Love after Love
-Derek Walcott
The time will come
When, with elation,
You will greet yourself
arriving at your own door,
in your own mirror
and each will smile at
the other’s welcome,
and say, sit here. Eat.
You will love again the stranger
Who was your self.
Give wine. Give bread,
Give back your heart to itself,
To the stranger, who has loved you
all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters
From the bookshelf,
The photographs, the
desperate notes, peel your
own image from the mirror.
Sit. Feast on your life.
*
ఈ కవిత అడ్రస్ చేస్తున్నది ఎవరిని? అతడినా, ఆమెనా?
ఈ కవి చెబుతున్న ‘స్ట్రేంజర్’ కు జెండర్ ఉన్నదా?
బాధ్యతల బరువు మోతలతో అలసి, బదులుదొరకని పిలుపులతో విసిగి, ఆశాభంగాలతో కుంగి, అవసరాలుతప్ప అనుబంధాలు లేని ఒక అంచుదాకా నడిచి- సేదదీరటానికి తమదైన ఒక చోటుకోసం ఆలస్యంగానైనా వెతుక్కుంటున్న అందరినీ కదా!
ఆ స్థితి చాలాసార్లు “ఆమె” లది అవుతుంది. కొన్నిసార్లు “అతడు” లది కూడా!
సెల్ఫ్ లవ్! నిన్ను నీవే ప్రేమించుకోడం!
సాహిత్యంలోనే కాదు, ఇటీవలి కాలంలోని అనేక సందర్భాల్లో ఈ భావన తరచుగా వినబడడం దేనికి సూచిక?
మొన్నటి బాధ్యతలు, నిన్నటి ఆదర్శాలు మనకు నేర్పింది “నీ” నుండి నువ్వు విస్తరించమని కదా!
వ్యక్తిగతం నుండి సమూహం లోకి ప్రవహించమని కదా!
నిన్ను నువ్వు కాదు- సమూహాన్ని ప్రేమించమని కదా?
విశ్వప్రేమ, వసుధైక కుటుంబం, రక్తసంబంధంకన్నా చిక్కనైన వర్గసంబంధం- వీటిని కదా ప్రేమించాం?
స్నేహంలో, ప్రేమలో, సాహచర్యంలో, కలిసి నడిచే ఆదర్శాల్లో, “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు” మనుషులు దొరుకుతారని కదా నమ్మాం!
ఇప్పుడెందుకు అన్ని సంబంధాలమీదా అపనమ్మకం వినబడుతోంది? “నీ నీడే నీకు తోడు” అనే నైరాశ్యం కనబడుతోంది?
నిజమే, వాడుకుని పారేసే వస్తువులతో మార్కెట్లు మనల్ని ముంచెత్తుతున్న కాలంలో ఉన్నాం. మనిషి వస్తువుకన్నా చవకైన సందర్భంలో నిలబడ్డాం. అవసరాలే మానవ సంబంధాలను నిర్దేశించిన సందర్భాలు గతంలో అసలే లేవని కాదుగానీ, అదే సార్వత్రిక సూత్రమైన సమయాన్నిప్పుడు చూస్తున్నాం. ఇప్పుడిక మానవ సంబంధాల రక్షణకు వ్యవస్థాగతమైన ఏ నిర్మాణమూ పూచీ పడదు. స్వీయరక్షణ తప్ప మార్గం లేదు.
సరిగ్గా ఇక్కడే, ఇందుకే- నిన్ను నువ్వు మిగుల్చుకోమనే హెచ్చరిక అవసరం అవుతోంది.
ఇంతకూ ఈ “స్వీయ ప్రేమ” స్వరూపం ఏమిటి?
మతతాత్వికతలు చెప్పిన ఆత్మ జ్ఞానమా? వ్యాపార నాగరికత చూపిన నార్సిసిజమా? పోటీ ప్రపంచం నేర్పిన పరుగు పందెమా? వాటిలో జవాబు దొరకకనే కదా ఇప్పుడు ఈ వెదుకులాట!
గతం మనకు నిర్దేశించిన మార్గాల్లో అడుగు మోపేముందు, బాధ్యతల బరువు మూటను తలకెత్తుకునే ముందు, లోకం బహూకరించే ముళ్ళ కిరీటాన్ని స్వీకరించేముందు… మన శక్తిని, సంసిద్ధతను, ఇష్టాయిష్టాలను అంచనా వేసుకున్నామా? అపురూపంగా భద్రపరచుకున్న మన హృదయాన్ని అనర్హులకు ధారపోశామా? అర్థరహితమైన త్యాగాలకు పాల్పడి అవమానపడ్డామా?
కుటుంబంలోనైనా, బయటి సమాజంలోనైనా అడుగడుగునా సరిచూసుకోవాల్సిన విషయాలుకదా ఇవి!
మన వైఫల్యాలకు, నిరాశలకు మూలాలు ఇక్కడే కదా!
ఇన్ని వడపోతల తరువాతనే కదా నిక్కమైన నిన్నునువ్వు ఆనవాలు పట్టేది? ఆ నిన్ను నువ్వు కాపాడి, గౌరవించి, విమర్శించి, నీకునువ్వొక ప్రేమలేఖ రాయనిదే నీ మాటలకైనా, చేతలకైనా అర్థం ఎక్కడిది?
Good article
మంచి పోయెమ్ కాత్యాయని గారూ, మీరు లేవనెత్తిన ప్రశ్నలు కూడా. పోయెమ్ ను అట్లా డిస్సెక్ట్ చేయొచ్చా అనే ప్రశ్నను పక్కనపెడితే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనే భావన తప్పు కాదనుకుంటా. తనను తాను ప్రేమించుకోని వ్యక్తి ఇతరులను మాత్రం ఎలా ప్రేమిస్తారు. ఇది మరో ప్రశ్నను కూడా గుర్తు చేస్తుంది. నాకు నచ్చింది కాబట్టి నేను పలానా పనికి అంకితమవుతానా, లేక ఏసుక్రీస్తు ముళ్లకిరీటం మాదిరి బ్యాక్ గ్రౌండ్లో త్యాగజీవి వమ్మా అని పాట వినిపిస్తుండగా గంభీరమైన స్వరంతో సామాజిక భారం వల్ల వంగిన తలతో అదో మాదిరి అదరైజేషన్ ను ప్రదర్శిస్తామా అనే ప్రశ్న. ఏళ్లుగా నానుతున్న ప్రశ్న. నేనైతే నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా అనే అంటా చేస్తున్నట్టయితే. ఇక్కడి ప్రశ్న కూడా అంతేనేమో. తనను తాను సరిగా ప్రేమించుకునే వ్యక్తే పరులను కూడా సవ్యంగా ప్రేమించగలరేమో. ఘర్షణ మాత్రమే కాకుండా రెంటి మధ్య ఐక్యత కూడా ఉందేమో! తన మాటను చేతను తన ప్రతినిధిగా చూడడం అందులో భాగమనుకుంటాను. పాపులర్గా చెప్పుకుంటే తాను కోరుకున్న విధంగా జీవించడం. ఆ కోరుకున్న విధంగా అనేది అనేది ఇతరులు కోరుకున్న విధంగా జీవించే పరిస్థితుల కల్పనతో జత కలిసి ఉండాలని అనుకోవడం ఉన్నతమైనది(జత కలవని వారినందరినీ శత్రువులుగా చూడనక్కర్లేదు. ఇతరులకు హాని చేయనంత కాలం ప్రతి మనిషికి తాను కోరుకున్న విధంగా జీవించే హక్కు ఉంటుంది). మనల్ని మనం ప్రేమించుకోకుండా అలాగే ప్రేమను ఆశించకుండా మనుషులు జీవించడం సాధ్యమేనా, అది ఆశించదగినదేనా అని అనుమానం. ప్రేమను ఎలా డిఫైన్ చేస్తావు అనేది వేరే విషయం. వ్యక్తి సమూహం మధ్య సంబంధం కూడా గతి తార్కికమేనేమో కదా! పరస్పర పూరకమేమో కదా!