ప్రొఫెసర్ జి.ఎన్‌. సాయిబాబా విడుదలకోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారికి చేస్తున్న విజ్ఞప్తి!

భారతదేశంలో విద్యా స్వేచ్ఛ కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంఘీభావ కమిటీ – ప్రొఫెసర్ జి.ఎన్‌. సాయిబాబా విడుదలకోసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన కూటమి సంయుక్తంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారికి చేస్తున్న విజ్ఞప్తి!

జస్టిస్ ఎన్వీ రమణ గారికి,
భారత ప్రధాన న్యాయమూర్తి,
భారత సుప్రీంకోర్టు,
3, జనపథ్, న్యూఢిల్లీ-110 001.

ప్రియమైన జస్టిస్ ఎన్.వి.రమణ గారూ,

ఈ కింద సంతకం చేసిన అంతర్జాతీయ విద్యా సంస్థలు, అంతర్జాతీయ పౌర సమాజానికి చెందిన మేమందరం, ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి క్షణ క్షణానికీ క్షీణించడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వ్యవస్థీకృత అణచివేత, వివక్షలను ప్రశ్నించినందుకు మహారాష్ట్ర రాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గట్టి నిఘా, పకడ్బందీ బందోబస్తు కలిగిన అండా సెల్‌లో సాయిబాబాని మార్చి 7, 2017 నుండి బంధించారు. రోజుకు పదహారు గంటల పాటు కోడి గుడ్డు ఆకారంలో నిర్మించబడిన, బొత్తిగా కిటికీలు కూడా లేని కాంక్రీట్ అండా సెల్‌ లలో ఖైదీలను నిర్బంధించి ఉంచుతారు. ఒకవేళ బయటికి రానిస్తే కూడా మళ్ళీ భయంకరంగా సెగలు కక్కే కాంక్రీటుతో కూడిన బహిరంగ ప్రదేశంలో మాత్రమే అడుగు పెట్టడానికి అనుమతిస్తారు. ఈ ప్రాంతంలో పచ్చదనమనేదే లేదు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో తీవ్రమైన వేడితో మండుతూ ఉంటుంది. ఇటువంటి జైలు పరిస్థితులలో అతను జీవించి ఉండే అవకాశాల పట్ల మేమందరం తీవ్ర ఆందోళనతో ఉన్నందువల్ల, మీరు జోక్యం చేసుకుని, ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ప్రాణాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.

ప్రొ.జి.ఎన్. సాయిబాబా అకడమిక్ కమ్యూనిటీ సభ్యుడిగా మాత్రమే గాకుండా, అంచులకు నెట్టివేయబడుతున్న అట్టడుగు వర్గాల ప్రజలు, భారతదేశ మూలవాసులైన స్థానిక ఆదివాసీలు, అంటరాని వారుగా పరిగణించబడుతున్న దళితులు, అడుగడుగునా అత్యాచారాలకు బలవుతున్న మహిళలు, మతపరమైన మైనారిటీలు, అణచివేయబడుతున్న జాతీయ, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన సామాజిక న్యాయ కార్యకర్తగా మాకు తెలుసు. అంతేకాదు, అతను 90 శాతం శారీరక వైకల్యాలతో ఉన్నవాడని, 19 దీర్ఘకాలిక, తీవ్రమైన పోస్ట్‌ పోలియో జబ్బులతో రోజు రోజుకీ కృంగి, కృశించిపోతున్నాడని కూడా మాకు తెలుసు. ఆ జబ్బులలో కొన్ని ప్రాణాంతకమైనవి, తక్షణం వైద్యసహాయం అవసరమైనవి ఉన్నాయి.
ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా పీడితులైన ప్రజల పక్షాన ఆలోచిస్తున్న కారణం వల్ల అరెస్టు చేయబడి, జైలు పాలయ్యారని మీకు గుర్తు చేయదలచుకున్నాం.

జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్‌ తో సెప్టెంబర్ 7, 2013న సాయిబాబా ఇంటి మీద దాడి చేసి అతని కంప్యూటర్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, బుక్స్, కొన్ని డాక్యుమెంట్స్ మొదలైన వాటిని అతని నివాసం నుండి స్వాధీనం చేసుకుని నేరారోపణ చేయడంతో అతనిపై కుట్ర ప్రారంభమైంది. సెప్టెంబర్ 17న జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో, సాయిబాబా – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) మధ్య క్రియాశీలమైన సంబంధాలను రుజువు చేయగలిగిన డిజిటల్ సాక్ష్యాలు రచనలు, పత్రాలను కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసుల దాడి మాత్రమే కాకుండా, సోదాలు జరిపిన విధానం కూడా నేరుగా భారతీయ సాక్ష్యాధారాల చట్టం – క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సెక్షన్ 100) ని ఉల్లంఘించినట్లు మీడియా కథానాల్లో చాలా బాగా వివరించారు. దాడి తరువాత, మే 9, 2014 న, పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చి ప్రొఫెసర్ సాయిబాబాను అతని ఇంటి దగ్గర నుండి బలవంతంగా వాహనంలో ఎక్కించి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. “రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సహకరిస్తున్నాడ”ని అతనిపై అభియోగాలు మోపారు.

మే 15, 2014 న సెషన్స్ కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశారు. కానీ ఆగస్టు 24 న దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నందువల్ల సెక్షన్ 439 కింద రెండవ బెయిల్ దరఖాస్తును ఫిబ్రవరి 12, 2015 న, దాఖలు చేశారు. ఈసారి కూడా బెయిల్‌ పిటిషన్‌ మళ్ళీ తిరస్కరణకు గురైంది. ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందని తెలుసుకున్న విదర్బా ప్రాంతానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. అది హైకోర్టు ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పి ఐ ఎల్) గా మార్చబడింది. ఈ ప్రయత్నం ఫలితంగా ఆరు నెలల పాటు తాత్కాలిక మెడికల్ బెయిల్ లభించింది. ఈ బెయిల్ ప్రక్రియ నడుస్తుండగానే ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అస్వస్థతకు గురవడం వల్ల నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్యాలయానికి తరలించారు. ప్రొఫెసర్ సాయిబాబా అధిక రక్తపోటు, రెండు మూత్రపిండాల్లో రాళ్లు, పిత్తాశయంలో రాయి, కైఫోస్కోలియోసిస్ (వెన్నెముక వంగిపోవడంవల్ల వచ్చే మస్క్యులోస్కెలిటల్ వ్యాధి) అనే పక్కటెముకల నొప్పి మొదలైన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదే పదే ప్రకటించారు!

కంటికి కనిపించని భూతాల్లాంటి శక్తులేవో వెనక తరుము కొస్తున్నట్లు చేసిన దుందుడుకు విచారణ తర్వాత, మార్చి 7, 2017న, భారత శిక్షాస్మృతిలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లోని (13, 18, 20, 38, 39) సెక్షన్ లే గాక, సెక్షన్ 120 బి కింద కూడా ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాకు జీవిత ఖైదు విధించబడింది. డిజిటల్ ఆధారాలతో పాటు ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాసిక్యూషన్ ఇరవై మూడు మంది సాక్షులను ప్రవేశ పెట్టింది. వారిలో ఇరవై రెండు మంది పోలీసులే! మిగిలిన ఇరవై మూడవ సాక్షి ఢిల్లీ పౌరుడు. కానీ అతనికి కేసు గురించి ఏమీ తెలియదు. అయితే పోలీసులతో డాక్యుమెంట్ చేయబడిన సాక్షి వాంగ్మూలంలో వీరందరితో సంతకాలు చేయించారు. తీర్పు వెలుడినప్పుడు ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితిని కనీస మానవ స్పందనలతో పరిగణనలోకి తీసుకోకుండా, అతన్ని అండా సెల్‌ ఒంటరి నిర్బంధానికి తరలించారు. అప్పటి నుండి ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా పట్ల అతి నిర్లక్ష్యం, ఏమాత్రం జవాబుదారీతనం లేకపోవడం, సరైన సంరక్షణ లోపించడం వల్ల ఆయన తన మిగిలిన శారీరక సామర్థ్యాలను ఒక్కటొక్కటిగా కోల్పోతున్నారు. మాకందరికీ అతని “జీవిత ఖైదు”, “మరణ శిక్ష”గా మారబోతోందా అని చాలా ఆందోళనగా ఉంది. గత సంవత్సరం నుంచి అతను రెండుసార్లు కోవిడ్ మహమ్మారి (Covid-19 Positive) బారిన పడ్డారు. అతని ముఖ్యమైన అవయవాలు క్రమక్రమంగా విఫలమవుతుండడంతో, అతను నెమ్మది నెమ్మదిగా మరణిస్తున్నారు.

ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా రెండు చేతులు, వెన్ను, తుంటి నొప్పితో బాధపడుతున్నారు. అందువల్ల అతను కొన్ని నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేరు. అండా సెల్ లో ఉండే విపరీతమైన వేడి, గడ్డ కట్టుకుపోయే చలి పరిస్థితులు అతనికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తాయి. అతనికి తరచుగా మైకం కమ్ముతూ అపస్మారకస్థితి లోకి వెళ్ళిపోతుంటారు. వైద్యులు అతనికి సమగ్ర గుండె పరీక్షలు, అత్యవసరమైన చికిత్సలను సిఫార్సు చేశారు. కానీ అది ఇంకా జరగనే లేదు. దానితోపాటు అతని చేయి కండరాలు బలం పుంజుకోవడానికి రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ చేయాల్సి ఉండగా, ఇంత చిన్నపాటి నొప్పిని నివారించే పద్ధతులు కూడా జైలులో లేవు. పోనీ అధికారులైనా కనీసం క్రమం తప్పకుండా సాధారణ వైద్యుడి వద్దకైనా తీసుకెళ్ళడం లేదు.

సాయిబాబా రెండు చేతులూ చిన్నపనికి కూడా సహకరించడంలేదు. రోజురోజుకీ అతని చేతుల్లో శక్తి కోల్పోతుండడం వల్ల మంచినీళ్ళు తాగడానికి గాజు సీసా కూడా పట్టుకోలేకపోతున్నారు. వరసవారీ వేధింపుల్లో భాగంగా ఇటీవల ప్రొఫెసర్ సాయిబాబాకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇవ్వమని అడిగితే, అది ఇచ్చేందుకు కూడా జైలు అధికారులు నిరాకరించారు. డీహైడ్రేషన్ కారణంగా సాయిబాబా పలుమార్లు స్పృహతప్పి పడిపోవడంతో ఆయన న్యాయవాది, ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. మీడియా కథనాలకు ప్రతీకారంగా, జైలు అధికారులు అతని అండా సెల్‌ లో టాయిలెట్ ప్రాంతంతో సహా రోజంతా రికార్డ్ అయ్యేలాగా సి సి టివి కెమెరాను అమార్చారు. కెమెరాను తొలగించేందుకు జైలు అధికారులు నిరాకరించడంతో, సాయిబాబా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. నాలుగు రోజుల నిరాహార దీక్ష తర్వాత, అతను స్పృహ తప్పి పడిపోయినప్పుడు జైలు అధికారులు ఆసుపత్రిలో చేర్చారు. చివరికిప్పుడైతే జైలు అధికారులు కెమెరాను తొలగించారు. కానీ అతను వాటర్ బాటిల్ అందుకున్నారా లేదా అనే వార్త కోసం మేమందరం ఎదురుచూస్తున్నాం. జైలుసిబ్బంది అతని పట్ల ఏకపక్షంగా ఆలోచిస్తూ, కౄరం స్వభావంతో వ్యవహరిస్తున్నారు.

నేరారోపణ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే అభిప్రాయమేర్పరచుకున్న రాజకీయ వ్యవస్థ పక్షపాత ధోరణితో, ప్రొ. జి.ఎన్. సాయిబాబా న్యాయ విచారణ హక్కును అడ్డుకుంటున్నదని మేము గట్టిగా నమ్ముతున్నాం. భారతదేశంలో రాజకీయ అసమ్మతిని తెలియజేసే వాళ్ళని, ప్రశ్నించే గొంతుల్ని అణచివేసే క్రమంలో అతని నిర్బందాన్ని మేము ఒక ఉదాహరణగా భావిస్తున్నాం. అతను మరణం అంచున ఉన్నప్పటికీ, అతని పెరోల్ అభ్యర్థన మూడుసార్లు తిరస్కరించబడింది, మెడికల్ బెయిల్ దరఖాస్తు రెండుసార్లు తిరస్కరించబడింది. మీరు వెంటనే, జోక్యం చేసుకుని ప్రొ. జి.ఎన్‌. సాయిబాబాకి న్యాయం చెయ్యండి. అతన్ని అండా సెల్ నుండి వీల్ చైర్ సౌకర్యం గల బ్యారక్‌కి మార్చి, అతని ప్రాణాలను కాపాడండి. తర్వాత అతన్ని మెడికల్ బెయిల్‌ పై విడుదల చేసి, తక్షణ చికిత్స కోసం మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చమని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం.

భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన ఫాదర్ స్టాన్ స్వామి జ్యుడీషియల్ కస్టడీలో మరణించారు. ఆయనకి పట్టిన గతి సాయిబాబాకి ఎదురుకానివ్వబోరనీ, మీరు సత్వరమే స్పందిస్తారని మీమీద మాకు గొప్ప నమ్మకంగా ఉంది.

International Solidarity for Academic Freedom in India (InSAF India)), worldwide
www.academicfreedomindia.com
Free Saibaba Coalition – US, USA

2022, జూన్ 21న చివరిగా సరిచేసిన సంస్థాగత సంతకాలు :
రిస్క్ స్కాలర్స్ అమెరికా, (Scholars at Risk, USA),
PEN అమెరికా USA, (PEN America, USA),
ఫ్రీడమ్ నౌ అమెరికా, (Freedom Now, USA),
స్టిచింగ్ ద లండన్ స్టోరీ, ద నెదర్లాండ్స్ (Stitching the London Story, the Netherlands)
రంగమాతిపదార్ ఆదివాసీ కమ్యూన్, ఇండియా (Rangmatipadar Adivasi Commune, India)
సంవిధాన్ బచావో దేశ్ బచావో అభియాన్ ఉత్తర ప్రదేశ్, భారతదేశం (Samvidhan Bachao Desh Bachao Abhiyan Uttar Pradesh, India)
భగత్ సింగ్ అకాడమీ అంబికాపూర్, భారతదేశం (Bhagat Singh Academy Ambikapur, India)
టర్బైన్ బాగ్, యునైటెడ్ కింగ్డమ్ (Turbine Bagh, United Kingdom)
ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, అమెరికా, (Indian American Muslim Council, USA)
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్ (International Council of Indian Muslims (ICIM), USA and UK )
భారతదేశ సంఘీభావ కమిటీ, జర్మనీ ( India Solidarity Germany)
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ పంజాబ్, ఇండియా (Association For Democratic Rights Punjab, India )
ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ ( Indian Workers Association GB, UK )
ఇండియన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్, ( Scheduled Caste Welfare Association UK)
డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ డెర్బీ, యునైటెడ్ కింగ్డమ్ (Dr Ambedkar Community Centre Derby, UK)
కుల వివక్షకు వ్యతిరేకంగా డెర్బీ, యునైటెడ్ కింగ్డమ్ (Derby Against Caste Discrimination, UK)
ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్, జర్మనీ (India Justice Project, Germany)
నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, గోవా, ఇండియా (National Confederation of Human Ridhts Organisatin NCHRO – GOA –India)
నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ – న్యూఢిల్లీ, భారతదేశం (NCHRO—New Delhi)
ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్, ఇండియా (Indian Social Institute, India)
డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియా (Democratic Teachers’ Front, University of Delhi, India)
స్కాటిష్ ఇండియన్స్ ఫర్ జస్టిస్, స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (Scottish Indians for Justice, Scotland, UK)
కుల వివక్ష వ్యతిరేక కూటమి యునైటెడ్ కింగ్డమ్ (Anti Caste Discrimination Alliance- ACDA, UK
పశ్చిమ్ బంగా ఖేత్ మేజర్ సమితి, భారతదేశం (Paschim Banga Khet Majoor Samity, India)
బోస్టన్ దక్షిణాసియా కూటమి, అమెరికా (Boston South Asian Coalition, USA)
భారతదేశం , అమెరికా సంయుక్తంగా ఫాసిజానికి వ్యతిరేకంగా స్థాపించ బడిన కూటమి (Coalition Against Fascism in India, USA)
ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్, ఉత్తర అమెరికా (India Civil Watch International, North America)
మానవ హక్కుల కోసం హిందువుల సంఘం, ఉత్తర అమెరికా (Hindus for Human Rights, North America)
సదరన్ ఇల్లినాయిస్ డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా, (Southern Illinois Democratic Socialists of America)
అంబేద్కర్ కింగ్ స్టడీ సర్కిల్, కాలిఫోర్నియా, అమెరికా (Ambedkar King Study Circle (California), USA)
రాడికల్ దేశి, కెనడా (Radical Desi, Canada)
బాబా బుజా సింగ్ పబ్లికేషన్స్, పంజాబ్, ఇండియా (Baba Bujha Singh Publications, Punjab, India)
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, భారతదేశం (National Platform for the Rights of the Disabled, India)

Leave a Reply