కాళోజి నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని “రట్టహళ్లి”అనే గ్రామంలో మొదటి ప్రపంచ యుద్ధం తో పాటే అనగా 09-09-1914 లో రమాబాయమ్మ రంగారావు దంపతులకు జన్మించాడు. ఈయన విద్య కొంతకాలం మడికొండలో సాగింది. తర్వాత హనుమకొండలో “సెకండ్ ఫారం ” విద్య పూర్తి చేశాడు.
కాళోజి 1939లో రుక్మిణిని వివాహం చేసుకున్నాడు.
ఈయన ప్రజా కవి, ప్రజల వైపు నిలబడి పాలకులకు వ్యతిరేకంగా రచనలు చేశాడు. రజాకార్లు అనబడే నిజాం సైన్యానికి వ్యతిరేకంగా, వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా, పోరాటం చేశాడు.
కాళోజి తెలుగు భాష పై అభిమానం ఉన్న కవి. అందుకే
” అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు
సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా” అని పరాయి భాషపై వ్యామోహాన్ని అసహ్యించుకున్నాడు.
కాళోజి నిస్వార్థ జీవి, ఉద్యమ జీవి, నిరంతరం ప్రజలను పీడించే వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు.
తెలంగాణ ప్రజలపై నిరంతరం దాడులు జరిపే నిజాం సైన్యం అయినటువంటి రజాకార్ల మీద కోపంతో ఓ కవిత రాశాడు
కాటేసి తీరాలే….
మన పిల్లల చంపి మనల బంధించిన, మానవాధములను మండలాధీశులను
మరచిపోకుండగా గుర్తించుకోవాలే
కసి ఆరిపోకుండా బుసకొట్టు చుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే
అంటూ కవితలను రాసి ప్రజలలో చైతన్యాన్ని, కసిని రగిలించాడు.
కాళోజి భాష అనేది రెండు రకాలని చెప్పాడు. ఒకటి పలుకుబడుల భాష, రెండు బడి పలుకుల భాష. మనం ఎప్పుడూ పలుకుబడుల భాష పైనే మొగ్గు చూపాలని కాళోజి అన్నారు. ఈయన కూడా పలుకుబడుల భాష పైనే ఎక్కువ ముగ్గు చూపాడు. అంటే వ్యవహారిక భాషలోనే ఎక్కువగా కవిత్వం రాసి ప్రజలలో చైతన్యం నింపాడు..
రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల నోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం
పాలు కోరడం తప్పదు”
అని ఆంధ్ర భాషాధికారానికి వ్యతిరేకంగా రచనలు చేశాడు.
కాళోజి సమాజంలోని గొడవను తన గొడవ అనుకుని “నా గొడవ” అనే పేరుతో కవితలు రాసి 8 సంపుటాలను వెలువరించారు. ఈయన కేవలం కవిత్వం మాత్రమే రాయలేదు. కథల్లో కూడా రాణించాడు. ఆయన రాసిన కథలకు ఈనాటికి ప్రాముఖ్యత ఉన్నది. ఈయన రాసిన కథలలో ఒకటి ఫేస్ పౌడర్ ఈ కథను వ్యంగంగా రాశాడు. చాలామందికి, అలంకరణపై మోజు ఉండే వాళ్లను ఉద్దేశించి ఈ కథను రాసాడు. అట్లాగే లంకా పునరుద్ధరణ అనే కథలో తెలంగాణ రాజకీయాలలోని కుట్రలో కుతంత్రాలు వంటి అంశాలను, రామాయణం లోని సుగ్రీవుడు విభీషణుడు పాత్రలకు ముడిపెట్టి ఈ కథను రాశాడు. అంటే అంతా అవినీతి రహితంగా మారాలి, అలాగే కుట్రలను ప్రజలపై రుద్దరాదంటూ మానవీయ విలువల్ని తెలియజేసే కథను రాశాడు…
అలాగే “భూతదయ” అనే ఇంకొక కథను ,అనగా ప్రాణం లేని రాతి బొమ్మలకు గుడి కట్టించే విషయంలో ముందుకు వచ్చే ప్రజలు, ప్రాణం ఉన్న అనాధ శిశువును పట్టించుకునే వారే లేరని చెప్తూ ఈ కథ రాశాడు. ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను మూఢవిశ్వాసాలను తొలగించాలనే ఈ కథ రాశాడు.
కాళోజి నాన్నగారైన రంగారావు గారికి కులం, మతం ,అనే పట్టింపు లేదు. కావున ఆ వాతావరణంలో పెరగడం వల్ల నేను కూడా కులం మతంతో సంబంధం లేకుండా పెరిగానని కాళోజీ చెప్పుకున్నాడు.
కాళోజి చాలా నిరాడంబరుడు కూడా .ఈయన “భక్త ప్రహ్లాద” చరిత్రని ఎక్కువగా చెప్తుండేవాడు.
ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని అన్యాయాన్ని అంత చిన్న వయసులోనే ఎదిరించాడు అని పొగుడుతూ ఆ కథను చెప్పేవాడు. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా గుడ్డిగా నమ్మరాదని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేవాడు.
కాళోజి “పార్టీవ్రత్యం’ అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే పార్టీ ఏ సర్వస్వం పార్టీ నా జీవితం పార్టీ నా సమస్తము పార్టీ తప్పులు చేసినా కూడా సమర్థించడం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదాన్ని సృష్టించాడు.
ఆయన ప్రశ్నించేవాడు ప్రతిదానికి పరిష్కారాన్ని వెతికేవాడు నిజానికినికి ఆయన నిస్వార్థ జీవి కూడా..
కాలేజీ గూర్చి దాశరథి ఒక మాట అంటాడు..
“కాళోజీ లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని”
ఈ ఒక్క మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు కాళోజి అంటే ఏమిటో అని. దాశరధి ఎంతటి వాడే ఆ మాట అన్నాడంటే. ఎంత ఘనతనో నువ్వు కాళోజీది..
అంతేకాకుండా… కాళోజి రాసిన “నా గొడవ” పుస్తకావిష్కరణకు వచ్చిన శ్రీశ్రీ కాళోజీ గారిని లూయి అరగాన్ అనే ప్రాన్స్ కవితో పోల్చాడు.. అంటే ఫ్రాన్స్ యుద్ధంలో అందరూ పారిపోతున్నప్పుడు లూయి అరగన్ అనే కవి మాత్రం దేశంలో ఉంటూ యుద్ధ నివారణ కవిత్వంతో, గీతాలతో ధైర్యంగా ఎదురు నిలిచాడు. కాలేజీ కూడా తెలంగాణ కోసం అలా చేస్తాడని శ్రీరంగం శ్రీనివాసరావు అన్నాడు.
ఈ విధంగా కాలోజి జీవితమంతా ఉద్యమం చేశాడు అందుకే నిరంతర ఉద్యమ జీవి అతడు.
బతుకంతా ప్రజలే అని ,దేశమే అని ,ఈ తెలంగాణనే అని ఈయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన త్యాగశీలి. కాళోజీ 13-11-2002 లో చనిపోయాడు.
ఈయన ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక మాట అనే వాడట. ” నేను చనిపోయిన తర్వాత నా దేహం కూడా వైద్య విద్యార్థుల పరీక్షకు ఉపయోగపడేలా చేయండి” అని. ఆయన అన్నట్టే ఈయన పార్టీవ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారు.
కాలోజీ వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడ ఉన్నా స్వాగతించాడు.
అన్యాయం అణచివేతలపై తిరగబడ్డాడు.
తెలంగాణ వైతాళికుడిగా పేరు సంపాదించాడు.
“తొలగి తోవను ఎవడిస్తాడు?
తోసుకొని ముందుకు పో’
అనే మాటను కూడా చెప్పినవాడు కాళోజి.
ఈ వ్యాసం చాలా బాగుంది