ళారు. కొందరు విప్లవాత్మక రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. వదులుగా వ్యవస్థీకృతమైన నిర్మాణాలను విధ్వంసం చేశారు.
ఈ దేశంలో విప్లవాత్మక ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కాబట్టి, నేడు విప్లవకారులు ఈ తప్పుల నుండి గొప్ప గుణాపాఠాలు నేర్చుకోవాలి, రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా వివిధ నగరాలు, అనేక ప్రాంతాలలోని విప్లవ పార్టీల వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని సాధించే విధంగా బహిరంగ – భూగర్భ పనులను అనుసంధానించడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేసుకోవాలి.
విభజనకు దారి తీసిన కీలకమైన విషయాలు:
ప్రభుత్వ అణచివేత, ఎఫ్ బి ఐ, కౌంటర్- ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ల కుయుక్తులు విభజనలో భారీ పాత్ర పోషించినప్పటికీ, ప్రాథమికంగా పార్టీలో చీలికలకు దారితీసింది మాత్రం పాంథర్స్ లోని అంతర్గత సమస్యలే అని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎఫ్ బి ఐ ఈ సమస్యలను సద్వినియోగం చేసుకుని బ్లాక్ పాంథర్ పార్టీలోని నాయకుల మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచగలిగింది. అయితే పార్టీలో ప్రధానంగా నాయకుల మధ్య అంతర్గత విరోధ భావాల సమస్యలు లేకపోయినా – లేదా బ్లాక్ పాంథర్ పార్టీ నాయకులు ఈ సమస్యలను తమలో తామే చాకచక్యంగా నిర్వహించుకోగలిగినట్లయితే – ఎఫ్ బి ఐ కి వీరిలో చీలికలు తేగలిగే అవకాశముండేది కాదు.
పార్టీ వేగవంతమైన అభివృద్ధిని ఎలా నిర్వహించాలనేది పాంథర్స్ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో ఒకటి. 1968లో దేశంలోని వివిధ నగరాల్లో దాదాపు 800 మంది సభ్యుల దాకా ఉన్నారు. మే 1967లో కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్‌లో బ్లాక్ పాంథర్ పార్టీ నిరసన వ్యక్తం చేసినప్పుడున్న అనేక డజన్ల మంది సభ్యులతో పోలిస్తే ఇప్పటికి ఇది చాలా పెద్ద పెరుగుదల. ఈ పెరుగుదల పాంథర్స్ ను భారీ సంఖ్యలో అనేక పనులను చేపట్టడానికి ప్రోత్సహించింది. వారు వార్తా సేవలు, పోలీసులపై కమ్యూనిటీ నియంత్రణ కోసం ప్రయత్నించడం, నల్లజాతి విముక్తి పాఠశాలలు, పిల్లలకు ఉచిత అల్పాహార కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య వైద్య శాలలు, ఉచిత దుస్తుల పంపిణీ వ్యవస్థ లు, జైళ్లకు ఉచిత బస్సుల ఏర్పాట్లు, వయోవృద్ధుల కోసం రూపొందించిన కార్యక్రమాలు లాంటి మరికొన్ని కార్యక్రమాలతో సహా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లను నడిపారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తర్వాత మాత్రమే అవకాశాలు విపరీతంగా పెరిగాయి, 18 నెలల్లో బ్లాక్ పాంథర్ పార్టీ సభ్యత్వం 800 నుండి 4000 వరకూ అతివేగంగా పెరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యతో నల్లజాతీయులలో ఎక్కువమంది వ్యవస్థను లోపలనుండి మార్చడం అసాధ్యమని గ్రహించారు. దేశంలో అత్యుత్తమ వ్యవస్థీకృతమైన, అత్యంత ప్రధానమైన విప్లవాత్మక సంస్థ బ్లాక్ పాంథర్ పార్టీ అని గ్రహించారు, ఈ ఎరుకతో సహజంగానే చాలామంది బ్లాక్ పాంథర్ పార్టీకి గుంపులు గుంపులుగా తరలివచ్చారు. కొంతమంది ప్రజలు పార్టీలో చేరకపోయినా, వారు పాంథర్స్ వార్తాపత్రికను శ్రద్ధగా చదవడం ప్రారంభించారు, అందువల్ల వార్తాపత్రిక ప్రతివారం 200,000 లక్షల కాపీలవరకూ అమ్ముడు పోయేది!
బ్లాక్ పాంథర్ పార్టీ ఊహకందని విధంగా అభివృద్ధి చెందినప్పటికీ, కొన్ని కొత్త సమస్యలు కూడా తలెత్తాయి, చెప్పాలంటే కొంతవరకూ అవి పార్టీ అభివృద్ధి చెందిన కారణంగానే వచ్చిపడ్డాయని చెప్పవచ్చు. ఒక సంగతేమిటంటే, కొత్త సభ్యులు తండోపతండాలుగా వచ్చి చేరుతున్న సందర్భంలోనూ, కొత్త శాఖల్ని ఏర్పాటు చేయవలసిన సందర్భంలోనూ వాటిని నిర్వహించడానికి బ్లాక్ పాంథర్ పార్టీకి ఒక క్రమబద్ధమైన విధానమంటూ ఏదీ లేదు. బ్లాక్ పాంథర్ పార్టీలో పూర్తి సభ్యులు కావడానికి వారు “పాంథర్స్ 10 పాయింట్ ప్రోగ్రామ్”, మరి కొన్ని ఇతర పత్రాలను అధ్యయనం చేయడం అవసరం. ఎవరైనా అధికారికంగా పార్టీలో చేరడానికి ముందు సాధారణంగా కొన్ని వారాల రాజకీయ విద్యను కలిగి ఉండాలి.
అయితే, అమెరికా చాలా అణచివేత ధోరణులతోనూ, జాత్యహంకార ధోరణులతోనూ పరిపాలిస్తున్న పితృస్వామ్య దేశం కావడం వల్ల ఈ ఆలోచనలన్నీ- ప్రధానంగా పాలకవర్గం ద్వారా ప్రచారంలో ఉంటాయి గనుక – ప్రజలు అనేక విధాలుగా అంతర్గతీకరించబడి ఉంటారు. ఎవరైనా తమను తాము విప్లవకారులుగా చెప్పుకుని, బ్లాక్ పాంథర్ పార్టీ వంటి సంస్థలో చేరాలనుకున్నా, ఈ దేశాన్ని నడిపిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ అణచివేత భావజాలంలోని అనేక కోణాలను వారికి తెలియకుండానే వారు ఆ భావజాలంలో అప్పటికే మునిగిపోయి ఉండి ఉంటారు. అందువల్ల, నిబద్ధతతో, అంకితభావంతో కూడిన విప్లవకారుడిగా రూపాంతరం చెందడం అనేది చాలా దీర్ఘకాలికమైన ప్రక్రియ, కాబట్టి ఇది కేవలం కొన్ని వారాల రాజకీయ విద్య ద్వారా మాత్రమే సాధించడానికి వీలు కాదు.
బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో అధ్యాయం ఈ విషయంలో మాత్రం చాలా చక్కగా వ్యవహరించింది. ఈ శాఖలో మొదట్లో చాలా పెద్ద సంఖ్యలో సభ్యులు చేరారు. ఇందులోని ప్రతి ఒక సభ్యునికీ 10 పాయింట్ల ప్రోగ్రామ్ తెలుసు. రాజకీయ విద్య గురించిన పరిచయం కూడా పూర్తయింది. ఫ్రెడ్ హాంప్టన్, ఇతర స్థానిక నాయకులు, సభ్యులలో చాలామంది పూర్తిగా విప్లవానికి అంకితమయ్యే విప్లవకారులుగా మారకముందే వాళ్ళు వైదొలగి బయటికి వెళ్ళడానికి అవకాశాలున్నాయని గుర్తించారు. కాబట్టి, వారు కొంతకాలం వరకూ చికాగో శాఖకు కొత్త సభ్యులను చేర్చుకోవడం ఆపేశారు. దానికి బదులుగా బ్లాక్ పాంథర్ పార్టీలో ఇప్పటికే సభ్యులైన వారిని పార్టీలో ఏకీకృతం చేయడానికీ, వ్యక్తివాదం లాంటి ప్రతికూల ధోరణులకు వ్యతిరేకంగా పోరాడడం మీద తమ దృష్టిని కేంద్రీకరించారు.
అయితే ఈ ప్రయత్నాలు ఎక్కువగా చికాగో అధ్యాయానికి మాత్రమే పరిమితమయ్యాయి, ఇతర శాఖలు ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించలేదు. ఇది చాలామంది పార్టీలో చేరడానికి దారితీసింది గానీ తర్వాత సభ్యులకు పార్టీ ఆచరణలోని కష్టాల కారణంగా తప్పుకున్నారు. నిజంగా విప్లవం పట్ల అంకితభావంలేని వారు కూడా చాలా మంది ఈ సమయంలో పార్టీలో చేరారు. ఈ వ్యక్తులు విప్లవకారులుగా మారడానికి బ్లాక్ పాంథర్ పార్టీకి ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉండి ఉంటే నిజానికి ఇది చాలా మంచి విషయంగా పరిణామం చెంది ఉండేది. అయితే, ఇది సాధారణంగా జరగలేదు, కాబట్టి ఈ కొత్తగా రిక్రూట్ అయినవారిలో కొందరు స్థానిక అధ్యాయాలను సంస్కరణవాదం నుండి నమ్మదగని సమూహాలతో సూత్రప్రాయమైన పొత్తుల వరకు వివిధ ప్రతికూల దిశల్లోకి నెట్టారు. బహుశా ఇంకా అన్యాయమైన ప్రతికూలమైన సంగతేమిటంటే, పాంథర్స్ స్థానిక శాఖలలో కొత్త రిక్రూట్ల తొందరపాటు విధానాల వల్ల, ఎఫ్ బి ఐ మోసగాళ్ళను, రెచ్చగొట్టేవారిని పార్టీలో చొప్పించడానికి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగింది.
కొత్త స్థానిక బలంతో కొన్ని శక్తి గల శాఖలు పుట్టుకొచ్చినందువల్ల పాంథర్స్ పార్టీ జాతీయ సంస్థగా కూడా కొన్ని తప్పులు చేసింది. ఉదాహరణకు, 1969 వసంతకాలంలో ఫిలడెల్ఫియాలోని ఒక సమూహం బ్లాక్ పాంథర్ పార్టీకి సంబంధించిన శాఖగా తమను తాము ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. వారు జాతీయ కార్యాలయానికి ఫోన్ చేసి, అప్పటి – బ్లాక్ పాంథర్ పార్టీ స్టాఫ్ చీఫ్ డేవిడ్ హిల్లియర్డ్ తో మాట్లాడారు. అతను “మీరు విప్లవం చేయడానికి పాంథర్సే కానవసరం లేదు” అని వారికి చెప్పాడు. ఇక వారు ఆ ప్రయత్నాన్ని ఇక అంతటితో వదిలిపెట్టారు. బ్లాక్ పాంథర్ పార్టీ ఫిలడెల్ఫియా శాఖను బహిరంగంగా మైదానంలోకి తీసుకురావడానికి వారు ప్రయత్నించినందువల్ల వారితో కలిసి పనిచేయడానికి అతను ఎటువంటి సానుకూల చర్యలనైనా ప్రతిపాదించలేదు. బ్లాక్ పాంథర్ పార్టీ అధ్యాయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న సమూహంలోని సభ్యుడు ముమియా అబు-జమాల్, నేషనల్ ఆఫీస్ నుండి వచ్చిన ఈ ప్రతిస్పందన తనను, ఫిలడెల్ఫియాలోని ఇతరులను ఎలా గందరగోళానికి గురి చేసిందో వివరించాడు:
“హిల్లియార్డ్ ప్రకటన, నిజంగా నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ, మా కలలకు దగ్గరగా ఉన్న సంస్థలో చేరాలని నిశ్చయించుకున్న మా వాళ్ళను నిరుత్సాహపరచలేదు. [ఫిలడెల్ఫియాలో] సమావేశాలు కొనసాగాయి, మేము నేషనల్ ఉదాసీనత గురించి ఆలోచించాము. వారికి అన్ని వేళలా ఆ విధంగానే కాల్స్ వచ్చాయా? వారు తమకు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉన్నారా? పార్టీ విస్తరణను పరిమితం చేయడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? బ్రాంచ్‌ను తెరవడం గురించి మేము తీవ్రంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్షా? ఈ ప్రశ్నలకు ఎప్పుడూ మాకు తగినంత సమాధానాలు రాలేదు.”
ముమియాతో పాటు ఇతరుల దృఢమైన నిశ్చయాత్మక ప్రయత్నాల తర్వాత, నేషనల్ ఆఫీస్ చివరికి ఫిలడెల్ఫియా అధ్యాయాన్ని గుర్తించింది. అయితే, కొత్త అధ్యాయాల స్థాపనలో పార్టీ వ్యవహరించిన క్రమరహిత విధానం చాలా సమస్యలకు దారితీసింది. కొన్ని సమయాల్లో పాంథర్లు పార్టీ రాజకీయాలను, కార్యక్రమాలను అర్థం చేసుకున్నారనీ ఏకీభవిస్తున్నారనీ నిర్ధారించుకోకుండానే పార్టీలోకి కొత్త సభ్యులను స్వాగతించడానికి చాలా తొందరపడ్డారు. ఇతర సమయాల్లో, వారు ప్రతిభావంతంగా పని చేయగలిగిన అధ్యాయాలను పరిశోధించడంలో కూడా విఫలమయ్యారు. ఫలితంగా కొన్నిటిని తిరస్కరించారు. ఇది నల్లజాతి విముక్తి కోసం బ్లాక్ పాంథర్ పార్టీలో చేరి విప్లవం పోరాటంలో సమరశీలంగా పాల్గొనాలని ఎదురు చూస్తున్న చాలా మంది వ్యక్తులను నిరుత్సాహపరిచింది.
మిక్కిలి వేగవంతమైన, అస్తవ్యస్తమైన పార్టీ ఎదుగుదల వల్ల వివిధ నగరాల్లో కొత్తగా శాఖలు ప్రారంభమై, అవి అంకిత భావంతో నిజాయితీగా పని చేసే విప్లవకారులతో నిండినప్పటికీ కూడా, ఆ శాఖలకూ – పార్టీ నాయకత్వానికీ మధ్య సమాచార వినిమయాల మధ్య చాలా లోపాలు ఏర్పడి అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇది జాతీయ – స్థానిక నాయకుల మధ్య ఎన్నో అపార్ధాలకు దారితీసింది, హ్యూయ్ పి. న్యూటన్ తో పాటు సెంట్రల్ కమిటీ కూడా ఎక్కువగా ఆధిపత్య విధానాలను అవలంబించారు.
స్థానిక నాయకుల గోడు వినడం, వారి అభిప్రాయాలను గౌరవించడం, స్థానిక పరిస్థితుల గురించి వారి జ్ఞానాన్ని అంచనా వేసి సంస్థను తగిన సలహాలతో నడపడానికి మార్గదర్శకత్వం వహించడానికి బదులుగా, హ్యూయ్, ఇతర సెంట్రల్ కమిటీ నాయకులు వారి సమస్యలను తేలిగ్గా కొట్టిపారేశారు. ఒక విప్లవాత్మక సంస్థలో ప్రజాస్వామ్యపు సాధారణ పనితీరులో భాగంగా కాకుండా, అసమ్మతిని సమస్యగా చూడటం ప్రారంభించి, అన్నిటిని ఒకే గాటన కట్టి ఎక్కువగా తిరస్కరించారు.
జాతీయ స్థాయిలో సమర్థవంతమైన విప్లవాత్మక సంస్థగా పనిచేయడానికి జాతీయ – స్థానిక నాయకుల మధ్య మంచి సమన్వయం ఉండటం, ప్రజాస్వామ్య బద్ధమైన తర్క వితర్కాలు, చర్చలను ప్రోత్సహించడం, సెంట్రల్ కమిటీ – వివిధ శాఖల మధ్య సహృదయ మద్దతు, విశ్వాసాల సంస్కృతిని పెంపొందించడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ పాంథర్స్ ఈ అత్యంత ప్రధానమైన విషయాల్లో చేస్తున్న వరుస పొరపాట్ల గురించి వారు సరిగ్గా అంచనా వేయలేదు, అర్థం చేసుకోలేదు, పరిష్కరించడానికి ప్రయత్నించలేదు.
హ్యూయ్ పి. న్యూటన్ నాయకత్వంతో విభేదాలు పెరగడంతో, సెంట్రల్ కమిటీ స్పందించి, స్థానిక నాయకుల స్థానంలో, వారి పనులను నిర్వహించడానికి ఓక్లాండ్ పాంథర్లను ఇతర శాఖలకు పంపింది. ఇది చాలా శత్రుత్వానికి దారితీసిందని వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు, 1970లో బ్రాంక్స్ లోని న్యూయార్క్ బ్రాంచ్‌కు తన రాయబారిగా ఉండేందుకు హ్యూయ్ తన వ్యక్తిగత బాడీ గార్డ్ రాబర్ట్ “బిగ్ బాబ్” బే ను పంపాడు. ఈ రాబర్ట్ “బిగ్ బాబ్” బే హ్యూయ్ పి. న్యూటన్ పాత స్నేహితుల్లో ఒకడు, పోలీసు అణచివేతను దీటుగా ఎదుర్కొంటూ అప్పటికే చాలా సమర్ధవంతమైన వ్యవస్థీకృతశక్తిగా ఉన్న న్యూయార్క్ పాంథర్స్ కు ఈ రాబర్ట్ “బిగ్ బాబ్” బే నాయకత్వం వహించలేకపోయాడు. అస్సాటా షకుర్ (Assata Shakur) ఆమె ఆత్మకథ, “అస్సాటా” (Assata) లో, ఈ సమస్యలను ఇలా వివరిస్తుంది: “వెస్ట్ కోస్ట్ కు చెందిన రాబర్ట్ బే, జాలీ (Jolly) తో మాకు నాయకత్వ సమస్య ఏర్పడింది. బే సమస్య ఏమిటంటే, అతనంత తెలివైనవాడు కాదు, సక్రమంగా సమస్యలను పరిష్కరించగలిగిన జ్ఞానం లేదు. అతను వ్యక్తులతో మాట్లాడే విధానం చాలా దూకుడుగా, మొరటుగా ఉండేది. సభ్యులతో వ్యవహరించే విధానం దాదాపు యుద్ధం చేస్తున్నట్లే ఉండేది. జాలీ సమస్య ఏమిటంటే అతనికి బొత్తిగా వ్యక్తిత్వం లేదు. అతను కేవలం రాబర్ట్ “బిగ్ బాబ్” బే నీడలా మసలుకునేవాడు”.
హార్లెమ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె మొదటి రోజున, రాబర్ట్ “బిగ్ బాబ్” బే పాంథర్ వార్తాపత్రికలను సరైన స్థలంలో ర్యాక్‌పై ఉంచకుండా డెస్క్ పై ఉంచినందుకు అస్సాటాను తిట్టాడు. ఈ విధానాన్ని ఆమెకు ఎవరూ అంతకుముందు వివరించలేదు. అస్సాటా ప్రతిస్పందిస్తూ అతని బ్యూరోక్రాటిక్ పోకడలు, ఒత్తిడి కలిగించే ప్రవర్తనా తీరుని తీరును విమర్శించింది. ఆమె కార్యాలయం నుంచి వెళ్లిన తర్వాత అతను ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాడు. మరుసటి రోజు, అతను క్షమాపణలు చెప్పి, ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకున్నాడు.
ఈ సంఘటన సాపేక్షంగా చిన్నదిగా అనిపించినప్పటికీ, ఇది వాస్తవానికి ఆ సమయంలో పార్టీలో చాలా లోతైన సమస్యలను వెల్లడించింది. అస్సాటా తన పునరుద్ధరణలో విజయం సాధించగలిగింది గానీ బే నాయకత్వం గురించి ఆమెకు ఆందోళనలు ఉన్నప్పటికీ, పాంథర్స్ పనిలో పాలుపంచుకోవడం కొనసాగించింది; అయినప్పటికీ, ఇతర పార్టీ శాఖలను నడపడానికి హ్యూయ్ పి. న్యూటన్ పంపిన రాబర్ట్ “బిగ్ బాబ్” బే తో పాటు ఉన్న ఇతర నాయకుల దుర్మార్గపు, అధికార వైఖరితో చాలామంది బహిష్కరించబడ్డారు అనే కంటే దాదాపు తరిమివేయబడ్డారు.
హ్యూయ్ పి. న్యూటన్ పట్ల రాబర్ట్ “బిగ్ బాబ్” బే కు చాలా వ్యక్తిగత విధేయత ఉంది. అతని రాజకీయ స్పష్టత, నాయకత్వ సామర్థ్యాలు, పార్టీ పనుల్ని నిర్వహించగల నైపుణ్యాల వల్ల గాక అతని వినయ విధేయతల వల్ల – న్యూయార్క్ బ్రాంచ్ నాయకత్వానికి హ్యూయ్ పి. న్యూటన్, రాబర్ట్ “బిగ్ బాబ్” బే ను నియమించాడని ముమియా అబు-జమాల్ నొక్కిచెప్పారు:
“హ్యూయ్ పి. న్యూటన్ వ్యక్తిగత అంగరక్షకులలో బిగ్ బాబ్ బే ఒకడు. అతను వెస్ట్ ఓక్లాండ్ లో మాజీ కెప్టెన్. న్యూటన్ నుండి బ్రాంక్స్ లోని న్యూయార్క్ బ్రాంచ్‌కి వ్యక్తిగత దూతగా బిగ్ బాబ్ బే శివ 012 వచ్చినప్పుడు ‘హ్యూయ్’ స్ పార్టీ’ అనే పదం ఉద్భవించింది. హ్యూయ్ పి. న్యూటన్ పాత స్నేహితుడిగా, అతని రాయబారిగా, ఊలుకి రంగులద్దిన పాంథర్ గా, బిగ్ బాబ్ పార్టీ సరైన భావజాలం నుండి ఏదైనా ఉల్లంఘన జరిగితే దాన్ని రాజకీయ అవమానంగా గాకుండా వ్యక్తిగతంగా అమర్యాదగా భావించేవాడు.
“అతను న్యూయార్క్ పాంథర్స్ లో బిగ్ బాబ్ బే బాగా పేరు పొందాడు, అతని భీతి గొలిపే కోపానికి అందరూ వణికిపోయేవారు. అతను రక్షణ మంత్రిపట్ల ఎనలేని విధేయతను ప్రదర్శించేవాడు. అతని కోపం కాలిఫోర్నీయా లోని ఐదు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలలో మోగిపోయేది: ‘నిగ్గా, నేను నిన్ను ఏమి చేయనివ్వను’ అది ఈ పార్టీని నాశనం చేస్తుంది! ఉహ్-ఉహ్! ఈ పార్టీ కాదు, ఇది హుయ్ పి. న్యూటన్ పార్టీ కాదు!’
“బిగ్ బాబ్ సూచన అతని వాక్చాతుర్యాన్ని మించిపోయింది, ఎందుకంటే, వాస్తవానికి, సారాంశంలో, ప్రజల మనసుల లో, ఇది హ్యూయ్ పి. న్యూటన్ పార్టీ. అతను తన సహచరుల హృదయాలలో మొదటి పాంథర్.”
ముమియా విశ్లేషణ ముఖ్యమైనది ఎందుకంటే ఇది నాయకుడిగా బే పరిమితులను చూపుతుంది, కానీ అతనికి స్పష్టమైన లోపాలు ఉన్నప్పటికీ బిగ్ బాబ్ బే ఎందుకు నాయకుడిగా అంగీకరించబడుతున్నాడో వివరించడానికి ఇది సహాయపడుతుంది. హ్యూయ్, సెంట్రల్ కమిటీ నాయకులు ఇతర శాఖలపై తమ ఇష్టాన్ని విధించడం మాత్రమే కాదు. చాలా మంది పాంథర్ల మనస్సులో హ్యూయ్ పి. న్యూటన్ మాత్రమే నాయకుడు, బ్లాక్ పాంథర్ పార్టీ అంటే హ్యూయే. ఇది పాంథర్స్ లోని వ్యక్తిగత నాయకత్వపు లోతైన సమస్యలను ప్రతిబింబిస్తుంది, అంతేగాక ఈ సమస్యలు అమెరికన్ సమాజంలోని విస్తృత వ్యక్తిత్వానికి ఉన్న ఒక లక్షణాన్ని సూచిస్తుంది. ఇది గమనించి, గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాంథర్స్, ఒక బలమైన విప్లవాత్మక సంస్థ అయినప్పటికీ, వారు ఉనికిలో ఉన్న ఒక విలక్షణమైన సమాజపు ఉత్పత్తి కూడా. వారు అమెరికాలో వారి సంస్థలో అణచివేత వైఖరికి వ్యతిరేకంగా పోరాడటానికి అద్భుతమైన పని చేశారు, కానీ వారు వారి సంస్థలోనే విప్లవ సంస్థ వ్యతిరేక వైఖరులు కలిగిన కొంతమందికి అంధులుగా ఉన్నారు, పాంథర్స్ వారిని పూర్తిగా అధిగమించలేకపోయారు.
ఈస్ట్ – వెస్ట్ కోస్ట్ పాంథర్స్ మధ్య ఉద్రిక్తతలు ఉధృతంగా ఉన్న సమయంలో పాంథర్స్ న్యూయార్క్ శాఖను నిర్వహించడానికి ఈ బిగ్ బాబ్ బే నియామకం జరిగింది. హ్యూయ్ పి. న్యూటన్ అప్పుడే జైలు నుండి విడుదలయ్యాడు, అతను జైల్లో ఉన్న సమయంలోనే న్యూయార్క్ పాంథర్స్ పార్టీ జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎఫ్ బి ఐ, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ న్యూయార్క్ లోని “పాంథర్ 21” ని హాస్యాస్పదమైన బూటకపు ఆరోపణలను రూపొందించడానికి ప్రయత్నించాయి, ఈ రాజకీయ అణిచివేత దారుణమైన ప్రచారం న్యూయార్క్ పాంథర్స్ ను జాతీయ దృష్టికి తెచ్చింది. అఫెని షకుర్ (Afeni Shakur), ధోరుబా బిన్ వహాద్ (Dhoruba bin Wahad), లుముంబా షకుర్(Lumumba Shakur), మైఖేల్ “సెటవాయో” టాబోర్ (Michael “Cetawayo” Tabor), బెత్ మిచెల్ (Beth Mitchell), జైద్ మాలిక్ షకుర్ (Zayd Malik Shakur) – మొదలైన వీరందరూ మంచి మాట్లాడేవారే గాక మరీ ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునే గొప్ప నిర్వాహకులు. ‘పాంథర్ 21’ విచారణను రూపొందించబడటానికి ముందు వారందరూ న్యూయార్క్ లో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడంలో, అక్కడ పార్టీ అధ్యాయాన్ని పెంచడంలో అద్భుతమైన విజయాన్ని సాధించారు. బెయిల్‌ను ఒక్కొక్కటి $100,000 (నేటి డబ్బులో సుమారు $670,000) గా నిర్ణయించిన తర్వాత, వారిని విడిపించడానికి జాతీయ ప్రయత్నం ప్రారంభమైంది. దేశం నలుమూలల నుండి ప్రజలు వారికి మద్దతుగా ర్యాలీ చేశారు.
న్యూయార్క్ లో విజయాలు, పాంథర్ 21 జాతీయ స్థాయికి ఎదగడం – అలాగే చికాగోలో ఫ్రెడ్ హాంప్టన్ (Fred Hampton), బాబీ రష్ (Bobby Rush), న్యూ హెవెన్ లోని ఎరికా హగ్గిన్స్ (Ericka Huggins), లాస్ ఏంజిల్స్ లోని ఎల్మెర్ “జెరోనిమో జి-జగా” ప్రాట్ (Elmer “Geronimo Ji- Jaga” Pratt) వంటి ఇతర నాయకులు బ్లాక్ పాంథర్ పార్టీని నిబద్ధతగా నడిపిన నాయకులు. దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకులు వస్తున్నారు, వారికి మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తున్నారు. ఇది చాలా ప్రధానమైనది ఎందుకంటే పార్టీ వేగవంతమైన అభివృద్ధితోపాటు బహుళ స్థాయిలలో సాధించవలసిన లక్ష్యాల కోసం కొత్త నాయకత్వాలు అవసరమవుతాయి. పార్టీలో నిబద్ధత కలిగిన విప్లవకారుల సమూహం అభివృద్ధి చెందడంతో, వారు ఎదుర్కొన్న వివిధ అంతర్గత సమస్యలను అధిగమిస్తూ పని చేయడం పాంథర్లకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వారు జాతీయ స్థాయిలో వివరాలను సమన్వయం జేసి, అనేక మంది స్థానిక నాయకులను కేంద్ర కమిటీ జాతీయ స్థాయి నాయకత్వంలో చేర్చుకోవచ్చు.
ఫ్రెడ్ హాంప్టన్ ని సెంట్రల్ కమిటీలోకి చేర్చుకున్న వెంటనే కొన్ని రోజులకే హత్యకు గురయ్యాడు. దానికి కొంతకాలం ముందే పాంథర్స్ ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా జరిగింది. స్థానిక నాయకులను సెంట్రల్ కమిటీకి ప్రమోట్ చేయడంలో బ్లాక్ పాంథర్ పార్టీ జాతీయ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడంలో పాంథర్స్ ఒక క్రమపద్ధతిని పాటించలేదు. వారి ప్రయత్నాలు పదేపదే కుదించబడుతూ చివరికి పూర్తిగా వదిలివేశారు. 1970లో హ్యూయ్ జైలు నుండి విడుదలైన వెంటనే అలాంటి ప్రయత్నం ఒకటి చివరిసారిగా జరిగింది. అతను దేశవ్యాప్తంగా పర్యటించి, బ్లాక్ పాంథర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్ నగరానికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు.
అయితే, ఈ ప్రయత్నం కూడా పార్టీలో పెరుగుతున్న తూర్పు- పశ్చిమ విభజనలతో గుర్తించబడింది. న్యూయార్క్ లోని హార్లెమ్ 127వ వీధిలో ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సిద్ధం చేయడానికి సెంట్రల్ కమిటీ మెల్విన్ “కాటన్” స్మిత్ ని పంపించింది. అతను ఆయుధాలు, వాటి భద్రతల గురించి మిక్కిలి అపారమైన జ్ఞాన, నైపుణ్యాలు కలిగి ఉన్నానని తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటాడు గానీ, నిజానికి అతను ఎఫ్ బి ఐ పేరోల్‌లో ఇన్ఫార్మర్గా ఉన్నాడు. అతను అంతకుముందు లాస్ ఏంజిలస్ లో పనిచేసినప్పుడు, అతను పోలీసు దాడికి ముందు పాంథర్స్ కార్యాలయంలో అక్రమ ఆయుధాలను ఉంచాడు, ఇది పోలీసులకు మోసపూరిత ఆరోపణలను పాంథర్లపై మోపడానికి సహాయపడింది. మెల్విన్ “కాటన్” స్మిత్ పచ్చి తాగుబోతు, ఆశ్చర్యకరంగా, అతను కొత్త ప్రధాన కార్యాలయాన్ని సిద్ధం చేయడానికి అవసరమైన ప్రాథమిక పనులను ప్రారంభించడంలో కూడా విఫలమయ్యాడు. అస్సాటా, మెల్విన్ “కాటన్” స్మిత్ ఎలా పనిచేస్తాడో వివరించిందిలా:
“కొన్ని నెలల్లో 127వ వీధిలోని ఇంటిని నేను చాలాసార్లు సందర్శించాను. నేను ఎంత ప్రయత్నించినా, ఒక్క అంగుళం కూడా పురోగతి చూడలేకపోయాను. చివరికి నేను మెల్విన్ “కాటన్” స్మిత్ కి గొప్పలు పోవడానికి, తాగడానికి, నోరు చాలా పెద్దది గానీ పని చేయడానికి కాదనే నిర్ధారణకు వచ్చాను. కానీ అతను ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరూ నాకు చెబుతూనే ఉన్నారు, కాబట్టి అతను ఏదో నిగూఢంగా, రహస్యంగా పని చేస్తున్నాడని నేను గ్రహించాను. వారు నాకు అది చెప్పకూడదని స్పష్టంగా నిర్ణయించుకున్నారని కూడా నాకు తెలిసింది.”
వాస్తవం ఏమిటంటే, మెల్విన్ “కాటన్” స్మిత్ బ్లాక్ పాంథర్ పార్టీ కోసం ఎటువంటి రహస్య పని చేయడం లేదు. అతను కేవలం మద్యపానం చేస్తూ, పోలీసులతో కక్కుర్తి పడి కుమ్మక్కయ్యాడు. సెంట్రల్ కమిటీ – న్యూయార్క్ పాంథర్స్ మధ్య అపనమ్మకాలు కలిగించడానికి రకరకాల పుకార్లు వ్యాప్తి చేశాడు.
అయినప్పటికీ, అతను న్యూయార్క్ లో తన పనిపై ఎటువంటి విమర్శలనైనా తిప్పికొట్టడానికి హ్యూయ్‌తో తన సంబంధాన్ని ఉపయోగించుకున్నాడు. ఇది పెద్ద ఎదురుదెబ్బలకు దారితీసింది. అందులో ఒకటి, న్యూయార్క్ లో కొత్త ప్రధాన కార్యాలయం ఎప్పుటికీ పూర్తి కాలేదు, కాబట్టి హ్యూయ్, మిగిలిన సెంట్రల్ కమిటీ ప్రధానంగా ఓక్లాండ్లో ఉన్న సభ్యులు న్యూయార్క్ కు వెళ్లనే లేదు. ఈ న్యూయార్క్ కు వెళ్లడమనే చర్య పార్టీలోని అన్ని సమస్యలను పరిష్కరించదు, కానీ తూర్పు – పశ్చిమ తీర పాంథర్లు ఒకరినొకరు అనుమానంతో చూసుకోవడం ప్రారంభించారు. దాన్ని అధిగమించడానికి అది చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది.
మెల్విన్ “కాటన్” స్మిత్ పుట్టించిన పుకార్లు కూడా పార్టీ సభ్యులలో పెరుగుతున్న గందరగోళం, మానసిక చాంచల్యానికి అవిశ్వాసానికి దోహదపడ్డాయి. ఆ సమయంలో ఎఫ్ బి ఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ విస్తృతంగా పనిచేస్తూ గాలిలో రేపుతున్న పుకార్లు చుట్టుముట్టాయి. అందులో పాంథర్లను ఇతర పాంథర్లు రహస్యంగా చంపేస్తున్నారని ఎఫ్ బి ఐ వారి మోసగాళ్ళ ద్వారా వ్యాపింపజేసిన కథనాలు అత్యంత వినాశనకరమైనవి. ఇది సభ్యులలో ఒకరిపట్ల ఇంకొకరికి తీవ్ర అపనమ్మకానికి దారితీసింది. చాలా మంది సభ్యులు వారి సహచరులను ఒకరినొకరు అనుమానించుకునేలా చేసింది. ఈ అపనమ్మకం ఉన్నప్పటికీ, కాటన్ తన అనుమానాస్పద తాగుబోతు ప్రవర్తనపై రాగల అన్ని విమర్శలను తిప్పికొట్టడానికి హ్యూయ్‌తో తన వ్యక్తిగత స్నేహ సంబంధాన్ని వినియోగించగలిగాడు. విమర్శల నుండి తనను తాను రక్షించుకునే కాటన్ సామర్థ్యం పార్టీలో మరింత లోతైన సమస్యను సూచిస్తుంది, అది కేవలం మోసగాళ్ళకు మాత్రమే మాత్రమే సంబంధించినది కాదు. అంతకంటే మించిన ఏమాత్రం సహించకూడని సమస్య. హ్యూయ్ పి. న్యూటన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధం వల్ల పార్టీలో పదవులు పొందిన వారు కేవలం స్థానిక నాయకులు, అతని రాయబారులు మాత్రమే కాదు. అతనితో వ్యక్తిగత స్నేహ సంబంధాల కారణంగా బ్లాక్ పాంథర్ పార్టీలో ఉన్నత స్థానాల్లో చాలా వరకు కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.
ఉదాహరణకు డేవిడ్ హిల్లియార్డ్, హ్యూయ్ పి. న్యూటన్ చిన్ననాటి స్నేహితులు. అతను పాంథర్స్ చీఫ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. హ్యూయ్ పి. న్యూటన్ బాల్య స్నేహితుల్లో ఒకరు పార్టీలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉండటం సమస్య కానే కాదు. అయినప్పటికీ, హిల్లియార్డ్ నిజానికి చాలా అసమర్థుడు, అతను పాంథర్స్ గురించిన అత్యంత ప్రాథమికమైన అంశాలను కూడా అర్థం చేసుకోలేదు. హిల్లియార్డ్ ఆత్మకథ, “దిస్ సైడ్ ఆఫ్ గ్లోరీ” (This side of Glory) లో, అతను ఒక రాత్రి, పాంథర్స్ ఎదుర్కొంటున్న కొన్ని ఎదురుదెబ్బలతో విసుగు చెంది, విపరీతంగా తాగి, తన ఇంటి నుండి బయటకు వెళ్లి, ప్రయాణిస్తున్న పోలీసు కారుని “పాట్ షాట్” చేశాడు. అంటే తాగిన మత్తులో ఆత్మరక్షణకు అవకాశం లేకుండా యాదృచ్ఛికంగా పోలీసు కారుకే గురిపెట్టి పేల్చేశాడు. అతను ఈ చర్యను “పిచ్చి” అని పిల్చాడు. ముమియా, హిల్లియార్డ్ తాగుబోతు చర్యల ప్రాముఖ్యతను పెద్దగా వివరించాడు:
“డేవిడ్ హిల్లియార్డ్ ఈ ప్రవర్తన బహుశా తాగుబోతు చర్యలను ప్రతిబింబిస్తుంది, అందువల్ల ఆరోపణలను కొంతవరకు తగ్గించవచ్చు, కానీ ఇది దేశంలోని అతిపెద్ద నల్లజాతి విప్లవ సంస్థ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగల అతని సామర్థ్యం గురించి న్యాయబద్ధమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. హిల్లియార్డ్ కి అతిగా తాగడమనే బలహీనత, ఆ సమయంలో అతనేం చేస్తున్నాననే దానిపై అతనికే స్పృహ ఉండదని ఇది సూచిస్తుంది. కొంతకాలం తర్వాత, హిల్లియార్డ్ కు, బాబీ సీల్ విప్లవాత్మక ప్రక్రియకు మూలాధారమైన భావనను అతనికి వివరించాడు. బాహ్య ఉద్దీపనలకు భావోద్వేగపరమైన తక్షణ ప్రతిస్పందన కాదని చెప్పాడు. డేవిడ్ హిల్లియార్డ్ అలాంటి ఆలోచనలను వినడం ఇదే మొదటిసారి అన్నట్లుగా విన్నాడు. స్పష్టంగా, ఆ సమయంలో, హిల్లియార్డ్, హ్యూయ్ పి. న్యూటన్ పట్ల నమ్మకాన్ని, అతని ప్రేమను కలిగి ఉండవచ్చు. కానీ అతను తమ ప్రజలకు స్వేచ్ఛను తీసుకురావడానికి పోరాడాలని కోరుకునే ఉద్వేగభరితంగా ఉన్న నల్లజాతీయులతో కూడిన యువకుల సమూహానికి అవసరమైన నిర్వాహకశక్తి, వ్యక్తిగత నైపుణ్యాలను హిల్లియార్డ్ కలిగి ఉన్నాడా అనేది సందేహాస్పదమే! డేవిడ్ ఏదో ఒకవిధంగా మూర్ఖుడని గానీ లేదా బ్లాక్ పాంథర్ పార్టీలో పని చేయడానికి అవసరమైన పాఠాలు నేర్చుకోలేదని దాని అర్థం కాదు. అసలు దాని అర్థం ఏమిటంటే హిల్లియార్డ్ ఉద్యోగానికి అవసరమైనది హ్యూయ్ పి. న్యూటన్ పట్ల అతని లోతైన, వ్యక్తిగత విధేయత, అవి హ్యూయ్ ప్రయోజనాలకు ఉపయోగపడేవి మాత్రమే. అవి అభివృద్ధి చెందుతున్న, శీఘ్రంగా మారుతున్న నల్లజాతి విప్లవాత్మక రాజకీయ పార్టీ ప్రయోజనాలకు నిస్సందేహంగా ఉపయోగపడవు ”
హిల్లియార్డ్, అతని లోపాలు, పరిమితులు ఉన్నప్పటికీ, మోసగాడు గానీ రెచ్చగొట్టేవాడు గానీ కాదు. అయితే, అతను ఖచ్చితంగా సమర్థుడైన నాయకుడు మాత్రం కాదు. హ్యూయ్ పట్ల అతని విధేయత అతని ప్రధానమైన అర్హత, కానీ పార్టీకి ఇది తీవ్రమైన సమస్యే. మెల్విన్ “కాటన్” స్మిత్ వంటి వ్యక్తుల విషయంలో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది, వారు తమ చర్యలపై విమర్శలను తప్పించుకోవడానికి హ్యూయ్‌కి తమ విధేయతను చాటుకున్నారు. “కాటన్” స్మిత్, అతని వంటి ఇతరులు తమ నిబద్ధత, నిజాయితీల గురించి ఆత్మ విమర్శ చేసుకుని ఉన్నా, తీవ్రమైన విమర్శలకు లోబడి తమని తాము సరిదిద్దుకుని ఉండి ఉంటే, వారు కనీసం కొత్త సంస్థాగత ప్రధాన కార్యాలయాన్ని సిద్ధం చేయడం వంటి ముఖ్యమైన రాజకీయ పనుల పట్ల శ్రద్ధ వహించడం లేదని స్పష్టమయ్యేది. ఈ విధమైన విమర్శలు వారి అంతర్లీన నిజాయితీని, చివరికి వారు పార్టీ పనుల పట్ల మోసపూరితంగా ఉన్నారనే వాస్తవం కూడా బహిర్గతం అయి ఉండేది.
మెల్విన్ “కాటన్” స్మిత్, బిగ్ బాబ్ బే , డేవిడ్ హిల్లియార్డ్ వంటి వ్యక్తులతో ఈ సమస్యలు వారి వ్యక్తిగత విషయాలకు మాత్రమే పరిమితం గాకుండా అంతకు మించి ఉన్నాయని చూడటం ముఖ్యం. అవి మొత్తం బ్లాక్ పాంథర్ పార్టీలో లోతైన సమస్యలు తెచ్చిపెట్టాయని వెల్లడి చేసే లక్షణాలు. ఇంకా ఏమిటంటే, స్థానిక శాఖలను “చూడడానికి” మెల్విన్ “కాటన్” స్మిత్, బిగ్ బాబ్ బే వంటి వ్యక్తులను పంపాలని హ్యూయ్ పి. న్యూటన్ తీసుకున్న నిర్ణయాలవల్ల వాళ్ళు తరచుగా ఎఫ్ బి ఐ నుండి తప్పుడు సమాచారంతో సభ్యులను రెచ్చగొట్టేవారు. ఈ నకిలీ లేఖలు తరచుగా బ్లాక్ పాంథర్ పార్టీ శాఖల సభ్యుల నుండి వచ్చాయని, స్థానిక నాయకత్వం నుండి హ్యూయ్ పి. న్యూటన్ ను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సభ్యులు పార్టీ శ్రేణులనుండి తప్పుకుంటున్నారని, మాదకద్రవ్యాలు ఉపయోగిస్తు న్నారని మొదలైన అనేక విషయాల గురించి అబద్ధాలను ప్రచారం చేశాయి. స్థానిక నాయకులను గనక సెంట్రల్ కమిటీకి ప్రమోట్ చేసి ఉంటే, సెంట్రల్ కమిటీ గురించి ఎఫ్ బి ఐ వ్యాప్తి చేస్తున్న విషపూరితమైన అబద్ధాలు ఏమంత ప్రభావవంతంగా ఉండేవి కావు, ఎందుకంటే జాతీయ నాయకత్వానికి స్థానిక పరిస్థితులపై, స్థానిక నాయకులు వివరించగలిగేవారు, ఆ విధంగా మంచి అవగాహన ఉండి ఉండేది.
స్థానిక శాఖలకి – జాతీయ నాయకత్వానికి మధ్య ప్రజాస్వామ్యాన్ని పెంచవలసిన విస్తృతమైన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ, హ్యూయ్ పి. న్యూటనే నిస్సందేహంగా తమ నాయకుడని పాంథర్స్ లో విస్తృతమైన అవగాహన ఉంది, దీనిని బిగ్ బాబ్ బే , డేవిడ్ హిల్లియార్డ్ వంటి వ్యక్తులు బలపరిచారు. పాంథర్స్ పార్టీని స్థాపించడంలో, వారి భావజాలం గురించిన ప్రాథమికమైన అంశాలను అభివృద్ధి చేయడంలో హ్యూయ్ పి. న్యూటన్ నిజంగా గొప్ప కృషితో చాలా సానుకూల పాత్ర పోషించాడు. అయితే, కొందరు ఇతరుల లాగే, అతనికి కూడా కొన్ని బాలహీనతలున్నాయి. కొన్ని విషయాలలో అతను జైలులో గడిపిన తర్వాత మరింత దిగజారాడు, అక్కడ అతను ఒంటరి నిర్బంధాన్ని, ఎన్నో రకాల హింసలకు బలయ్యాడు.
జైలు జీవితం హ్యూయ్ పి. న్యూటన్ ను ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయమే! అతను బయటకు వచ్చినప్పుడు మతిస్థిమితం లేకుండా ఉండడం మాత్రమే కాదు, అంతకుముందు అతనికి తెలిసిన వ్యక్తులతో సహజమైన పద్ధతిలో మాట్లాడడానికి కూడా చాలా తన్నుకులాడాడు. సాధారణమైన జైలులో ఉండటం, ముఖ్యంగా మితిమీరిన హింసల బారిన పడడం నిజంగా మనుషుల్ని గందరగోళాలకు గురి చేస్తుంది. కొందరు వ్యక్తులు చిత్రహింసలకు గురైన తర్వాత కూడా జైలు నుండి బయటకు వచ్చి, విప్లవాత్మకమైన ఆర్గనైజేషన్ లోకి తిరిగి రావచ్చు, కానీ సాధారణంగా ఇది అన్ని కేసుల విషయంలో అలా జరగదు. చిత్రహింసలు ప్రజల మనస్సులను కలవరపరుస్తాయి, కొందరు వ్యక్తులు హింసించబడినప్పుడు, హింసలకు తట్టుకోలేక కూడా విచ్ఛిన్నం అవుతారు, రహస్య గూఢచారులుగా మారతారు. మరికొందరికి తమ పూర్తి సమయాన్ని ఈ కార్యకలాపాలకు కేటాయించ గలగడానికి, నాయకత్వ పాత్రలు నిర్వహించడానికి ఇబ్బందులు ఉంటాయి. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విప్లవాత్మక సంస్థలు సాధారణంగా జైలు నుండి అప్పుడే ఫ్రెష్ గా బయటికి వచ్చిన కామ్రేడ్లను వెంటనే నాయకత్వ పదవులు చేపట్టనివ్వడం లేదు. వారు మోసాగాళ్ళుగా మారలేదని నిర్ధారించుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. జైలు అనుభవాల తర్వాత వారు నాయకత్వపు ఒత్తిడులను అధిగమించగలరని నిశ్చయించుకున్న తర్వాత వారు క్రమంగా తిరిగి రాజకీయ పనిలోకి మారడం చాలా ముఖ్యం.
ప్రత్యేకంగా, హ్యూయ్ పి. న్యూటన్ విషయానికొస్తే అతను జైలు నుండి వచ్చిన తర్వాత మతిస్థిమితం కోల్పోయాడు. పార్టీ సభ్యత్వం కూడా చాలా పెరిగింది, మెజారిటీ సభ్యులు అతనికి అపరిచితులే. 1967 ఫాల్ సీజన్ లో హ్యూయ్ అరెస్టు అయినప్పుడు, అతనికి బ్లాక్ పాంథర్ పార్టీ లోని ప్రతి ఒక్క సభ్యుడు తెలుసు; చివరకు 1970లో వసంతకాలపు చివరికి అతను జైలు నుండి విడుదలైనప్పుడు, పార్టీ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ సమయంలో బాబీ సీల్ కూడా జైలులో ఉన్నాడు, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ప్రవాసంలో ఉన్నాడు. ఎఫ్ బి ఐ పుట్టించిన పుకార్లు, వాళ్ళు హ్యూయ్ పి. న్యూటన్ కి పంపిన నకిలీ లేఖలు అతనికి మతిస్థిమితం లేకుండా విపరీతమైన ఆందోళనలకు గురి చేశాయి.
అతను ఇతర శాఖల సమస్యలను “పరిష్కరించడానికి”, మెల్విన్ “కాటన్” స్మిత్, బిగ్ బాబ్ బే, వంటి తనకు తెలిసిన పాంథర్స్ ని పంపడం ద్వారా ప్రతిస్పందించాడు. దేశవ్యాప్తంగా ఉన్న బ్లాక్ పాంథర్ పార్టీ శాఖలలో అనేక విభిన్నమైన సమస్యలున్నాయి. కొంతమంది కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు, మరికొందరు మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారు, కొందరు సభ్యులకు మద్యపాన సమస్యలున్నాయి, కొందరికి పితృస్వామ్యానికి సంబంధించిన సమస్యలే గాక ఇతర విషయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, హ్యూయ్ పి. న్యూటన్ తనకు విధేయులైన వారిని ఇతర అధ్యాయాలకు పంపడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. దానికి బదులుగా, ఈ రాయబారులు – రాజకీయ స్పష్టతతో పనిచేయడం కంటే కూడా హ్యూయ్ పి. న్యూటన్ పట్ల తాము విధేయతతో ఉండాలనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యతగా ఎంచుకున్నారు – వారు పరిష్కరించిన వాటికంటే చాలా ఎక్కువ సమస్యలను సృష్టించారు. ఇది ఎలా జరిగిందో ముమియా వివరిస్తున్నాడు:
“హ్యూయ్ తన గత-పార్టీ వీధి జీవితానికి సంబంధించిన అతని హోమీలు, స్నేహితుల నుండి తనకు తెలిసిన వ్యక్తులను నాయకులను చేయడానికి మొగ్గు చూపాడు. వీరు నిస్సందేహంగా అతను విశ్వసించే వ్యక్తులు అయినప్పటికీ, చాలా స్పష్టంగా చెప్పాలంటే, వారు అంతర్జాతీయ సంస్థకు నాయకత్వం వహించి సమర్ధవంతంగా నిర్వహించగల ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కాదు.
“హ్యూయ్ పి. న్యూటన్ విశ్వసించిన వ్యక్తులు పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన విషయాలపై అతని నిర్ణయాలను ప్రశ్నించడం కంటే హ్యూయ్ పి. న్యూటన్ ఇష్టాయిష్టాలను అమలుపరచడానికి మొగ్గు చూపడం జరిగింది. వారు అతని సహచరులుగా కంటే, అతని దూతలుగా, అతని ఇష్టాయిష్టాలకు సాధనాలు అయ్యారు. ఇలాంటి పురుషులకు ‘హ్యూయ్స్ పార్టీ’ అనే పదానికి అర్థం, వాస్తవికత వర్తిస్తాయి”
ముమియా విశ్లేషణ హ్యూయ్ పి. న్యూటన్ వ్యక్తిగత నాయకత్వం ఎలా ఉందో చూపిస్తుంది. పార్టీని ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన హ్యూయ్ పి. న్యూటన్ వ్యక్తిగత నాయకత్వం చివరకు క్లిష్టమైన సమస్యగా మారి పాంథర్స్ ను ఎలా దెబ్బతీస్తుందో ముమియా విశ్లేషణ చూపిస్తుంది. ఈ సమయంలో హ్యూయ్ పి. న్యూటన్ ను పార్టీ నుండి తొలగించాలని గానీ, లేదా అతను నాయకుడిగా ఉండకూడదని గానీ దీని అర్థం కాదు. దానికి బదులుగా, కేంద్ర కమిటీ – స్థానిక నాయకుల సమష్టి నాయకత్వం అవసరం. ఆ విధంగా, వ్యక్తిగత లోపాలను అధిగమించవచ్చు. వారి నాయకత్వ నైపుణ్యాలకంటే సహచరుల వ్యక్తిగత విధేయతకు విలువనిచ్చే హ్యూయ్ పి. న్యూటన్ ధోరణి వంటి తప్పులను నివారించవచ్చు. ఇతరులు హ్యూయ్ పి. న్యూటన్ తో బహిరంగంగా కాకుండా ద్రోహంగా చూడకుండా అనునయంగా విభేదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న మంచి సామూహిక విధానం, అవలంభించి ఉండి ఉంటే ఆ సమయంలో పార్టీలో పెరుగుతున్న అపనమ్మకాలు, గందరగోళాలను ఎదుర్కోవడానికి చాలా దూరం వెళ్ళవలసి ఉండేది కాదు.
ఏది ఏమైనప్పటికీ, అవిశ్వాసం, పెరుగుతున్న మతిస్థిమితం మాత్రమే హుయ్ పి.న్యూటన్ జైలు నుంచి విడుదలయ్యాక ఎదుర్కొన్న సమస్య కాదు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత హ్యూయ్ కొత్త సైద్ధాంతిక సూత్రీకరణలు మరింత పరిశీలనాత్మకంగా, విద్యాపరంగా మారాయి. చాలా మంది సామాన్యులే గాక పార్టీ సభ్యులు కూడా అతను ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు, జైలులో చాలా సమయం గడిపిన తర్వాత, హ్యూయ్ పి.న్యూటన్ కూడా ప్రజలతో స్పష్టంగా, సూటిగా మాట్లాడలేకపోయాడు. అతను ప్రజలతో సంబంధాన్ని కోల్పోయాడు, పార్టీలో సహృదయతతో విమర్శించే సంస్కృతి లేకపోవడం వల్ల ప్రజలు అతని ఈ ఆందోళనలను విస్మరించకుండా వాటిని వినిపించడం కూడా చాలా కష్టంగా మారింది.
హ్యూయ్ బ్లాక్ పాంథర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా గొప్ప కృషి చేశాడు కాబట్టి ప్రతి పాంథర్ అతనిని విడిపించడానికి సంఘీభావాన్ని సమీకరించడానికి ప్రయత్నించాడు. వారు అతని వైపు గర్వంగా, గౌరవంగా చూశారు, నిజానికి అతని స్ఫూర్తితో చాలా మంది పార్టీలో చేరారు. బాబీ జైలులో, ఎల్డ్రిడ్జ్ అల్జీరియాలో ఉండడంతో, ఆ సమయంలో జైలు నుండి విడుదలై బయటికి వచ్చిన హుయ్ పి. న్యూటన్ తమను ముందుకు నడిపించగలడని అప్పుడున్న సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేయగలడని పాంథర్స్ ఎంతగానో ఆశించారు. చాలా మందికి పార్టీ కార్యాలయం గోడపై ఉన్న చిత్రంగా మాత్రమే తెలిసిన హ్యూయ్ పి. న్యూటన్, జైలు నుండి బయటకు వచ్చి విప్లవస్ఫూర్తికి దూరం జరిగి విద్యావేత్త మారినప్పుడు పాంథర్స్ కి దిక్కుతోచకుండా పోయింది.
బ్లాక్ పాంథర్ పార్టీ ఫిలడెల్ఫియా శాఖ నాయకుడు రెగ్గీ షెల్ (Reggie Schell), జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత హ్యూయ్ పి. న్యూటన్ లో వచ్చిన మార్పులను, ఆ సమయంలో పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించడం అతనికి ఎలా, ఎంత కష్టమైందో వివరించాడు:
“హ్యూయ్ పి. న్యూటన్ జైలు నుండి బయటికి వచ్చినప్పుడు, ఆ వేసవిలో నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. నల్లజాతి సమూహానికి చెందిన వ్యక్తులు వచ్చి అతనితో మాట్లాడినప్పుడు నేను ఆ సంఘటనను చూశాను, హ్యూయ్ పి. న్యూటన్ విడుదలై ఇంటికి వచ్చినందుకు నల్లజాతీయులు ఎంతగానో అభినందించారు, వారు అతనిని ఎంతగా మిస్సయ్యారో వివరిస్తూ అతనికి మద్దతు ఇచ్చారు. అతను వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడాన్ని నేను చూశాను. అతని సంభాషణ మొత్తం పోయింది, అతను మానసికంగా వారికి మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నాడు[…]మీకు తెలుసా, ప్రతి ఒక్కరూ పార్టీని మలుపు తిప్పడం గురించి మాట్లాడుతున్నారు. దేశ వ్యాప్తంగా చాలా మందిని అసంతృప్తికి గురిచేస్తున్న కొన్ని విషయాలు అంతర్గతంగా జరుగుతున్నాయి.
“మాదకద్రవ్యాల వినియోగం విపరీతమైపోయింది, అదే గాక బోలెడన్ని సమస్యలు నెత్తిమీదకొచ్చి పడ్డాయి; బాబీ సీల్ కనెక్టికట్‌లోని న్యూ హావెన్, జైలులో ఉన్నాడు, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ దేశంలోనే [అల్జీర్స్] లేడు, తిరిగి రాలేకపోతున్నాడు. హ్యూయ్ పి. న్యూటన్ వచ్చి, పార్టీకి అండగా ఉండి ఈ సమస్యలను పరిష్కరించగలడని మేమందరం ఆశించాం, కానీ అతను జైలు నుంచి తిరిగి వచ్చాక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడని మేము గ్రహించాం. పార్టీ ఇప్పుడిప్పుడే దిగజారిపోవడం ప్రారంభించింది, ప్రజలు దానినుంచి వైదొలగిపోవడం ప్రారంభించారు. బ్లాక్ పాంథర్ పార్టీ గొప్ప ఆశయం చెదిరిపోవడం మొదలయింది.
“ఇది నిజంగా వ్యక్తుల గురించిన ప్రశ్న కాదు, నిజానికి పైస్థాయి వ్యక్తులు, పార్టీ సెంట్రల్ కమిటీ, వారిని ఆదర్శంగా తీసుకుని మేము ఎదురుచూసేవాళ్ళం, వాళ్ళు మమల్ని మరింత పోరాడమని ప్రేరేపించినవారు, ఆ స్ఫూర్తిని మేము పొందలేనప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్న అధ్యాయాలు, శాఖలు విచ్చిన్నమవడం ప్రారంభించాయి”.
పార్టీలో సమస్యలు ఎంత లోతుగా, గడ్డుగా ఉన్నాయో స్పష్టం చేయడానికి రెగ్గీ షెల్ వ్యాఖ్యలు సహాయపడతాయి. జాతీయ నాయకత్వం సంక్షోభంలో ఉంది, స్థానిక స్థాయిలో అనేక శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, పార్టీలో విప్లవాత్మక క్రమశిక్షణ లోపించింది, కొంతమంది సభ్యులు మద్యపాన వ్యసనానికి బానిసలైపోయి అనేక సమస్యలను తెచ్చి పెడుతున్నారు. అయినప్పటికీ, పార్టీ చేస్తున్న అద్భుతమైన సానుకూల పనులు కూడా ఉన్నాయి. వారి గొప్ప విజయాలు, ఒక విప్లవ పార్టీ చేయకూడని తప్పులు – వాటి నుండి పాఠాలను నేర్చుకుని, వారి లోపాలను పరిష్కరించుకోవడానికి పార్టీ ఒక ప్రణాళికను రూపొందించడం చాలా అవసరం.
ఒక క్రమశిక్షణతో ఒక ప్రణాళికను అవలంబించినట్లయితే, వారు చేస్తున్న తప్పులను సరిదిద్దడం, పార్టీ సాధించిన విజయాలను ప్రాచుర్యంలోకి తేవడం సాధ్యమయ్యేది. మరింత కష్టపడుతున్న శాఖలు అచ్చం అలాంటి ఇబ్బందులను అధిగమించిన వాటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. స్థానిక నాయకులకు కేంద్ర కమిటీ జాతీయ నాయకత్వానికి పదోన్నతి కల్పించి ఉండవచ్చు. పార్టీ శాఖల మధ్య మెరుగైన, సురక్షితమైన కమ్యూనికేషన్ మార్గాలను ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు.
బ్లాక్ పాంథర్ పార్టీలో విప్లవాత్మక వ్యూహంపై తేడాలు :
దురదృష్టవశాత్తు కేంద్ర-స్థానిక నాయకుల మధ్య సయోధ్య కుదుర్చుకోవలసిన ఏర్పాట్లు ఏవీ జరగలేదు. దానికి బదులుగా, ఎఫ్ బి ఐ నకిలీ లేఖలు, కౌంటర్ ఇంటలిజెన్స్ కుట్రపూరితమైన ప్రయత్నాలు పాంథర్స్ లో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేయడం కొనసాగించాయి. స్థానిక – జాతీయ నాయకుల మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి, ఫలితంగా హ్యూయ్ పి. న్యూటన్ – ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ఒకరి పట్ల మరొకరు మితిమీరిన సందేహాలతో సతమతమవుతున్నారు. ఈ అనుమానానికి తోడు ఎఫ్ బి ఐ జోక్యం ఇంకా ఆజ్యం పోసి మంటలు రగిల్చింది. ఉదాహరణకు, హుయ్ పి. న్యూటన్, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ని కించపరుస్తున్నాడని కష్టపడి పనిచేసే ర్యాంక్-అండ్-ఫైల్ పాంథర్ల మీద ఆధారపడి జీవిస్తున్నాడని ఎఫ్ బి ఐ ఫోర్జరీ చేసిన నకిలీ లేఖలను వరసగా ఎఫ్ బి ఐ ద్వారా అల్జీరియాలో ప్రవాసంలో ఉన్న ఎల్డ్రిడ్జ్ క్లీవర్ అందుకున్నాడు.
ఈ లేఖలు ఎల్డ్రిడ్జ్ క్లీవర్ అహాన్ని దెబ్బతీశాయి, అతనే పార్టీ నాయకుడిగా ఉండాలి గానీ హ్యూయ్ పి న్యూటన్ కాదనుకున్నాడు. డిసెంబరు 1970లో ఒక అంతర్గత మెమోలో ఎఫ్ బి ఐ తన ఏజెంట్లను ఇలా ఆదేశించింది, “ఎల్డ్రిడ్జ్ క్లీవర్‌కు, హ్యూయ్ పి న్యూటన్ నాయకత్వ లోపాలపై విమర్శిస్తూ అనేక లేఖలు రాయండి. హ్యూయ్ పి న్యూటన్ కు సంబంధించి ఎల్డ్రిడ్జ్ క్లీవర్‌కు తగిన సంఖ్యలో ఫిర్యాదులు అందితే… అది అసమ్మతిని సృష్టించవచ్చు, అది తరువాత మరింత పూర్తిగా ఉపయోగించుకోవచ్చని భావించింది”. ఈ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించగలిగితే, అది పార్టీలో చీలికకు దారితీస్తుందని ఎఫ్ బి ఐ కి తెలుసు. అయినప్పటికీ, వారిద్దరి మధ్య ఇంతకుముందే ఉన్న విభేదాల కారణంగా ఎఫ్ బి ఐ హ్యూయ్ పి న్యూటన్ – ఎల్డ్రిడ్జ్ క్లీవర్ ల మధ్య ఈ చీలికను నడిపించగలిగిందని చూడటం మాత్రమే ముఖ్యం.
హ్యూయ్ పి. న్యూటన్, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ తమ తమ రాజకీయాల విప్లవాత్మక వ్యూహాలలో చాలా కాలంగా ఒకరినొకరు విభే దిస్తున్నారు. అమెరికాలో నల్లజాతి విప్లవం చాలా అవసరమని ఇద్దరూ అంగీకరించినప్పటికీ, దానినుంచి ఉత్తమమైన ఫలితాలను ఎలా సాధించాలి అనే విషయంపై ఇద్దరికీ వేరు వేరు అభిప్రాయాలున్నాయి. ఎల్డ్రిడ్జ్ క్లీవర్ చే గువేరా పాటించిన “ఫోకస్ ఆఫ్ ది రివల్యూషన్” (Focus of the Revolution) ఆలోచనను రూపొందించాడు. ప్రాథమికంగా ఈ భావన ఏమిటంటే సాయుధ విప్లవకారులు తక్కువ సంఖ్యలో పూర్తిగా భూగర్భంలో పని చేస్తూ, అణచివేతదారులకు వ్యతిరేకంగా గెరిల్లా చర్యల వరస కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ చర్యలు ప్రజానీకాన్ని ఆకస్మికంగా ఉత్తేజితుల్ని చేసి, వారి అణచివేతదారులను కూలదోయడానికి ప్రేరేపిస్తాయని ఆలోచించాడు ఎల్డ్రిడ్జ్ క్లీవర్.
అయితే ఇది వాస్తవిక వ్యూహం కాదని చరిత్ర చూపుతోంది. మొదటిగా చెప్పుకోవాలంటే అమెరికా చాలా శక్తివంతమైన దేశం, పోలీసు ఫోర్స్, సైన్యం, ఎఫ్ బి ఐ వంటి మరెన్నో అణచివేత శక్తుల ప్రాబల్యం మెండుగా కలిగి ఉంది. అటువంటి శక్తివంతమైన శత్రువును పడగొట్టడానికి కొన్ని గెరిల్లా చర్యలు, ఆకస్మిక తిరుగుబాట్లు ఏ విధంగానూ సరిపోవు. 1967లో డెట్రాయిట్లో, 1992 లో లాస్ ఏంజిల్స్ లో, 2015లో బాల్టిమోర్ లో కేవలం కొన్ని సంఘటనలను ఎదుర్కొనడానికి, అమెరికా ప్రభుత్వం మాటి మాటికీ ప్రజలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించడానికి సర్వ సన్నద్ధమై పోయింది. ఈ ప్రతి సందర్భంలోనూ అసంఘటిత తిరుగుబాట్లు, అద్భుతమైన సానుకూలతతో ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం అణచివేత శక్తిని అధిగమించలేకపోయాయి.
ఇంకా ఏమిటంటే, వ్యక్తిగత అణచివేతదారుల మీద వాతావరణ నిపుణులు, బ్లాక్ లిబరేషన్ ఆర్మీ కలిసి నిర్వహించిన చిన్న గెరిల్లా చర్యలు చాలా సాధారణంగా ఉండి ప్రజలకు ఎలాంటి ప్రేరణలూ కలిగించలేదు. దానికి బదులుగా, ఈ చర్యలు ప్రజలను భయపెట్టడానికి గానీ, రాజకీయంగా వారిని నిరాయుధులను చేయడానికి గానీ పనికోస్తాయి, ఎందుకంటే గెరిల్లాలు తమ అణచివేతదారులందరినీ జాగ్రత్తగా గమనించి ఎదుర్కొంటారని ప్రజలు తప్పుగా నమ్ముతారు. అలాగే, ఈ విధమైన సంస్థలు పోలీసు అధికారులను హత్య చేయడం లేదా రాజకీయ నాయకులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలను చేపట్టినప్పుడు, అది ప్రజలపై మరింత క్రూరంగా, కఠినంగా వ్యవహరించడానికి రాజ్యాన్ని ప్రేరేపిస్తుంది. అంతేగాక అణచివేత చట్టాలు, ప్రోటోకాల్‌ల సరికొత్త పద్ధతుల్ని ఆమోదించడానికి ప్రభుత్వానికి అవకాశమిస్తుంది.
చారిత్రాత్మకంగా మార్క్సిస్టులు ఈ విధమైన గెరిల్లా చర్యలను “లెఫ్ట్” -సాహసవాదం అని పిలిచారు. ఈ వ్యూహాలు, చాలా “ఎడమ” రాడికల్ ఆలోచనలుగా అనిపించినప్పటికీ, నిజానికి గెరిల్లాల చిన్న సమూహం ఒకే పోరాటంలో రాష్ట్రాన్ని ఓడించగలదనే భ్రమాజనిత విపరీతభావనలపై ఆధారపడి ఉంటుంది. విప్లవ రాజకీయాల్లో గెరిల్లా యుద్ధానికి ఎటువంటి ఆధారం లేదని దీని అర్థం కాదు, కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించబడుతుందనే ప్రత్యేకతలు చాలా ముఖ్యమైనవి. ప్రజల నుండి ఒంటరిగా ఉన్న విప్లవకారుల చిన్న బృందం చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వంపై గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించడం అంతే అది ఆత్మహత్యా సదృశమే, దేశం నిజమైన సంక్షోభంలో ఉండి ఉంటేనో, ఇప్పటికే జరుగుతున్న సామూహిక తిరుగుబాట్లతో అస్తవ్యస్తంగా ఉంటేనో తప్ప అది సాధ్యం కాదు. అమెరికా కొన్ని గంటల వ్యవధిలో దేశంలో ఎక్కడికైనా సైన్యాన్ని మోహరించగల శక్తి సామర్ధ్యాలు కలది, గెరిల్లాల వంటి చిన్న బృందాన్ని సులభంగా అణిచివేస్తుంది.
నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో గెరిల్లా యుద్ధాన్ని చేపట్టే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసించే దేశాల్లో, మౌలిక, రవాణా సౌకర్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందని దేశాల్లో ఇది సాధ్యమవుతుంది. ఇండియా – ఫిలిప్పీన్స్ వంటి దేశాలలోని, విప్లవకారులు దశాబ్దాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన గెరిల్లా యుద్ధాలు చేస్తున్నారు. అయినప్పటికీ, అక్కడ కూడా వారి వ్యూహంలో విప్లవ దృష్టి లేదు, అవి చిన్న చిన్న బృందాలుగా వేరు పది ప్రజలనుండి దూరంగా జరిగి పనిచేస్తాయి. దానికి బదులుగా, విప్లవకారులు “నీటిలో చేపలలాగా ప్రజల మధ్య కలిసిపోవాలి”. విప్లవంలో పాల్గొనేందుకు ప్రజల మద్దతుతో వారితో కలిసి పని చేయాలి.
హ్యూయ్ పి. న్యూటన్ మొదట్లో విప్లవ దృష్టి కోణంతో ఉన్న రాజకీయ వ్యక్తిగా చే గువేరా పట్ల కొంత సానుభూతితో ఉన్నప్పటికీ, ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యవస్థీకరించడం పార్టీ ప్రాథమిక పాత్ర అని అతను నొక్కి చెప్పాడు. ఆ విధంగా, ఒక నగరంలో ఆకస్మిక తిరుగుబాటు స్వాభావిక బలహీనతను అధిగమించడం, తద్వారా దేశవ్యాప్త విప్లవాన్ని సమన్వయం చేయడం సాధ్యమవుతుంది. 1965లో వాట్స్ లో జరిగిన తిరుగుబాటును అణిచివేసి 4,000 మంది నల్లజాతీయులను అరెస్టు చేయడానికి పోలీసులు దానిని సాకుగా ఎలా ఉపయోగించారో హ్యూయ్ పి. న్యూటన్ స్వయంగా చూశాడు. కేవలం ఆకస్మిక తిరుగుబాట్లు అమెరికా ప్రభుత్వాన్ని స్వయంగా కూల్చివేయలేవని అతనికి బాగా తెలుసు. అందుకే, 1967 జూలైలో హ్యూయ్ పి. న్యూటన్ “ది కరెక్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎ రివల్యూషన్” (The Correct Handling of a Revolution) అనే తన రచన లో, ఇలా వ్రాశాడు: “పార్టీ ప్రధాన విధి ప్రజలను మేల్కొల్పే దిశగా పనిచేస్తూ, భారీ పోరాటానికి మాత్రమే కాకుండా అధికార నిర్మాణాన్ని పడగొట్టే వ్యూహాత్మక పద్ధతిని వారికి నేర్పాలి. “ప్రజల పట్ల అమలుపరుస్తున్న క్రూరత్వాన్నీ, నల్లజాతి జనాభాను పూర్తిగా నిర్మూలించాలన్న దుష్ట ప్రయత్నాలనూ ప్రతిఘటించాలి. విద్యా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని పెంచడమనే పనిని ముందు వరసలో ఉండే పార్టీ సేనా సమూహం తాము ప్రధానంగా నెరవేర్చవలసిన లక్ష్యంగా పెట్టుకోవాలి”- అని కూడా హ్యూయ్ నొక్కిచెప్పాడు. నిద్రలో ఉన్న ప్రజానీకాన్ని పోరాటానికి సరైన విధానంతో దూసుకుపోయేలా చైతన్యపరచాలి, అంతేగాక ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి పార్టీ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోగలగాలి.
అదే కథనంలో, పార్టీని పూర్తిగా అండర్‌గ్రౌండ్ సంస్థగా ప్రారంభించాలనే ఆలోచనను కూడా ఆయన (పూర్తి విప్లవదృష్టితో పోరాటాల్లో పాల్గొనడానికి అవసరమైన విధంగా ఉండటాన్ని కూడా) విమర్శించాడు. ప్రజలకు పార్టీ గురించి స్పష్టంగా తెలియకపోతే తలెత్తే ఇబ్బందులను ఎత్తిచూపాడు. అణగారిన వ్యక్తులు, సమూహాల మధ్య నిజాయితీగా, ఓపికగా పని చేయకపోతే, వారి విశ్వాసాన్ని పొందడం ఎలా సాధ్యమవుతుంది? పాంథర్స్ కు అర్బన్ గెరిల్లా యుద్ధం చేసే విధానాన్ని తక్షణమే అవలంబించాలని ఎల్డ్రిడ్జ్ క్లీవర్ చేసిన ఆదేశం గురించి ఈ కథనంలో అంతర్లీనంగా విమర్శ ఉంది. అహింసా మార్గాల ద్వారా అణచివేతదారులను అధిగమించడం సాధ్యమవుతుందనే శాంతి కాముక భ్రమలు హ్యూయ్ పి. న్యూటన్ కు ఏమాత్రం లేవు, కానీ ఆ సమయంలో గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంబిస్తే పాంథర్లు ప్రజల నుండి త్వరగా దూరమవుతారని, అన్యాయంగా నాశనం చేయబడతారని కూడా అతను అర్థం చేసుకున్నాడు. హ్యూయ్ పి. న్యూటన్ కొంత కాలంపాటు గెరిల్లా యుద్ధ విప్లవ ఆలోచనలకు సైద్ధాంతికంగా సానుభూతితో ఉన్నాడు, అయితే అతను పట్టణ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎల్డ్రిడ్జ్ క్లీవర్ చేసిన ప్రయత్నాలను స్థిరంగా వ్యతిరేకించాడు.
ఏదేమైనా, జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత హ్యూయ్ పి. న్యూటన్ కొత్త సైద్ధాంతిక సూత్రీకరణలను ప్రకటించాడు, అతను ఒకవైపు విప్లవ దృష్టి వ్యూహాన్ని పూర్తి స్పష్టతతో తిరస్కరించాడు, కానీ మరోవైపు మరింత పరిశీలనాత్మకమైన, విద్యాసంబంధమైన వాటి వైపు తన దృష్టిని మరల్చుకున్నాడు. అదే సమయంలో, హ్యూయ్ పి. న్యూటన్ చాలా బహిరంగంగా సంస్కరణవాద రాజకీయాలను సమర్థించడం ప్రారంభించడం కూడా యాదృచ్చికమైతే కాదు. వీటన్నింటిని రివల్యూషనరీ ఇంటర్ కమ్యూనలిజం అనే సిద్దాంతంలో చుట్ట చుట్టుకున్నాడు. అతని ప్రాథమిక వాదన ఏమిటంటే, అమెరికా ప్రభుత్వం మొత్తం ప్రపంచాన్ని నియంత్రిస్తుంది, దేశాలు, రాష్ట్రాలు కూడా ఉనికిలో లేవు, కేవలం సంఘాలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయంటాడు. ఈ తప్పుడు అవగాహననుండి, కమ్యూనిటీలు పెట్టుబడిదారీ విధానం నుండి “వేరుపరచు” కుని స్వతంత్ర విప్లవాత్మక సమాజాలుగా మారడం సాధ్యమేనని హ్యూయ్ పి. న్యూటన్ వాదించాడు. ఇది మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతానికి పొడిగింపు, అన్వయం అవుతాయని హ్యూయ్ పి. న్యూటన్ పేర్కొన్నప్పటికీ, ఇది ఈ సిద్ధాంతంలోని కొన్ని ప్రాథమిక పాఠాలను స్పష్టంగా ఉల్లంఘించింది.
ఉదాహరణకు, మార్క్సిస్ట్ సిద్ధాంతం వర్గ వైరుధ్యాల కారణంగా రాజ్యం ఉనికిలో ఉందనీ, మొత్తం సమాజానికి సేవ చేసే తటస్థ సంస్థగా తనను తాను ప్రదర్శించుకోవచ్చు గానీ వాస్తవానికి రాజ్యం ఒక నిర్దిష్ట తరగతి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుందని పేర్కొంది. లెనిన్ చెప్పినట్లుగా, “రాజ్యం ఒక ఉత్పత్తి వర్గ వైరుధ్యాల అసంబద్ధతల అభివ్యక్తి.” పెట్టుబడిదారీ విధానంలో, రాజ్యం పెట్టుబడిదారులకు సేవ చేస్తుంది. కార్మికులు, ఇతర పేద ప్రజలను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుంది. సరిదిద్దలేని ఈ వైరుధ్యపు అసంబద్ధతను పెట్టుబడిదారీవర్గం – కార్మికవర్గం మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గం విప్లవం ఒక్కటే శరణ్యం. శ్రామికవర్గాన్ని అణిచివేసేందుకు, విప్లవాన్ని అడ్డుకోవడానికి, రాజ్యానికి కోర్టులు, పోలీసులు, సైన్యం, న్యాయ వ్యవస్థ మొదలైన వాటితో సహా మొత్తం సంస్థల శ్రేణి అవసరం. మార్క్స్ సన్నిహిత మిత్రుడు, సహ రచయిత అయిన ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాజ్యాధికారం “కేవలం సాయుధ పురుషులు మాత్రమే కాకుండా భౌతిక అనుబంధ జైళ్లు, అన్ని రకాల నిర్బంధ సంస్థలను కూడా కలిగి ఉంటుంది” అని వాదించారు.
కాబట్టి, పెట్టుబడిదారీ విధానం అమెరికాలో ఇప్పటికీ ఉనికిలో ఉంది (నేటికీ అలాగే ఉంది), వివిధ అణచివేత, బలవంతపు నిర్బంధ సంస్థలు కూడా రద్దు కాలేదు, హ్యూయ్ పి. న్యూటన్ “నాన్-స్టేట్ ఇప్పటికే అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ సాధించబడింది” అని హ్యూయ్ పి. న్యూటన్ ఎలా, ఎందుకు నిర్ధారించాడో స్పష్టంగా తెలియదు. న్యాయస్థానాలు, జైళ్లను (అమెరికా లోని రెండు ప్రధాన సంస్థలు) సముద్రయానం చేస్తూ మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత, హ్యూయ్ పి. న్యూటన్ రాజ్యం ఉనికిలో లేదని నిర్ధారించడం వింతగా అనిపిస్తుంది. ఈ తీర్మానం మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతపు ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, హ్యూయ్ పి. న్యూటన్ ప్రత్యక్ష అనుభవాలకు కూడా విరుద్ధంగా ఉంది!
ఇంకో విషయమేమిటంటే వాట్స్, డెట్రాయిట్, ఇంకా 1960ల లోని ఇతర తిరుగుబాట్ల అనుభవాలు, అమెరికా ప్రభుత్వం పేద వర్గాలను వారి స్వంత జీవితాలను నిర్ణయించుకోవడానికి ఇష్టపడడం లేదని స్పష్టపరిచాయి. దానికి బదులుగా, ప్రజలు తమ అణచివేతదారులకు వ్యతిరేకంగా ఉద్యమించబోయినప్పుడు, ఈ తిరుగుబాట్లను అణిచివేసేందుకు భారీ మొత్తంలో సైనిక బలగాలను మోహరించేవారు. దీనిని బట్టి చూస్తే, సమాజం నుంచి “తెగగొట్టబడడం” (డీలింకింగ్) అనేది సాధ్యం కాదని హ్యూయ్ పి. న్యూటన్ కి స్పష్టంగా తెలిసి ఉండాలి, ఎందుకంటే సందేహాస్పద కమ్యూనిటీలు ఆర్థిక సంబంధాల ద్వారా మాత్రమే కాకుండా (అంటే ఆహార ఉత్పత్తులు అవసరమయ్యే నగరాలకు గ్రామీణ ప్రాంతాల నుండే రావాలి) అణచివేత శక్తి ద్వారా గ్రామీణ ప్రాంతాలను కూడా అమెరికాలో భాగంగా చేసుకుంటాయి. సంక్షిప్తంగా, ప్రభుత్వాన్ని పడగొట్టకుండా, ప్రజలు విప్లవాత్మక సమాజాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఏవైనా వ్యక్తిగత కమ్యూనిటీలు, లేదా మొత్తం నగరాలు కూడా ఇలా చేయడానికి ప్రయత్నిస్తే, పోలీసులు మిలిటరీ చేత నలిపివేయబడతాయి.
రివల్యూషనరీ ఇంటర్ కమ్యూనలిజం కోసం హ్యూయ్ పి. న్యూటన్ వాదన ఏమిటంటే అమెరికా ఒక సామ్రాజ్యంగా అభివృద్ధి చెందినందువల్ల, దేశాలు ఉనికిలో లేకుండా పోయాయనే అతని ఆలోచనపై ఆధారపడింది. ఈ సూత్రీకరణలో అతను దేశాలు, రాష్ట్రాలను కూడా కలుపుతాడు. అతను చెప్పినట్లుగా, “అమెరికా (యునైటెడ్ స్టేట్స్ , నేను దీనిని ‘ఉత్తర అమెరికా’ అని పిలవాలనుకుంటున్నాను, దాన్ని పాలక బృందం ఒక దేశం నుండి పెద్ద సామ్రాజ్యంగా మార్చారు. ఇది ప్రపంచంలో పూర్తి మార్పుకు కారణమైంది, ఎందుకంటే పరస్పర సంబంధం ఉన్న వస్తువులోని ఏ భాగమూ మారదు, మిగతావన్నీ కూడా యధాతధంగా అలాగే ఉంటాయి. కాబట్టి ఉత్తర అమెరికా, ఒక సామ్రాజ్యంగా మారినప్పుడు అది ప్రపంచంలోని మొత్తం దేశాల సరళిని మార్చింది. ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఉండేవి. కానీ ‘సామ్రాజ్యం’ అంటే సామ్రాజ్యంలో నివసించే పాలక వృత్తం (సామ్రాజ్యవాదులు) ఇతర దేశాలను నియంత్రిస్తుంది. ఇప్పుడు, ఆలోచిస్తే కొంత కాలం క్రితం మనం పిలుచుకునే ఒక దృగ్విషయం ఉంది – నేను అలాగే, పిలుస్తాను, అది – ఆదిమ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యం దీనికి మంచి ఉదాహరణ, ఎందుకంటే రోమన్లు తమకు తెలిసిన ప్రపంచం అని భావించిన అన్నింటినీ నియంత్రించారు. వాస్తవానికి వారికి ప్రపంచం మొత్తం తెలియదు కాబట్టి కొన్ని దేశాలు ఇప్పటికీ స్వతంత్రంగా ఉన్నాయి.”
హ్యూయ్ పి. న్యూటన్ వాదన ఏమిటంటే, ఒకసారి ఒక దేశం గనక ఒక సామ్రాజ్యం ద్వారా అణచివేయబడితే, అది ఇక ఒక దేశంగా నిలిచి ఉండదు. ఇది ఒక దేశం అంటే ఏమిటి అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. సాధారణంగా “ఒక దేశాన్ని ఒక నిర్దిష్ట భూభాగంలో నివసిస్తూ ఉమ్మడి భాష, సంస్కృతి, ఆర్థిక జీవితాన్ని పంచుకునే వ్యక్తుల సమూహంగా” మార్క్సిస్టులు అర్థం చేసుకుంటారు. దీనర్థం ఒక దేశపు ప్రజలు జయించబడినా లేదా ఆక్రమించబడినా, వారు తప్పనిసరిగా ఒక బానిస దేశంగా ఉండవలసిన అవసరం లేదు. ఉదాహరణకు, పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుని వలసరాజ్యంగా చేసినప్పటికీ, పాలస్తీనా ప్రజలు ఇప్పటికీ ఒక దేశంగా ఉన్నారు, అంతేకాదు, ఇప్పటికీ పాలస్తీనా రాజ్య ఏర్పాటు కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా, వియత్నాంలోని ప్రజలు ఫ్రెంచ్, జపాన్, మళ్లీ ఫ్రెంచ్, తర్వాత అమెరికా ఫాసిస్టుల దాడులకు – ఈ సామ్రాజ్యవాద దేశాలన్నింటి వలస పాలన బారిన పడినప్పటికీ ఇప్పటికీ ఒక దేశంగా ఉన్నారు. వారు తమ భాగస్వామ్య సంస్కృతిని, భాషని, భూభాగాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ఆర్థిక జీవితం, చివరికి వారు అమెరికా దూరాక్రమణ నుండి విముక్తి పొంది, ఇప్పుడు సర్వస్వతంత్రులయ్యారు.
దేశాల గురించిన ఈ అవగాహనకు విరుద్ధంగా, హ్యూయ్ పి. న్యూటన్ ఇలా వాదించాడు: “ఒక దేశం తన సరిహద్దులను రక్షించుకోలేకపోతే, దురాక్రమణదారుల ప్రవేశాన్ని నిరోధించలేకపోతే, ఒక దేశం తన రాజకీయ నిర్మాణాన్ని, దాని సాంస్కృతిక సంస్థలను నియంత్రించ లేకపోతే, అది ఇక మీదట ఒక దేశం కాదు, అది ఇంకేదో అవుతుంది.” ఇది దేశమంటే (ప్రజల సమూహం) అనీ, రాష్ట్రమంటే (పోలీసులు, కోర్టులు, కాంగ్రెస్, పన్ను వ్యవస్థ మొదలైనవి) అనే హ్యూయ్ పి. న్యూటన్ ఆలోచన గందరగోళానికి గురిచేస్తుంది. ఒక విదేశీ శక్తి మరొక దేశంపై దాడి చేసినప్పుడు, సామ్రాజ్యవాదులు సాధారణంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్య వ్యవస్థను నాశనం చేస్తారు, లేదా దేశయంత్రాంగాన్నే భారీగా సవరించుకుంటారు. ఉదాహరణకు, ఇరాక్‌పై అమెరికా దాడి సమయంలో బుష్ తన పరిపాలనద్వారా సద్దాం హుస్సేన్‌ను పడగొట్టి, అతని సైన్యాన్ని నిరాయుధులను చేసింది. దేశాన్ని పాలించడానికి “సంకీర్ణ తాత్కాలిక అథారిటీ” అనే సైనిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, దండయాత్రలు ఎల్లప్పుడూ దేశాన్ని నాశనం చేయలేవు. ఉదాహరణకు, ఇరాక్ ప్రజలు అమెరికా దాడి తర్వాత కూడా ఇరాక్‌లో నివసిస్తున్నారు. దండయాత్ర ఒక క్రమపద్ధతిలో నిర్మూలనకు, దాదాపు ప్రజలందరినీ సామూహికంగా స్థానభ్రంశం చేయడానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే, ఒక దేశం విధ్వంసమవుతుంది.
అయినప్పటికీ, ప్రజలు ఆక్రమించబడినప్పుడు లేదా ఆక్రమించబడిన వెంటనే ఒక దేశం ఉనికిలో ఉండే అవకాశాన్ని తిరస్కరిస్తుందనే హ్యూయ్ పి. న్యూటన్ పరిశీలనాత్మక సిద్ధాంతం, ప్రాథమిక వాస్తవాలను విస్మరించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు అర్ధ వలస రాజ్యాలుగా ఉన్నాయి, అందువల్ల ఆ యా దేశాల ప్రభుత్వాలు తమ సొంత ప్రజల ప్రయోజనాల కంటే కూడా ఎక్కువగా విదేశీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకోసమే సాగిలపడి పని చేస్తున్నాయి. ఈ దేశాలు, నామమాత్రంగా స్వతంత్రంగా ఉన్నట్లుంటాయి గానీ, విదేశీ వలస ప్రభుత్వాలకు బదులుగా వారి పప్పెట్ల దేశీయ నాయకులచేత పాలింపబడుతుంటాయి. అటువంటి నాయకులు ఇప్పటికీ ప్రధానంగా విదేశీ దేశాలు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు మాత్రమే సేవ చేస్తున్నారు. హ్యూయ్ పి. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం, ఈ దేశాలలోని ప్రజలకు ఇక మీదట ఒక దేశం ఉండబోదని దీని అర్థం. ఇంకా చెప్పాలంటే నేటి సామ్రాజ్యవాద దేశాలలో లేదా పాతకాలపు భూస్వామ్య రాజ్యాలలో కూడా, ఆ రాజ్యాలు ఎంతసేపూ ఉన్నత వర్గాల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడేవి. అలాంటి రాజకీయ వ్యవస్థలపై సామాన్య ప్రజలు ఎప్పుడూ ఆధారపడి లేరు. కాబట్టి ఇక్కడ కూడా, హ్యూయ్ పి. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం, దేశాలు ఉనికిలో ఉండవు అనేది సహజంగానే ఇది కొంచెం అర్ధరహితంగా అనిపిస్తుంది.
హ్యూయ్ పి. న్యూటన్ ఈ గందరగోళ అభిప్రాయాల దృష్ట్యా, దేశంలో విప్లవాత్మక రాజకీయాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం.
కానీ పాంథర్స్ గతంలో తమను తాము విప్లవాత్మక అంతర్జాతీయవాదులమని పిలుచుకునేవారు. అంటే వారు అంతర్జాతీయ శ్రామిక వర్గ ఉద్యమానికి, ప్రపంచ వర్గరహిత దృక్పధానికి, కమ్యూనిస్ట్ సమాజ స్థాపన కోసం జరిగే పోరాటాలకు మద్దతు నిస్తామని ప్రకటించారు. ఆ దిశలోనే పోరాడారు.
బ్లాక్ పాంథర్ పార్టీ అమెరికాలో విప్లవాత్మక ఉద్యమాన్ని నిర్మించడం, సోషలిజం కోసం పోరాడడం, ఆ పోరాడే ప్రయత్నంలో భాగంగా వివిధ జాతి నేపథ్యాల సమూహాలతో సన్నిహితంగా పనిచేసింది. పాంథర్స్ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో జతకట్టడం, చైనీస్ విప్లవానికి మద్దతు ఇవ్వడం, అమెరికా సైన్యంలోని నల్లజాతి సైనికులను ఆమెరికాని ఓడించడానికి, వియత్నామీస్ ప్రజలకోసం పోరాడడానికి చురుకుగా ప్రోత్సహించారు. ఈ విధమైన చర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవాత్మక ఉద్యమాలకు అన్ని రకాల మద్దతును అందించారని కూడా దీని అర్థం. ఏది ఏమైనప్పటికీ, రివల్యూషనరీ ఇంటర్కమ్యూనలిజం అనే కొత్త సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంతో, అమెరికాలో సోషలిజం సాధించడం అసాధ్యమని హ్యూయ్ పి. న్యూటన్ స్పష్టంగా వాదించాడు. కానీ అతను నిజంగా ఎందుకు అసాధ్యమో అనే విషయాన్ని సోదాహరణంగా వివరించి చెప్పలేదు. ఇది చాలా మంది పాంథర్లను పార్టీ ఆదేశాలివ్వవలసిన దిశలో గందరగోళానికి గురిచేసింది.
ముఖ్యంగా ఎల్డ్రిడ్జ్ క్లీవర్, పార్టీ ఇంటర్ కమ్యూనలిజానికి మారితే అది సంస్కరణవాద రాజకీయాలకు దారితీస్తుందని ఆందోళన చెందాడు. ఈ ఆందోళనలకు సవ్యమైన యోగ్యతే ఉంది. విభజన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, హ్యూయ్ పి. న్యూటన్ అన్ని పార్టీ శాఖల సభ్యులను పిల్చి, బాబీ సీల్ మేయర్ కావడానికి చేస్తున్న విఫల ప్రచారానికి మద్దతు నివ్వమంటాడు. అల్జీరియాలో అతని ఒంటరితనం కారణంగా, విప్లవాత్మక పోరాటానికి మారిన అతని ప్రవృత్తి కారణంగా, ఎల్డ్రిడ్జ్ క్లీవర్ మొత్తం పార్టీ పాటించవలసిన దిశ గురించి ఎక్కువగా ఆందోళన చెందాడు. ఈ ఆందోళనల్లో చాలా వరకు సబబైనవి, విలువైనవే, కానీ ఎల్డ్రిడ్జ్ క్లీవర్ వాటిని పరిష్కరించడానికి ప్రతిపాదించిన విధానం – అంటే అర్బన్ గెరిల్లా యుద్ధతంత్రాన్ని వెంటనే ప్రారంభించడం ద్వారా – చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. బ్లాక్ లేబర్ ఆర్మీ చివరికి ఈ వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు అది భారీ అణిచివేతకు, అనేక మంది సభ్యుల మరణానికి దారితీసింది.
ఈ ప్రశ్నలపై పాంథర్స్ లో ఇంత తీవ్రమైన రాజకీయ పోరాటం జరగడం చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఈ సంఘర్షణ ప్రధానంగా వ్యక్తిత్వాలకు సంబంధించినదని, హ్యూయ్ పి. న్యూటన్ – ఎల్డ్రిడ్జ్ క్లీవర్ లను అల్పబుద్ధులుగా, వారి చర్యలను అహంభావ చేష్టలుగా ఎవరైనా భావించవచ్చు. వాస్తవానికి వారి వ్యక్తిత్వాలు, బలహీనతలు రెండూ విభజనలో పాత్ర పోషించాయి. అయితే, ఈ పోరాటం కేవలం వివాదాస్పద వ్యక్తులకు సంబంధించినది కాదని చూడటం ముఖ్యం.
వాస్తవం ఏమిటంటే పాంథర్స్ ఒక ప్రధాన రాజకీయ కూడలిలో ఉన్నారు. వారు బ్లాక్ పాంథర్ పార్టీని కేవలం వారు నిర్వహించవలసిన విధంగా నిర్వహించలేకపోయారు. ఒకవైపున పార్టీలో పరిష్కరించాల్సిన అనేక సమస్యలు తలెత్తాయి. ఇంకోవైపున అమెరికా ప్రభుత్వం హింసాత్మక అణచివేత, గూఢచర్యల భారీ ప్రచారాలతో పార్టీ సభ్యులని లక్ష్యంగా చేసుకుంది. పాంథర్స్ కు అత్యవసరంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, ఆ మార్పులు ఎలా చెయ్యాలి అనేదే ప్రశ్న. దురదృష్టవశాత్తూ, హ్యూయ్ పి. న్యూటన్ – ఎల్డ్రిడ్జ్ క్లీవర్ లు ప్రతిపాదించిన వ్యూహాలు రెండూ కూడా ఏ రకమైన పరిష్కారాలు చూపకపోగా, పైపెచ్చు ప్రధానమైన సమస్యలను తెచ్చి పెట్టాయి.
ఇంటర్కమ్యూనలిజం సిద్ధాంతానికి హ్యూయ్ మారడం అంటే ఆచరణలో విప్లవ రాజకీయాలను విడిచిపెట్టి, విద్యాసంబంధమైన సంస్కరణవాదం వైపు మళ్లడమే. ఫలితంగా, ఇది అమెరికన్ ప్రభుత్వపు బెదిరింపులను తప్పించుకోవడానికి, అవకాశవాద, సంస్కరణవాద రాజకీయాలను అవలంబించడం ద్వారా ప్రభుత్వ అణచివేతను చాలా తక్కువగా ఎదుర్కోవడమో లేదా పూర్తిగా నివారించే ప్రయత్నంగానో భావించవచ్చు. ఈ వ్యూహం అన్ని స్థానిక అధ్యాయాలపై హ్యూయ్ పి. న్యూటన్ కీ, సెంట్రల్ కమిటీకి ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. చివరికి ఇది బాబీ సీల్ మేయర్ ప్రచారానికి మద్దతుగా పాంథర్ సభ్యులందరిని ఓక్లాండ్కు రీకాల్ చేయడానికి దారితీసింది.
ఎల్డ్రిడ్జ్ వ్యూహం కూడా ఏమాత్రం మెరుగైనది కాదు. అణచివేతను నివారించడానికి అతను పాంథర్స్ ను పూర్తిగా భూగర్భంలోకి వెళ్లి గెరిల్లా యుద్ధాన్ని చేపట్టాలని సూచించాడు. అతను పార్టీని వదులుగా అనుబంధంగా ఉన్న శాఖల శ్రేణిగా నిర్వహించడంతో పాటు మరింత వికేంద్రీకృత నాయకత్వాన్ని ముందుకు తెచ్చింది. ఆచరణలో ఇది బ్లాక్ లిబరేషన్ ఆర్మీ సాహస రాజకీయాలవైపుకి దారితీసింది. వారు పోలీసులపై కొన్ని చెదురుమదురు ఎదురు దాడులను పేలవమైన ప్రణాళికా బద్ధంగా ప్రారంభించారు కానీ బ్లాక్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా ఉనికిలోకి రాకముందే బ్లాక్ లిబరేషన్ పోరాటంపై మరింత అణచివేతను తీసుకువచ్చారు.
హ్యూయ్ పి. న్యూటన్ – ఎల్డ్రిడ్జ్ క్లీవర్ వ్యూహాలు బ్లాక్ పాంథర్ పార్టీకి నిజమైన మార్గాలు కానే కాదు. మొదటిది కుడివైపు – అవకాశవాదానికి, రెండవది “ఎడమ” – సాహసవాదానికి మారిపోయారు, కానీ ఈ రెండూ చివరికి బ్లాక్ పాంథర్ పార్టీ విప్లవాత్మక సామర్థ్యాన్ని రద్దు చేశాయి. ఈ పరిసమాప్తి అనివార్యం కాదు, కానీ పాంథర్స్ వారి వ్యూహాన్ని సరిచేసుకోవడానికి, వారి తప్పులు లోపాలను సరిదిద్దడానికి నిజమైన లక్ష్యశుద్ధి అవసరం. దురదృష్టవశాత్తు, వారు అలా చేయలేకపోయారు, రాజకీయ వ్యూహంపై ఈ సైద్ధాంతిక వైరుధ్యం చివరికి బహిరంగ ప్రజా సంఘర్షణగా బద్దలై, విభజనకు దారితీసింది.
ముగింపు :
1970లో బ్లాక్ పాంథర్ పార్టీ నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. వారు డజన్ల కొద్దీ నగరాల్లో తమ శాఖలతో దేశవ్యాప్త విప్లవాత్మక సంస్థగా ఎదిగారు. బ్లాక్ లిబరేషన్ పోరాటంలో పార్టీ అత్యంత అభివృద్ధి చెందిన తీవ్రవాద సంస్థగా ఎదగడమే కాదు, వారు చాలా అద్భుతంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. అయినప్పటికీ, వారు స్థానిక అధ్యాయాలతో సమస్యలు, సభ్యత్వంలోని విభాగాల మధ్య క్రమశిక్షణ, నిబద్ధతలు లేకపోవడం, కేంద్ర కమిటీలో జాతీయ నాయకత్వం -స్థానిక శాఖల నాయకుల మధ్య సమన్వయలోపం, వారి సంబంధాలలో సమస్యలు, పెరిగిన రాజ్య అణచివేతలు, మరిన్ని ఇటువంటి తీవ్రమైన అంతర్గత సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. విప్లవాత్మక సంస్థగా ముందుకు వెళ్లాలంటే తమ విజయాలు, అపజయాలను క్రోడీకరించుకుని చివరకు ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవాలి. దురదృష్టవశాత్తూ, బ్లాక్ పాంథర్ పార్టీ అలా చేయలేకపోయింది. అంతర్గతంగా సెంట్రల్ కమిటీలోనే గాకుండా, సెంట్రల్ కమిటీకి – స్థానిక నాయకులకు మధ్య పెరుగుతున్న వైరుధ్యం చివరకు పార్టీలో చీలికకు దారితీసింది.
రెడ్ స్టార్ తదుపరి సంచికలో మేము విభజనకు దారితీసిన సంఘటనలను చర్చిస్తాం .