(రెండీ మెక్ క్లెవ్ (ఆష్ లాండ్, కెంటక్కీ, అమెరికా)
తెలుగు అనువాదం -గీతాంజలి)
నిజమే సైనికులు మన దేశాన్ని కాపాడే దేశభక్తులు
ఎప్పటిదాకా అంటే… వాళ్ళు ట్రాన్స్ జెండర్స్, స్వలింగ సంపర్కులు కానంత వరకు మాత్రమే!
“వీళ్ళు అంటే ట్రాన్స్ జెండర్లు ధైర్యంగా స్వేచ్ఛ కోసం పోరాడరు.. శత్రువులకి భయపడి వాళ్ళు పిరికి పందల్లా పారిపోతారు లేదా లొంగిపోతారు”.
మీకు తెలుసా… ఇది నేను కాదు… సాక్షాత్తు దేశాధ్యక్షుడు మాట్లాడిన బాధ్యతా రహితమైన మాటలు
ఈ భావనలని నేను కొట్టి పడేస్తాను… ఏమాత్రం అంగీకరించను!
*
సైనికులెప్పుడూ సైనికులే వాళ్ళు ఇక్కడ పురుషులా… స్త్రీలా ముఖ్యం కాదు.
వాళ్ళు సహజంగానే పుడతారు
అందరిలా దేశభక్తి తోనే పెరుగుతారు.
ఒక లింగానికి చెందిన లేదా ఒక వ్యక్తిగా మిగతావాళ్ళు ఏం చేయగలుగుతారో… ట్రాన్స్జెండర్లు కూడా అంతే బాగా చేయగలరు
విషాదమేమంటే… కొన్నిసార్లు అది వాళ్ళ ఆత్మ పైన మాయని ఒక టాట్టూలా ముద్రించ బడ్డమే కాదు… దాచబడుతుంది కూడా
*
“మా సైన్యం స్వలింగ సంపర్కులని… ట్రాన్సజెండర్లని అంగీకరించదు
మేము కేవలం విజయం సాధించే వ్యక్తులని మాత్రమే స్వీకరిస్తాం”
చూసారా… ఇవి తన జుట్టుకి రంగేసుకున్న… తన కోటుకి బేబీ పిన్నులు పెట్టుకున్న దేశాధ్యక్షుడి మాటలు
సైనికులు గొప్ప దేశభక్తులు
కానీ వాళ్ళు ఎన్నడూ రిపబ్లికన్స్ కాలేరు.
ఎందుకంటే వాళ్ళు మరణించడానికి సదా సిద్ధ పడ్డవాళ్లు కాబట్టి.
స్వచ్చందంగా లేదా గుర్తింపు ఉన్న డ్రాఫ్ట్ ద్వారా దేశం కోసం ఒక్క రోజూ కూడా సైనికుడిగా మారని
ఒక దేశాధ్యక్షుడు లేదా రాజకీయ పార్టీ కి చెందిన మనుషులు మాత్రం మా ట్రాన్సజెండర్స్ ని చూస్తూ వేళాకోళంగా పగలబడి నవ్వుతారు.
*
ఒక సైనికుడు దేశం కోసం నిలబడతాడు… శత్రువుతో పోరాడి మనకి స్వేచ్చాస్వాతంత్రాలని… ఇస్తే… మనం ఆ భూమి మీద నిలబడి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాం !
వీళ్ళకి తెలియాల్సింది ఏమిటంటే దేశ స్వాతంత్రం కోసం… చమురు లాంటి వనరులను కాపాడ్డం కోసం… లేదా ప్రాణత్యాగం చేయడం కోసం
సైనికుడి పాంటు లోపల ఏముందో… వాళ్ళు భుజాలని కప్పని జాకెట్టు వేసుకొని ఉన్నారా… లేదా కప్పుకున్నారా అన్న దాంతో సంబంధమే లేదు.
కానీ ఇప్పుడు మనకి ఎలాంటి అధ్యక్షుడు ఉన్నాడంటే… జీవితంలో ఒక్కరంటే ఒక్కరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఒక క్షణం కోసం కూడా పోరాడని వాడు… ట్రాన్సజెండర్లందర్నీ మాత్రం బయటకి పంపేయాలని చూస్తున్నాడు.
*
(కవిత ప్రేరణ: అమెరికా -ట్రాన్సజెండర్ల పైన ట్రంప్ చేసిన ఎగతాళి వ్యాఖ్యలు)