(చరిత్ర నిర్మిస్తున్న ప్రజలతో కలిసి గొంతెత్తి నినదిస్తున్న కవి వరవరరావు. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కాలాన్ని కాగడాగా వెలిగిస్తున్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో చరిత్రతో కలిసి ప్రవహిస్తున్నారు. యాభై ఏళ్లకు పైగా నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన కవిత్వం సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబం. వరవరరావు కవితల్నించి ఎంపిక చేసిన కొన్ని కవితల ఆంగ్లానువాదం, Varavara Rao : A Life in Poetry పేరుతో పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. దీనికి సంపాదకులు ఎన్.వేణుగోపాల్, మీనా కందసామి. ఈ పుస్తకాన్ని జులై 13న హైదరాబాద్ లోని లమకాన్ లో ఆవిష్కరించారు.
కవిగా, వ్యక్తిగా వరవరరావు గురించి, ఈ అనువాదం గురించి మీనా కందసామి, ప్రముఖ కవి శివారెడ్డి, వి.శ్రీధర్ (ప్రొఫెసర్, అనువాదకుడు); చందనా చక్రవర్తి (శాస్త్రవేత్త, రచయిత్రి) మాట్లాడారు. వి.శ్రీధర్ ఉపన్యాసం తెలుగు అనువాదమిది.)
వరవర రావు: ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ. ఈ పుస్తకం సబ్ టైటిల్ ను నేను సరిగ్గానే చదువుతున్నానా? అది లైఫ్ ఇన్ పొయెట్రీనా? ఎ లైవ్ వైర్ అఫ్ పొయెట్రీనా?
పుస్తకం తొలి పేజీల్లోనే “Livewire is Better than a Poet” అన్న శీర్షికతో ఒక కవిత ఉంది. “Companion” అనే మరో కవితలోని ఈ పంక్తుల్ని చూడండి:
Birds like my urge for freedom
Waiting on the power line
మరి కొన్ని కవితల్లో కూడా ప్రతిధ్వనించే ఆ ముళ్ల తీగపై కూర్చున్న పక్షుల పదచిత్రం వరవర రావు గారి ఈ అద్భుతమైన కవితా సంకలనం జీవనాడిని పట్టుకుంటుంది. ఒక కవియొక్క అరవై ఐదేళ్ల కవిత్వాన్ని నలభై ఎనిమిది కవితాల్లోకి కుదించడమనే పని ఎంత కష్టమై ఉండిఉంటుందో, ఎంత బాధాకరంగా ఉండిఉంటుందో! ఈ పనిని
చేయగలిగినందుకు ఎన్. వేణుగోపాల్, మీనా కందసామిలను ఎంతో అభినందించాలి. ఒక్కొక్క కవితకు ఇచ్చిన పాదసూచికలలో వాటి చారిత్రిక సందర్భాలను వివరించడంలో వాళ్ళు పడ్డ శ్రమను గుర్తించకుండా ఉండలేము. పాదసూచికల సాయంతో ఒక్కొక్క కవితను చదువుతుంటే ఒక్కొక్క కవితా మన కళ్ళముందే పుడుతున్నట్టనిపిస్తుంది.
తన పరిచయ వాక్యాల్లోనూ, అనువాదాల గురించి రాసిన వివరణలోనూ మీనా కందసామి “ఈ సంకలనం ఎడిటర్లుగా మేమొక సందిగ్ధ పరిస్థితినెదుర్కొన్నాం. సందర్భం వివరించకుండా ఉంటే ఈ కవితలు సరిగా అర్థం కావు; అలాగే సందర్భ భారంతో కవితలకుండే సున్నితత్వం కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు” అంటారు (xi). పాదసూచికలను ఇవ్వడంలో వేణుగోపాల్ పాత్ర ఎక్కువగా ఉండిఉండాలి. అందుకేనేమో మీనా కందసామి వేణుగోపాల్ “కవితా వస్తువులపట్ల పెట్టిన ప్రత్యేక శ్రద్ధ”ను ప్రత్యేకంగా మెచ్చుకుంటారు. 3
జూలై ఆంధ్ర జ్యోతి లో రాసిన వ్యాసంలో వేణుగోపాల్ తన ముప్పై ఏళ్ళ కల ఫలించినట్లు తెలిపారు. అంతకుముందు తాను చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, వరవర రావు ఇటీవలి అరెస్ట్ తరువాత ఆయన కవితలను నలభై భాషలలోకి అనువదించి ఒక వెబ్సైట్లో 24 గంటలపాటు చదవడం లాంటి ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వచ్చిన ప్రతిస్పందన తనను ఈ ప్రయత్నం చేయడానికి పురికొలిపిందని అన్నారు. మీనా కందసామి కూడా తన పరిచయ వాక్యాల్లో ఈ సంఘటనే పుస్తకం ప్రచురించాలనే తన ఆలోచనను దృఢపరిచిందని చెప్పింది. అదే ఆంధ్ర జ్యోతి వ్యాసంలో వేణుగోపాల్ ఈ పుస్తకంలో చేర్చిన కవితల్లో వరవర రావు గారు ఇంగ్లీషులోకి రావాలనుకున్న కవితలు కూడా ఉన్నాయన్నారు.
“కాదేదీ కవితకనర్హం” అన్న కవితలో శ్రీశ్రీ కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా వంటివి కూడా కవితావస్తువులు కావొచ్చని చెబుతారు. దీనినుంచి స్ఫూర్తి పొందినట్లు అనిపించే 1958లో ప్రచురింపబడ్డ (1968 లో వచ్చిన చలినెగళ్లు సంకలనంలో ఉన్న) “Where Has the Puppy Gone?” (వేణుగోపాల్ అనువాదం) కవితలో వరవర రావు ఒక చనిపోయిన కుక్క కళ్ళలో వర్గ పోరాటాల్ని చూస్తారు. ఆ కుక్క స్వార్థ పరులైన మానవులు తాము చనిపోయిన తరువాత వెళ్లాలనుకునే స్వర్గం నుంచి తప్పక తిరిగి వస్తుందంటారు.
దీనికి తోబుట్టువన్నట్టు ధ్వనించే “అకవితా వస్తువు” అనే తెలుగు శీర్షికతో 1958 లోనే వెలువడ్డ కవితకు వేణుగోపాల్ అనువాదం “Marilyn Monroe” చివరి పంక్తుల్ని పరిశీలిద్దాం. సమస్యలతో కూడిన మన్రో జీవితం ఎక్కువ నిద్ర మాత్రలు తీసుకోవడంవల్ల ముగిసింది.
This world has closed its eyes
To the splendour of your heart
Which enhanced the elegance of your body.
That’s why your sleepless eternal search for peace of mind
Resulted in that beautiful long slumber…
1964లో వచ్చిన “ఆకలి” (“Hunger”) అన్న కవిత (వేణుగోపాల్ అనువాదం) ఒక భిక్షగత్తె తననూ, తన పిల్లలనూ పోషించుకోలేని కడుపుకు సంబంధించిన ఆకలినీ, ఆమె తీర్చలేని ఒక మగవాని దేహానికి సంబంధించిన ఆకలినీ పక్క పక్కన పెట్టి చూపిస్తుంది.
“జీవనాడి” అనే కవితకు “The Pulse” అనే పేరుతో వేణుగోపాల్ చేసిన అనువాదంలో అణగారిన ప్రజల తరఫున నిలబడి భరోసానిచ్చే వరవర రావు గారి స్వరం స్పష్టంగా వినబడుతుంది:
I am the leader of my generation
I am the singer, the voice of my epoch.
మరి కొన్ని పంక్తుల తరువాత ఆయనే
Am I the only hope still left
In this world for the hapless ones
Down and out
In hunger, in unfulfilled desire?
అంటారు. నిజంగా “I am the only hope still left / In this world for the hapless ones/Down and out/ In hunger, in unfulfilled desire.” అని ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రగాఢ నమ్మకం కవితలో “I am the radiance of this age” and “I am the harbinger of change.” అన్న చివరి పంక్తి వరకూ కొనసాగుతుంది.
“Livewire is Better than a Poet” (1968) అనే వేణుగోపాల్ అనువాద కవిత “The Pulse” అనే మరో కవితకు విరుద్ధంగా ఉన్నట్లు కనపడినా, అది నిజంగా దానికి తోడైనదే. ఆ కవితలో “What is it that poets have achieved since time immemorial?/ Except revealing some fantastic falsehood/ Or covering truth in symbolism/ So as not to hurt the unjust?” అని ప్రశ్నిస్తారు. ఈ కవిత ఈ కింది విధంగా ముగుస్తుంది:
If a poet is one who expresses
fabulously on paper alone
Livewire would be better than a poet.
వరవరరావు గారు మాటాల్లోనే కాక చేతల్లోనూ కవి విద్యుత్తు ప్రసరిస్తున్న తీగలా ఉండాలని ఆశిస్తారు.
ఈ సంకలనంలో చంపబడిన కార్యకర్తల గురించి ప్రత్యేకంగా రాసిన కవితాలున్నాయి. వానిలో ఊరేగింపు (1974) నుంచి తీసుకున్న కవితకు రోహిత్ చేసిన అనువాదం “Assassination of Satyam” ఉంది. శ్రీకాకుళం గిరిజనుల తిరుగుబాటు, సాయుధ పోరాటాల్లో 1970లో చంపబడ్డ వెంపటాపు సత్యనారాయణ కోసం రాసిందది. “సత్యం” అన్న పదం ఆ కార్యకర్తనూ, నిజాన్నీ ఉద్దేశించి రాసింది. ఇంకా “సత్యం” శ్లేషార్థంలో సత్యం వద/ సత్యం వధ అన్న వాక్యాలను సూచిస్తుంది.
కవితలో ఇంకా ముందుకెళ్లి కవి ఈ విధంగా అంటారు:
See if it's really the truth that is dead.
It is the government that is saying that
The truth has died.
ఇంకాస్త ముందుకెళ్లి:
It is those who turned days and nights
Upside down, those whose job is to legitimize
Exploitation in the name of representing people.
చిట్టచివరగా
In the conflict between falsehood and truth
Truth has been killed. అంటారు.
ఆరు మంది కవులూ, నలభై మంది కార్యకర్తలపై పెట్టిన “సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు” నేపధ్యంగా రాసిన కవితకు జే. సి. చేసిన అనువాదం “Sab Theek Hai”. అందులో జైలు గురించి రాస్తూ:
The moon gets caught in the barbed wire
Over the prison walls.
And we, after singing and talking
Lose ourselves in the dreams of revolution.
అంటారు. ఈ కవితలో ఆసక్తికరంగా రాజ్యం తాలూకు దౌర్జన్యానికి సాధనాలైన పోలీసుల పైన జాలి కూడా కనిపిస్తుంది:
But the poor lonely policeman
Exiled from sleep and shelter
Yawns out every hour
‘Sab Theek Hai!’
పోలీసులపై సానుభూతి కే. బాలగోపాల్ అనువదించిన కవిత “Yes, He Too is a Man” లోని కింది పంక్తుల్లో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాదసూచికలో ఈ కవిత 1978 లో పంజాబులో పోలీసులు మంచి జీతాల కోసం పోరాడినప్పుడు రాసినట్టు తెలిపారు.
When the stomping of his boots die out
When the sharp crease on his clothes wears out
And his feet touch the ground
And his skin touches the air
He again becomes a man.
అలాగని కవి పోలీసుల హింసాకాండను మరచినట్టు కాదు. మరో కవిత “Photo” లో
“It is in fact the stench of/ Iron heels and brutal feet/ The stink of khaki dress” అంటారు.
ఒక కసాయి తాను చూసిన బూటకపు ఎన్ కౌంటర్ ను వర్ణిస్తూ ఈ కింది పంక్తుల్లో:
Six lathis broke on his bones
In a mad rage.
The butt of the rifle thrashed his body
To pulp.
It’s mouth stuck the policeman’s jaw.
They said then
That the prostrate youth had attacked with a knife
And there was an ‘encounter’
అంటాడు. కొన్ని పంక్తుల తరువాత
I too kill animals
…
But never and to none have
I sold myself
అంటాడు. నిజమైన కసాయి ఎవరు, మాంసాన్ని అమ్మి బతుకీడ్చే నేనా, రాజ్యమా? అని కసాయి అడుగుతున్నాడిక్కడ.
“Woman” అనే శీర్షికతో మీనా కందసామి అనువాదంచేసిన కవిత బహుశా ఒక స్త్రీ మాత్రమే అనువదించగలది. దీనిపై మీనా కందసామి ముద్ర ప్రస్ఫుటంగా కనబడుతుంది. చాలా క్లుప్తంగానూ, ఇంగ్లీషులోనే రాయబడినట్లనిపిస్తుంది. కానీ స్త్రీని భోగ వస్తువుగా చూసే సామాజిక వ్యవస్థకు సంబంధించిన, ఆమె ప్రస్తుత పరిస్థితిని కూలద్రోసి విప్లవపథంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం, ఆమెకు అవసరమైన శక్తి గురించి రాసిన పంక్తులు ఈ అనువాదంలోకి రాకపోవడం దురదృష్టం.
సంకలనంలో తల్లి గురించి రాసిన కవిత ఒకటి ఉంది. 1986 లో పీపుల్స్ వార్ కార్యకర్తలను చంపినా సంఘటనకు స్పందిస్తూ రాసిన కవితకు వేణుగోపాల్ అనువాదం, “Beseeching the Mother” లో కవి ఇలా అడుగుతారు:
Should I tell that innocent mother
That the children laid down their lives for her?
They sacrificed their lives
For the mother who gave them life!
Should I for that purpose only
Beseech her to contribute more offspring?”
ఇక్కడ తల్లులు బిడ్డల్ని విప్లవం కోసం మాత్రమే కంటూ ఉండాలా అన్న ప్రశ్న రాకమానదు.
కవిని ఉద్దేశించి వరవరరావు గారు ఉపయోగించే మెటఫర్లు చాలా సంక్లిష్టతతో కూడుకొని ఉంటాయి. కే. వీ. ఆర్. చేసిన ఒక అనువాదం శీర్షిక “The Poet is No Lion, But a Stream.” ఇందులో ఒక విప్లవ కవిగా ఆయన సింహాన్ని కాక ప్రవాహాన్ని ఎన్నుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఐతే
ఇందులోని కిటుకు మనం కవిత చివరకు వెళ్లేసరికి అర్థమౌతుంది. మూల రచనలో ఆయన సర్కస్ లో సింహాన్ని మచ్చిక చేసుకోగలిగినట్టు ఒక కవిని మచ్చిక చేసుకోలేమని అంటారు. ఈ సూక్ష్మం అనువాదంలో కానరాకపోవడం దురదృష్టం. కానీ “Intellectual” అనే మరో కవిత అనువాదం మూల కవిత శక్తిని అట్టే పట్టుకుంది. ఆ కవిత ఇలా ముగుస్తుంది:
When crime seizes power
Hunts down people
Holds them criminal–
Anyone who remains silent
Becomes a criminal.
“Fire is Justice” అనే శీర్షికతో వేణుగోపాల్ అనువదించిన కవితలో కవి వ్యక్తిలో, చెట్టులో, రాయిలో, మిణుగురులో ఇలా అన్నింటిలో నిప్పునుచూస్తారు:
Yes, there is fire hidden in every tree
In the hands or branches or green leaves
…
Only wind has to bring those hands together
…
A whirlwind rages.
And the forest gets torched.”
“The Bard” అన్న శీర్షికతో డీ. వెంకట్ రావు చేసిన అనువాదంలో కవి ఉపయోగించే మాటల శక్తి మరింతగా కనబడుతుంది:
When the tongue pulsates
Tone manumits the air, and
Song turns missile in battle.
The foe fears the poet,
Incarcerates him, and
Tightens the noose around his neck.
But already, the poet in his notes
Breathes among the masses.
పై పంక్తులను చూస్తే, కవి మాటలు ప్రజల్లోకి వెళ్లిన తరువాత రాజ్యం కవినెలా నిర్బంధించగలుగుతుంది అని అడుగుతున్నట్లుంది. “Words” శీర్షికతో ఉన్న మరో డీ. వెంకట్ రావు అనువాదంలో కవి ఇలా అంటున్నారు:
I must be tethered to the word, abide by it.
What’s one’s legacy after betraying the word?
“Chains Write Now” అనే కవిత రాజకీయ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో ఏ కారణమూ చూపకుండా చాలా మంది రచయితలనూ,
మేధావులనూ అరెస్ట్ చేసినపుడు రాసినది. ఈ వేణుగోపాల్ అనువాదంలో కవి:
Here, inside, I am among countless people.
I am with the strength of my beliefs
With the power of people, like a volcano
That will erupt lava and fumes in the future
Even if it appears silent today.
In this long, silent imprisonment
I am sharpening my thoughts.
Dictator [a reference to Indira Gandhi], now my chains are writing
Tomorrow I will sing full-throated in freedom
అంటారు.
ఈ కవిత థోరో 1848లో రాసిన “సివిల్ డిసొబీడియెన్స్” అనే వ్యాసాన్ని, ప్రత్యేకంగా ఈ మాటలను గుర్తుకు తెస్తుంది: “Under a government which imprison any unjustly, the true place for a just man is also a prison.”
రోహిత్ చేసిన “What We Need is Poetry” అనే అనువాదం సుతిమెత్తని సున్నితత్వమూ, అణచివేతదారుణ్ని ఎదిరించి, ధిక్కరించే శక్తినీ ఒకే కవితలో పక్క పక్కన అమరివుండటాన్ని చూపిస్తుంది:
The poetry with an embryo
That explodes into a blossom
The poetry that flowers
Releases fragrance and
Comes to fruition.
The poetry with a spine
That can stand up to the system
And hold it accountable,
The poetry that refuses power.
The poetry that challenges the state.
మనం మరవలేని మరో కవితకు అనువాదం డీ. వెంకట్ రావు చేసిన “The Day of Naming.”
1986లో ఇంద్రవెల్లి స్మారక చిహ్నం విధ్వంసాన్ని గురించి చదివిన తరువాత రాసినది. ఇందులోని పంక్తులు కొన్ని:
There
The wood and pit, valley and pinnacle
Bird and reptile, water and fire
Man and beast, field and nest
Darkness and light
All of them bear just (one) name:
The forest.
The forest is both mother and baby itself.
…
Indravelli may not belong
To the people of the past
Nor could yesterday’s Cenotaph own it
But it will not abide by those
Who bulldozed it today.
Nurtured on the flesh and blood of the tribe
The forest will abide.
Fused in the primordial vitality
The soul will prevail.
The kiss of the martyrs will persist.
“Corpse of Bhetal” కార్యకర్తల లాక్-అప్ మరణాల గురించి భేతాళుని కథను యుక్తిగా వాడి రాసినది. వేణుగోపాల్ చేసిన అనువాదంలో ఇలా సాగుతుంది:
Corpse of Bhetal
Carrying the dead body from the lock-
up on my back
I began walking.
‘I will let you know the episode of my death
Solve the riddle: Was it a natural death or murder?
Said the corpse.
If a dead body, that too from the lock-up, speaks,
That must be a murder
I said.
Despite being happy, as I told the truth
The corpse vanished to be reborn in another lock-up
As it was a crime for a living man to speak.
1986 లో రిజర్వేషన్లు పెంచాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సులకు వెతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంలో రాసిన కవితలోని వెటకార స్వరాన్ని కే. బాలగోపాల్ చేసిన అనువాదం “Dejavu” లోని కింద పంక్తుల్లో చూడవచ్చు:
You are meritorious
You can break the windows of buses
In a shape as symmetric as the sun’s rays.
…
You are the marathoners
In merit competition.
Poor tortoises,
Can we run with you?
…
If you sweep
The cement road with a smile
Tucked-in shirts and miniskirts
Jeans and high heels
It becomes an Akashvani scoop
And spellbinding Doordarshan spectacle.
…
Yours
Is a movement for justice
On this earthly paradise.
That is why
‘Devathas’ dare more for
the saced nectar.”
…
The moment
You gave a call for ‘jail bharo’
We were shifted out
From the barracks
To rotting dungeons.
…
How foolish!
The meritorious cream
The future
Of the county’s glorious dream
How can they come
To the he’ll of thieves,
Murderers and subversives?
18 ఏళ్ల రూప్ కాన్వార్ ఆలోచనలను లక్ష్యపెట్టకుండా భర్త చితిపైనే సతి చేయమన్న సమాజానికి బదులుగా వెటకారస్వరం ధ్వనించే మరో కవితకు అనువాదం వేణుగోపాల్ చేసిన “Chunri “:
It is true that
He dragged her on to his pyre
As he would drag her on to his bed
With the same authority.
She performed sati as freely
As she lived.
వేణుగోపాల్ అనువదించిన “No Classes Tomorrow” లో సున్నిత హృదయాలుండే పడిపోయిన మొగ్గలు, వాడిపోయిన పూలు, రాలిన
నక్షత్రాలను పోలిన స్కూలు పిల్లలు కనిపిస్తారు. “Tomorrow there won’t be any classes” అన్న మాటలు తిరిగి జైలులోకి తీసుకొని వెళ్లబడుతున్న కవిని చూసిన పిల్లలు మరుసటి రోజు జరిగే నిరసనవల్ల సెలవు ప్రకటించే అవకాశాన్ని గురించిన ఆశను వ్యక్తం చేస్తున్నాయా?
“Schools and Prisons” శీర్షికతో ఉన్న రోహిత్ అనువాదం పిల్లల దైన్య స్థితిని ఇంకా శక్తిమంతంగా ప్రతిబింబిస్తుంది:
It is to chain freedom
That a school or a prison exists.
They are the centres of ‘reform’
To train kids to be adults
To make criminals out of humans.
పిల్లలకు అబద్దాలు పలకడంలో తర్ఫీదునిచ్చి స్కూళ్ళు వాళ్ళను ఎలా భవిష్యత్తులో పాలకులుగా తయారు చేస్తాయో, ప్రైవేట్ ఆస్తులకు వెతిరేకంగా చేసిన పనులకు ఖైదీలెలా నేరస్తులుగా మారతారో కవి ఈ కవితలో చెబుతారు.
ఇలా జైలులో రాసిన ఎన్నో కవితలతో నిండిన ఈ కవితల సంపుటం అంతకు ముందు వరవర రావు గారు జైల్లో రాసిన ఉత్తరాల సంకలనంగా ఇంగూగి వా థియాన్గో ముందుమాటతో పెంగ్విన్ సంస్థనే ప్రచురించిన ఆంగ్లానువాదం Captive Imagination (2010) సరైన జోడీగా నిలుస్తుంది. “ఇది వరవర రావు గారి కవితా సృజనాత్మతలో ఒదిగిన ఒక అతి ముఖ్యమైన సామాజిక చరిత్రకు సంక్షిప్త నిదర్శనమని” పుస్తకం గురించి వెనుక అట్ట మీది మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నేను మీనా కందస్వామి నమ్మినట్లు “ఇలాంటి సంస్థాగతంగా మౌలికమైన ఆలోచనలకూ సంబంధించిన రచనలు తప్పక ఇంగ్లీష్ మాట్లాడే దేశాల ఊహాప్రపంచ, సాంస్కృతిక లోకాలలో స్థానం పొందగలవని” భావిస్తున్నాను.
గమనిక: ఈ వ్యాసం సంక్షిప్త రూపంలో ది బుక్ రివ్యూ లో పుస్తక సమీక్షగా ప్రచురణకు అంగీకరింపబడింది. వారి అనుమతితో ఇక్కడ కొలిమి లో ప్రచురింపబడుతోంది.